ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్‌..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..! | Former Engineer Now Living On The Streets As A Garbage Collector | Sakshi
Sakshi News home page

ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్‌..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!

Oct 1 2024 12:13 PM | Updated on Oct 1 2024 12:13 PM

Former Engineer Now Living On The Streets As A Garbage Collector

కోట్లకు పడగలెత్తిన వ్యక్తులైన ఒక్కోసారి అమాంతం కుప్పకూలిపోతారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయి రోడ్డుపాలవ్వుతారు. అరే ఒకప్పుడూ ఎలా ఉండేవాడు ఇప్పుడిలా అని అంతా నోరెళ్లబెడతారు. ఎందుకిలా అనేది ఇది అని చెప్పలేం కానీ చూసేవాళ్లకి ఎవ్వరికైన మనసు ఒక్కసారిగా చివుక్కుమంటుంది. అలాంటి దృశ్యమే నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోని చూస్తే ఎవ్వరికైన ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేస్తాయి. 

జిగల్‌ రావల్‌ అనే సామాజికి కార్యకర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వృద్ధ వ్యక్తి మాట్లాడుతూ కనిపిస్తాడు. అతడు ఒకప్పుడు ఇంజనీర్‌గా బాగా బతికిన వాడినని చెప్పాడు.తాను బాగా సంపాదించేందుకు భార్య పిల్లలతో సహా దుబాయ్‌ వెళ్లానని, అయితే అక్కడ తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

తన భార్య తనను వదిలేసి పిల్లలను తీసుకుని వేరే అతనితో వెళ్లిపోయిందని బాధగా చెప్పాడు. ఆమె కోసం సంపాదించాలనుకోవడమే తనకు శాపమయ్యిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తాను పొట్ట పోషించుకోవడం కోసం ఇలా వీధుల్లో చెత్త ఏరుకుంటూ బతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. 

అతడి పరిస్థితి విన్న ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు మంచి ఫ్రోషనల్‌గా బతికిన వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో జీవనం సాగించడం ఏంటీ..? అసలు  విధి ఇంత ఘోరంగా మనుషులతో ఆడుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్‌ ఫేమస్‌ వటకం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement