garbage collection
-
‘బస్తీ’... దొరసాని
చెత్తను సేకరించే అమ్మాయి అధికారిణి అయితే... కలలను నిజం చేసుకోవడానికి స్థాయి అక్కర్లేదు అని చూపుతోంది హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పిల్లిగుడిసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఇటీవల ఒక రోజు బాధ్యతలు నిర్వహించి, వివిధ శాఖలను సందర్శించి, అక్కడి పనితీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా అందుకున్న గౌరవాన్నే కాదు, తెలుసుకున్న విశేషాల గురించీ పంచుకుంది.‘‘మూడు సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నాను. 2021లో రన్నరప్ వచ్చింది. ఈ ఏడాది ఒక రోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కి ఎంపికయ్యాను అని తెలిసి, చాలా ఆనందించాను.రోజంతా కార్యక్రమాలతో బిజీ...ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను సూట్ వేసుకొని అధికారిణిగా మా బస్తీ నుంచి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సర్‌తో కలిసి బయల్దేరాను. మొదటగా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును సందర్శించాం. అక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నీరజ జొన్నలగడ్డ గారితో మాట్లాడాను. రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు మొత్తం తిప్పి చూపించారు. అక్కడ జరిగే వర్క్ గురించి అంతా తెలుసుకున్నాను. అక్కణ్ణుంచి... మై ఛాయిస్ ఫౌండేషన్‌కు వెళ్లాం. గృహహింస, ట్రాఫికింగ్ పైన ఆ సంస్థ పనిచేస్తుంది. పది రాష్ట్రాల్లో వారు చేస్తున్న పని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత వి–హబ్ కి వెళ్లాం. తెలంగాణ మహిళలు వ్యాపారులుగా ఎదిగేందుకు మద్దతునిస్తున్నారు. వాళ్లు ఏ విధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్నారో చెప్పారు. నా గురించి, నా ఫ్యూచర్ ΄్లాన్స్ గురించి వాళ్లూ అడిగారు. ఉమెన్ స్టార్టప్స్ గురించి అడిగి తెలుసుకున్నాను. వారితో కలిసి లంచ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ సెషన్ మా మధ్య జరిగింది. అక్కణ్ణుంచి.. డజన్ ఫౌండేషన్‌కి వెళ్లి, మహిళా ఉద్యోగులతో చర్చలు జరిపాం. టెక్ రంగంలో మహిళల నైట్ షిప్ట్‌లు, పేమెంట్ విషయంలో జెండర్ బయాస్డ్ సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. ఆ తర్వాత సీనియర్ సిటిజెన్స్ కోసం పనిచేసే ఫాతిమా ఫౌండేషన్‌ను సందర్శించాం.చెత్త సేకరణ మా వృత్తిమా అమ్మానాన్నలతో పాటు కలిసి మేం హైదరాబాద్‌లో 400 ఇళ్లలో చెత్త సేకరిస్తుంటాం. ఉదయం 5 గంటలకు మా పని మొదలవుతుంది. 7–8 గంటల వరకు పని ముగించుకొని, కాలేజీకి వెళతాను. స్కూల్ రోజుల నుంచి అమ్మానాన్నలతో పాటు నేను, మా చెల్లెలు, అన్నయ్య కూడా ఇదే పనిలో ఉంటున్నాం. 8వ తరగతిలో ఉన్నప్పుడు మౌంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ చిల్డ్రన్ పార్లమెంట్ అనేప్రోగ్రామ్ పెట్టింది. పది బస్తీల నుంచి పిల్లలను తీసుకొని ఈప్రోగ్రామ్ చేసేది. నేను అందులో పాల్గొన్నాను. 9వ తరగతిలో హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు పీఎమ్‌గా ఉన్నాను. మా బస్తీ పిల్లలందరం సమస్యల మీద మాట్లాడుకుని అధికారులను కలిసేవాళ్లం. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు సాయంకాలాలు మా బస్తీలో ఉన్న ముప్పై మంది పిల్లలకు పాఠాలు చెబుతుండేదాన్ని. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేశాను.ఆకలి విలువ.. నిద్ర విలువమా కమ్యూనిటీలో పిల్లలు ఉదయం టిఫిన్ చేయకుండానే స్కూళ్లకు వెళ్లిపోతుంటారు. మా చిన్నప్పటి నుంచి ఆకలి విలువ, నిద్ర విలువ మాకు తెలుసు. అందుకే, అధికారులను కలిసి విషయం చెబితే బస్తీల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఐఏఎస్ దివ్యా దేవరాజన్ మేడమ్ నాకు ఎన్నో విషయాల్లో అడ్వైజ్ చేస్తుంటారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గురించి అలాగే నాకు తెలిసింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు డిప్యూటీ హై కమిషన్ 2017 నుంచి ఏటా పోటీలు నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో ఈ ఏడాది నేను విజేతగా నిలిచాను. అంతకు ముందు ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకున్నాను. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో నేనొకరిని. ఇందులో భాగంగా జూన్ 2023లో అమెరికా వెళ్లి వచ్చాను. ఈ ఏడాది మహిళా శక్తి పురస్కారం కూడా అందుకున్నాను. నేను పుట్టి పెరిగింది గార్బేజ్ కమ్యూనిటీలో. అలాంటిది ఉదయం నుంచి డిస్కవర్ వెహికల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్ సర్‌తో కలిసి ప్రయాణించడం సాధారణ విషయం కాదనిపించింది. యుపీఎస్సీ సాధించి, ఆఫీసర్ హోదాను పొందితే ఇంకా ఎన్నో మంచి పనులు చేయచ్చు. దానికి ముందు పై అధికారులు ఎలా ఉంటారు.. ఎలా వర్క్ చేస్తారు అనేవి స్వయంగా కలిసి తెలుసుకున్నాను అనిపించింది. మా కమ్యూనిటీని అభివృద్ధి చేసేంతగా ఎదగాలన్నది నా లక్ష్యం’’ అని వివరించింది జయలక్ష్మి. నా పనిని నేను ప్రేమిస్తాను..చెత్త సేకరిస్తామని ‘ఆ వాసన ను ఎలా భరిస్తావు’ అని మా క్లాస్మేట్స్ కొందరు అడిగేవారు. చాలా వరకు జాలి చూపేవారు. కానీ నేను మా పనిని ప్రేమిస్తాను. అమ్మా నాన్నా మా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవారు. నాకు మద్దతుగా నిలిచే ఫ్రెండ్స్ ఉన్నారు. లెక్చరర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అమ్మకి నా పట్టుదల, నేను చేస్తున్న పనులంటే చాలా ఇష్టం. అన్నయ్య డిగ్రీ పూర్తయ్యింది, చెల్లి డిగ్రీ చేస్తోంది. అమ్మానాన్నలను చూసుకునేలా, మా కమ్యూనిటీని బాగు చేసేలా ఉన్నత జీవితాల్లో స్థిరపడాలన్నదే మా కల. – అరిపిన జయలక్ష్మిమాటల్లో వర్ణించలేనుమా కమ్యూనిటీ, నేనుండే బస్తీ వాతావరణం వేరు. అలాంటిది, ఒక రోజంతా ఆఫీసర్‌గా ఉండటం అనేది నాకు దక్కిన అరుదైన అవకాశం. ఉదయం నుంచి డిస్కవరీ వెహికిల్‌లో కూర్చొని రోజంతా పెద్ద పెద్ద అధికారులతో చర్చిస్తూ తిరగడం, నా జీవితంలో ఓ గొప్ప రోజు. మాటల్లో వర్ణించలేను. బ్రిటిష్ హై కమిషనర్ మా బస్తీకి వచ్చి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూశారు. మా బస్తీవాసులతో మాట్లాడారు. వాళ్లందరి సమక్షంలో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!
కోట్లకు పడగలెత్తిన వ్యక్తులైన ఒక్కోసారి అమాంతం కుప్పకూలిపోతారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయి రోడ్డుపాలవ్వుతారు. అరే ఒకప్పుడూ ఎలా ఉండేవాడు ఇప్పుడిలా అని అంతా నోరెళ్లబెడతారు. ఎందుకిలా అనేది ఇది అని చెప్పలేం కానీ చూసేవాళ్లకి ఎవ్వరికైన మనసు ఒక్కసారిగా చివుక్కుమంటుంది. అలాంటి దృశ్యమే నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోని చూస్తే ఎవ్వరికైన ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేస్తాయి. జిగల్ రావల్ అనే సామాజికి కార్యకర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వృద్ధ వ్యక్తి మాట్లాడుతూ కనిపిస్తాడు. అతడు ఒకప్పుడు ఇంజనీర్‌గా బాగా బతికిన వాడినని చెప్పాడు.తాను బాగా సంపాదించేందుకు భార్య పిల్లలతో సహా దుబాయ్ వెళ్లానని, అయితే అక్కడ తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్య తనను వదిలేసి పిల్లలను తీసుకుని వేరే అతనితో వెళ్లిపోయిందని బాధగా చెప్పాడు. ఆమె కోసం సంపాదించాలనుకోవడమే తనకు శాపమయ్యిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తాను పొట్ట పోషించుకోవడం కోసం ఇలా వీధుల్లో చెత్త ఏరుకుంటూ బతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. అతడి పరిస్థితి విన్న ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు మంచి ఫ్రోషనల్గా బతికిన వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో జీవనం సాగించడం ఏంటీ..? అసలు విధి ఇంత ఘోరంగా మనుషులతో ఆడుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
చెత్తబండి నడుపుతుంది.. అమెరికా వెళ్లొచ్చింది.. జయలక్ష్మి ఒక స్పూర్థి
మూసారాంబాగ్ సమీపంలోని సలీం నగర్లో తెల్లవారుజామున ‘చెత్తబండొచ్చిందమ్మా’ అని అరుస్తూ కనిపిస్తుంది జయలక్ష్మి. డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్తబండిలో సాయం చేస్తుంది జయలక్ష్మి. ‘ఎదగాలనుకుంటే చెత్త నుంచి కూడా ఎదగొచ్చు’ అంటుందా అమ్మాయి. తాను నివాసం ఉండే మురికివాడ పిల్లల కోసం ట్యూషన్లు చెబుతూ, వాలంటీర్‌గా పని చేస్తూ,ప్రతిష్ఠాత్మక ‘గాంధీ – కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’లో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. చిన్న చితకా సవాళ్లకే డీలా పడుతున్న యూత్‌కు జయలక్ష్మి ఇచ్చే స్ఫూర్తి చాలానే ఉంది. యునైటెడ్ స్టేట్స్– ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్) వారి ‘గాంధీ– కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’ స్కాలర్షిప్ పొంది, అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్ లూధర్ కింగ్ మార్గంలో అహింసా పద్ధతితో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు మన దేశవ్యాప్తంగా 4 వేల అప్లికేషన్లు వచ్చాయి. వారిలో కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ పది మందిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు అరిపిన జయలక్ష్మి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సమీపంలో అతి పెద్ద మురికివాడ– సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి. Dear Aripina Jayalakshmi @j_aripina Congratulations to you for This Changemaker Award you Received in Delhi!💐 Telangana Bidda we are proud of you!!🌹@KTRTRS @trspartyonline #JaiTelangana pic.twitter.com/lTZhxJ6E8n — (A*R) (@iNTeLHyd) July 11, 2022 ముగ్గుపిండి అమ్మే దళిత కుటుంబం అరిపిన జయలక్ష్మిది రాయలసీమ ప్రాంతానికి చెందిన దళిత కుటుంబం. తండ్రి రామ్మోహన్, తల్లి హుసేనమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వలస వచ్చారు. వీరి ఇళ్లల్లో ముగ్గుపిండి అమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే జయలక్ష్మి తల్లిదండ్రులు చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. ‘అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే మాకు జీవనాధారం. గవర్నమెంట్ నుంచి ఏమీ జీతం రాదు. చెత్త తీయడం చాలా కష్టమైన పని. నాన్న తానొక్కడే చెత్త తీయగలిగినా అమ్మకు కష్టమని నేను ఏడో క్లాస్ నుంచి ఇవాళ్టి వరకూ ఆమెకు తోడు వెళుతూనే ఉన్నాను. చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపింగ్ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తాను. ఇది చాలా దారుణమైన పని అని కొందరు అంటారు. కాని నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వృత్తి. నేను దానిని గౌరవిస్తాను. మా ఇంట్లో నేను కాకుండా అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని మా అమ్మ తపన. అంతవరకు ఈ పని చేయకతప్పదు’ అంటుంది జయలక్ష్మి. Since this young lady from a Hyderabad slum community told me in a class of peers aged 13 who aspired for worthy professions as nurses, teachers & police how she WOULD one day be an IAS officer (turning many heads) I have followed her achievements in awe. Every wish @j_aripina! https://t.co/V1X47W2i1t — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) August 23, 2023 ఎన్.జి.ఓ దృష్టిలో పడి జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్’ అనే ఎన్.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ‘స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం’ అంటుంది జయలక్ష్మి. ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్ రాకుండా చాలా వరకు సక్సెస్ అయ్యాను’ అంది. ఐ.ఏ.ఎస్ కావాలని ‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐ.ఏ.ఎస్ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ In 5 years in Hyderabad this young lady is one of the most inspiring people I met. She turned every head in the room in 2018 when at an event she announced her intention to be an IAS Officer. I pray she succeeds - she is a true #changemaker full of only kindness & good intent. https://t.co/5khoCxNjjj — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) December 11, 2022 -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
చిన్న మున్సిపాల్టిలకు ఈ–ఆటోలు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిరి్మస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెడుతున్నారు. -
వందే భారత్ రైలులో క్లినింగ్ ప్రకియ చేపట్టిన రైల్వే మంత్రి
ఇప్పుడిప్పుడే మెట్రో రైలు వంటి ఆధునికతతో కూడిన హైక్లాస్ రైళ్లను పట్టాలెక్కించి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది కేంద్రిం. అందులో భాగంగానే తక్కవ సమయంలో దూర ప్రయాణాలు చేయగలిగే వందే భారత్ వంటి హైక్లాస్ రైలును కూడా తీసుకొచ్చింది. మంచి ఆధునికతతో కూడిన రైలు అని మురిసిపోయేలోగే దాన్ని కూడా ప్రజలు చెత్తతో నింపేశారు. దీంతో ఆ రైలులో పరిస్థితి ఇది అంటా, అది అంటా అంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను క్లీన్ చేశారు. శానిటరీ వర్కర్ మాదిరిగా డ్రైస్ ధరించి ఓ సంచిని పట్టుకుని ప్రతి ప్రయాణికుడి సీటు వద్దకు వెళ్లి చెత్తను సేకరించారు. విమానాల్లో మాదిరిగా క్లీనింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో ప్రజలు సహకరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ రైలు ప్లేట్లు, కప్పులు వంటి చెత్తతో నిండిపోయింది. సిబ్బంది నిర్ణిత వ్యవధిలో క్లీన్ చేసినప్పటికీ రైలు స్టేషన్‌కి చేరుకునే సరికి చెత్తతో దారుణంగా ఉంది. దీంతో నెటిజన్ల తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి ఈ క్లినింగ్ ప్రక్రయను చేపట్టారు. Cleaning system changed for #VandeBharat trains. आपका सहयोग अपेक्षित है। https://t.co/oaLVzIbZCS pic.twitter.com/mRz5s9sslU — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 28, 2023 (చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ) -
ఫలిస్తున్న ఆపరేషన్ ‘క్లీన్’
సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంస్కరణలు ఫలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పటికే మెరుగుపడింది. ఇంటింటికీ మూడు రంగుల చెత్త డబ్బాల పంపిణీతో ప్రజల్లో సైతం మార్పు కనిపిస్తోంది. ఇంటి వద్దకే చెత్త తరలింపు వాహనాలు వస్తుండటంతో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ జనాభా గల మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్–1 మునిసిపాలిటీల్లో చెత్త తరలింపునకు ఆధునిక హైడ్రాలిక్ టిప్పర్లను ప్రభుత్వం అందించింది. మొత్తం 42 యూఎల్బీలకు 2,525 హైడ్రాలిక్ టిప్పర్లు అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వాటిలో 2,465 హైడ్రాలిక్ టిప్పర్లను ఆయా యూఎల్బీలకు అందజేశారు. మరో 60 టిప్పర్లను సంక్రాంతి తర్వాత అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేడ్–2, 3 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం 1,123 ఈ–ఆటోలను అందించనున్నారు. వీటిలో 387 వాహనాలను వచ్చే నెలలో అందించనున్నారు. హైడ్రాలిక్ టిప్పర్ల ద్వారా చెత్తను సేకరించి, ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. గతంలో వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను తొలగించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక ఏరోజుకారోజు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రాధమిక దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఆయా పట్టణాల్లో ప్రతి 8 నుంచి 10 వార్డుకు ఒకటి చొప్పున చెత్త రవాణా కేంద్రాన్ని (జీటీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 83 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రూ.185 కోట్లతో 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక అమలు చేయగా.. ప్రస్తుతం 100 జీటీఎస్‌ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ జీటీఎస్‌ల నుంచి ప్రాసెస్ చేసిన చెత్తను పునర్ వినియోగానికి ఉపయోగపడే వాటిని వేరు చేసి, మిగిలిన చెత్తను విద్యుత్ తయారీ ప్లాంట్‌కు తరలించనున్నారు. అందుకోసం చెత్తను సమగ్ర పద్ధతిలో నిర్వహించేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించనున్నారు. అందుకోసం రాష్ట్రంలోని 71 యూఎల్బీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు (ఐఎస్‌డబ్ల్యూఎం) ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఐదు ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా.. వినుకొండ, రాయచోటి యూఎల్బీల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలో తడి చెత్తను శుద్ధి చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్లలో తడి, పొడి చెత్తను ఒకేసారి ఒకేచోట శుద్ధి చేసేందుకు అవకాశముంటుంది. -
చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ‘క్లాప్’మిత్రలు రోజూ చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ యాప్ అ్రస్తాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకోసం ‘సిటిజన్ యాప్’ను రూపొందించింది. దీనిని ప్రతీ కుటుంబంలో స్మార్ట్ఫోన్లు ఉన్న వారితో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్‌మిత్ర (క్లీన్ ఆంధ్రప్రదేశ్)లు డౌన్లోడ్ చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 99,84,421 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగిలిన కుటుంబాల వారికీ ఆ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు ఈ యాప్‌ను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాయి. బదులిచ్చేవారు తక్కువే.. మరోవైపు.. చెత్త సేకరణపై పంపే మెసేజ్‌లకు ప్రతిస్పందిస్తున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 70 లక్షల ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటిలో దాదాపు 50 లక్షల కుటుంబాలకు పైగానే రోజూ మెసేజ్‌లు పంపుతున్నామని.. కానీ, బదులిస్తున్న వారి సంఖ్య ఐదువేలలోపే ఉంటోందన్నారు. 20 రోజుల క్రితమే ఈ యాప్ ప్రక్రియ మొదలైందని.. అందరూ దానిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే గ్రామాల్లో చెత్త సేకరణకు యాప్ పూర్తిస్థాయిలో దోహదపడుతుందని వారు చెబుతున్నారు. చెత్త సేకరణపై రోజూ మెసేజ్‌లు.. ఇక సిటిజన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతీ ఫోనుకు ‘ఈ రోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా’ అని ప్రశ్నిస్తూ ‘ఎస్’ లేదా ‘నో ’ చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మెసేజ్ పంపుతోంది. ఎవరైనా ‘నో’ అని బదులిస్తే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, క్లాప్‌మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడతారు. చదవండి:‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు -
రోజు ఏమార్చి రోజు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి. అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది. ఇదీ అసలు ఉద్దేశం వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారవుతోంది. ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం. పక్కాగా రూట్ ఉండాలంటూ...! చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దూరమవుతుందంటూ..! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. (చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట) -
పచ్చగా.. పరిశుభ్రంగా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాగునీటి కష్టాలు తలెత్తకుండా.. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు. కాలువలతో అనుసంధానం.. గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు. రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు.. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్లకు మరమ్మతులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. -
‘స్వచ్ఛ’ సేవకు యూజర్ చార్జీ
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తను సేకరించి, ప్రాసెస్ చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూజర్ చార్జీలు చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలను నూరు శాతం అందించిన స్థానిక పట్టణ సంస్థల్లో చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గత ఐదు నెలలుగా 17 యూఎల్బీల్లో ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పటి దాకా ఆయా ప్రాంతాల్లో 26.89 శాతం వసూలైంది. రాష్ట్రంలోని 123 స్థానిక పట్టణ సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటింటి చెత్త సేకరణకు చెత్త డబ్బాలు అందజేయడంతో పాటు.. ఆ చెత్తను ప్రాసెస్ యూనిట్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సైతం అందించనున్నారు. మొదటి విడతగా 42 యూఎల్బీలను ఎంపిక చేసి వాహనాల అందజేత ప్రారంభించగా, 17 యూఎల్బీలకు నూరు శాతం వాహనాల ను అందించగా, మరో 15 యూఎల్బీలకు యాభై శాతం వాహనాలను సరఫరా చేసి సేవలు ప్రారంభించారు. డిమాండ్‌లో 26.89 శాతం వసూలు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలను పాటిం చాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అందులో భాగంగా ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని, ఆ నిధులను వాహనాలు, చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణకు వినియోగించాలని షరతు విధించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2014–2019 సంవత్సరాలకు గాను మొదటి విడతలో కేంద్రం వాటాగా రూ.567 కోట్లు అందించింది. అయితే, ఇంటింటి చెత్త సేకరణలో 75 శాతం యూజర్ చార్జీలు వసూలు చేస్తేనే రెండో విడత స్వచ్ఛ భారత్ నిధులు ఇస్తామని చెబుతోంది. అయితే, 17 స్థానిక పట్టణ సంస్థల నుంచి రూ.58.81 కోట్ల డిమాండ్ ఉండగా.. నవంబర్ నుంచి మార్చి వరకు రూ.15.81 కోట్లు వసూలయింది. అంటే మొత్తం డిమాండ్‌లో 26.89 శాతం మాత్రమే వసూలైంది. ప్రస్తుతం యూజర్ చార్జీల వసూళ్లలో గుడివాడ మున్సిపాలిటీ 60.42 శాతంతో ముందుండగా, అమలాపురం మున్సిపాలిటీ 60.31 శాతంతో రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత కాకినాడ (54.59 శాతం), తాడేపల్లిగూడెం (50.13 శాతం), పార్వతీపురం (50.06 శాతం) మున్సిపాలిటీలు ఉన్నాయి. -
చెత్తకు యూజర్ చార్జీ కొత్తకాదు
సాక్షి, అమరావతి: చెత్త సేకరణకు యూజర్ చార్జీలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదు. గతం నుంచి ఈ యూజర్ చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో ఘనవ్యర్థాల సమస్యకు పరిష్కారం కోసం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛభారత్ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. పెరిగిపోతున్న ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు, పరికరాల నిర్వహణకు ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలన సంస్థలు యూజర్ చార్జీ వసూలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను 2016 సెప్టెంబర్‌లో ఆదేశించింది. కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలకు నిధులు కావాలంటే ‘వినియోగ రుసుం’ తప్పనిసరని చెప్పింది. దీంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. గుంటూరులో 2015లో అమలు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు వంటి పనులకోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. సముదాయం విస్తీర్ణం, అక్కడ ఉండే జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి యూజర్ చార్జీల వసూలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 చొప్పున, వాణిజ్య సముదాయాలైతే రూ. 5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ. 1,500 వసూలు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మనకే తక్కువ చార్జీలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రతి ఇంటికి రోజుకు తొలుత రూ.3 చొప్పున వసూలు చేయగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 5కు పెంచారు. ఇండోర్‌లోను ప్రతి ఇంటికీ నెలకు రూ. 150 వరకు వసూలు చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు సైతం ఏపీ కంటే ఆయా రాష్ట్రాల్లో అధికంగా చార్జీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు ఇంటికి రూ.1 మాత్రమే.. ఘన వ్యర్థాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలు వినియోగ రుసుంను వసూలు చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై భారం పడకుండా 2021 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రారంభించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజల నుంచి నెలకు రూ. 30, దారిద్య్రరేఖకు పైన ఉన్న వారి నుంచి మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 90, స్పెషల్/ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రూ. 60 చొప్పున, నగర పంచాయతీల్లో రూ. 30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల స్థాయిని బట్టి రూ. 150 నుంచి ఆ పైన చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, క్లాప్ కార్యక్రమం గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించినా.. తొలుత ప్రజలకు ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన కల్పించి, మెరుగైన సేవలతో ఫలితాలను చూపించిన అనంతరం గత ఏడాది డిసెంబర్ నుంచి చార్జీల వసూలు ప్రారంభించారు. అదీ మొత్తం 123 మున్సిపాలిటీల్లో తొలి విడతగా పూర్తిస్థాయిలో చెత్త సేకరణ వాహనాలను అందించిన 17 మున్సిపాలిటీల నుంచే ఈ వసూళ్లు చేపట్టారు. ఈ విధంగా నాలుగు నెలల్లో ఆయా మున్సిపాలిటీల నుంచి సుమారు రూ. 12 కోట్లు వసూలైంది. -
చెత్తే బంగారమాయనె.. నెలకు రూ.30లక్షలు!
చెత్తే కదా అని నిర్లక్ష్యం చేయలేదు.. ఆ చెత్త నుంచే ఆదాయం గడించడంపై దృష్టిసారించారు. రోజూ వెలువడే వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. కిలో పొడి చెత్త రూ.2 చొప్పున విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది డిసెంబర్ నుంచి డ్రై వేస్ట్ ప్లాంట్‌ను తొలిసారిగా అందుబాటులోకి తీసుక్చొంది. దశాబ్దాల నుంచి గత యంత్రాంగం చెత్తను నిర్లక్ష్యం చేసింది. తాజా నిర్ణయంతో పొడిచెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరం జనాభా సుమారు 4 లక్షలకు పైమాటే. రోజూ 60 నుంచి 80 వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రముఖ యాత్రాస్థలం కావడంతో ఆ స్థాయిలోనే హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు వెలిశాయి. ఈ క్రమంలో తిరుపతి నగరంలో ప్రతిరోజూ 197 టన్నుల చెత్త ఉత్పతి‘ అవుతోంది. ఇందులో 123 టన్నుల తడిచెత్త(కూరగాయల వ్యర్థాలు, హోటల్ గ్రై వేస్ట్‌తో కలపి) కాగా పొడి చెత్త 50 టన్నుల వరకు ఉత్పతి‘ అవుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు ప్రతిరోజూ 25 టన్నుల వరకు ఉంటున్నాయి. ఈ చెత్త నిర్వహణకు రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో అనేక ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. తడిచెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇటీవల భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో పొడిచెత్త నిర్వహణ ప్లాంట్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించగా.. అనతికాలంలోనే ఈ ప్లాంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కలిμంచేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.గడిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజింగ్ మెంటౖనెన్స్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. పురపాలక సంఘంగా ఏర్పాటై 136 ఏళ్లు పూర్తిచేసుకుంది. గడిచిన దశాబ్దాల నుంచి తిరుపతిలో ఉత్పత్తి అయ్యే చెత్తను పూడ్చిపెట్టడం, కాల్చడం, ఆపై రామాపురం డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు స్వచ్ఛభారత్ మిషన్ చెత్తను పూడ్చిపెట్టడం, తగలపెట్టడాన్ని నిషేధించింది.ఈ క్రమంలో చెత్త నిర్వహణపై అడుగులు పడ్డాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్తగా ఆలోచించి చెత్త నుంచి సంపదను సృష్టించడంపై దృష్టిసారించింది. కిలో 2 రూపాయలు తిరుపతి నగరంలో ఉత్పతి‘ అయిన చెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. ప్రతిరోజూ ఉత్పతి‘ అయ్యే చెత్త నుంచి 50 టన్నుల మేర పొడి చెత్త వేరుచేస్తున్నారు. ఈ చెత్తను డ్రైవేస్ట్ ప్లాంట్‌కు తరలించి సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఈచెత్తను కొనుగోలు చేసేం దుకు వివిధ సంస్థలు ముందుకు రాగా బెంగళూరుకు చెందిన ఎంఎం ట్రేడర్స్ కిలో చెత్తను రూ.2కు కొనేందుకు ముందుక్చొంది. రోజూ 50 టన్నుల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ ఆ సంస్థకు విక్రయించి తద్వారా రోజుకు లక్ష రూపాయలు, నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. ఏడాదికి రూ.3.6 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్లాంట్‌ను నిర్వహణకు ఖర్చుచేసిన రూ. 8 కోట్లను కేవలం రెండు సంవత్సరాల, రెండు నెలల్లోనే ఆర్జించనుంది. ఆపై పూర్తిగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. ఈ మేరకు చెత్త నుంచి సంపద సృష్టించి తిరుపతి నగరాభివృద్ధికి బాటలు వేయనుంది. -
‘మీ చెత్త మాకెందుకు?’.. దిమ్మతిరిగే షాక్
Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్‌కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది. ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. (చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్!.మాది కాదంటున్న చైనా) -
చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు
సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 40 రోజుల్లో వర్మీ రెడీ చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. కిలో వర్మీ రూ.10 చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం పంచాయతీరాజ్ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. -
కాకి స్వచ్ఛ్ భారత్ : నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ఓ కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్ల సాయంతో పైకి తీసుకొచ్చిన కాకి ఎంత తెలివైన జీవో మనం చాలా చిన్నపుడే తెలుసుకున్నాం. ఎంత విసుక్కున్నా..విసిరి కొట్టినా. ఒడుపుగా ఆహారాన్ని అందిపుచ్చుని కవ్విస్తూనే ఉంటుంది. అంతేకాదు తెలివైనదాన్నే కాదు.. నేను చాలా స్మార్ట్ అని నిరూపించు కున్న సందర్భాలు కూడా కోకొల్లలు. తాజాగా సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తించే మానవ జాతి సిగ్గు పడేలా చేసిందో కాకి. తాను సామాజిక జీవినని మరోసారి నిరూపించుకుని అందర్నీ ఫిదా చేస్తోంది. డస్ట్‌బిన్ పక్కనే ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా పక్కన పారేసిన చెత్తను ఒక్కొక్కటిగా తన ముక్కుతో తీసుకొని డస్ట్‌బిన్‌లో వేసిన వైనం ఔరా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా 38 సెకన్ల క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ డబ్బాలు, చెత్త పేపర్ ఇలా ఒక్కొక్కదాన్ని చాలా స్మార్ట్‌గా ఏరి డస్ట్‌బిన్‌లో వేసి మరీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మనుషులు సిగ్గు అనే విషయాన్ని మర్చిపోయారని కాకికి తెలుసు అనే క్యాప్షన్‌తో సుశాంత పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేయడమే కాదు.. వేగంగా వైరల్ అవుతోంది. సుమారు 2 వేలకు పైగా లైక్‌లను 14వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాకి తెలివికి కొంతమంది అబ్బుర పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ఈ చిన్న జీవి సైతం అర్థం చేసుకుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని.. బాధ్యతగా పవర్తిద్దాం అనే సందేశాల వెల్లువ కురుస్తోంది. This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 -
ఎవరెస్ట్‌పై సూపర్ డూపర్ ‘చెత్త' ఐడియా!
మౌంట్ ఎవరెస్ట్‌పై టన్నుల కొద్దీ చెత్త పేరుకు పోయింది. ఈ నేపథ్యంలో ‘ఎవరెస్ట్‌ను డంపింగ్ సైట్‌గా మార్చవద్దు’ ‘ప్రసిద్ధమైన పర్వతాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నేపాల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. దీనిలో భాగంగా ఎవరెస్ట్‌పై పేరుకుపోయిన చెత్తను సేకరించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. చిరిగిన టెంట్లు, ఖాళీ వాటర్ బాటిల్స్, విరిగిపోయిన నిచ్చెనలు, తాళ్లు...ఇలా రకరకాల చెత్తను సేకరించారు. వీటిని విదేశీకళాకారులు, స్వదేశీ కళాకారులు కళాత్మక వస్తువులుగా తయారుచేస్తారు. పర్యావరణ స్పృహను కలిగించడానికి వీటితో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు చెత్తతో కళాత్మక వస్తువులను తయారుచేయడంలో స్థానికులకు శిక్షణ ఇస్తారు. ‘చెత్తతో అపురూపమైన కళారూపాలు తయారుచేయడమే కాదు ఉపాధి కూడా కలిగించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు ప్రాజెక్ట్ డైరెక్టర్ టామీ గస్టఫ్సాన్. -
ఎక్కడిదీ ‘చెత్త': నాకే వైరస్ వచ్చినట్టు...
వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్ -19 (కరోనా వైరస్) ను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్మికుడి జీవనం, అతడు భయంకరమైన అనుభవాలు, ఎదుర్కొంటున్న వివక్ష మనుసును ద్రవింప చేస్తోంది. హృదయాలను కదిలిస్తూ.. అసలు ‘చెత్త' ఎక్కడుంది. దీన్ని వదిలించుకోవాల్సింది ఎవరు? ఎక్కడ..అనే ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఢిలీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) లో కాంట్రాక్ట్ కార్మికుడు మనోజ్ పాల్ (37). ప్రతిరోజు ఉదయం తనకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి చెత్తను సమీకరించడం, దానికి సెగ్రిగేట్ చేసి దూరంగా పారవేయడం ఇదీ మనోజ్ డ్యూటీ. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఇంట్లోని సెకండ్ హ్యాండ్ టెలివిజన్ ద్వారా లాక్ డౌన్ వార్త అతని చెవిని పడింది. మహమ్మారి ప్రజలను బలవంతంగా ఇంట్లో వుండేలా చేస్తే..అతని జీవనంలో మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఎప్పటిలాగానే మరుసటి రోజు తెల్లవారుజామున లేచి పాల్ పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని తన కాంట్రాక్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్టర్లో సంతకం చేసి, కిలోమీటరు దూరంలో ఉన్న ఈడీఎంసీ కార్యాలయానికి వెళ్లి ..ఆపై తనకు కేటాయించిన టిప్పర్ ట్రక్కు ఎక్కడంతో డ్యూటీ మొదలవుతుంది. ఉదయం 9 గంటల్లా పట్పర్గంజ్లోని మొదటి కాలనీకి రిపోర్ట్ చేయాలి. అనేక గేటెడ్ పరిసరాల్లో తమ చెత్తను పారవేసేందుకు వారే గేటు వద్దకు వస్తారు, లేదా కాలనీకి చెందిన ఒక కార్మికుడు ప్రతి ఇంటి నుండి సేకరించి పాల్ వ్యాన్‌లో పడవేస్తాడు. అయితే ఇక్కడే తనకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి అంటారు మనోజ్. మనోజ్ మాటల్లో : గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు. నిజానికి సాధారణ రోజులలో కూడా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటాం.. ప్రస్తుత తరుణంలో ప్రజల ధోరణి, నన్ను చూసే విధానం ఇంకా ఘోరంగా తయారైంది..గత ఒక వారంగా,ఎక్కువ మంది మాస్క్ లతో, లేదా వస్త్రంతో జాగ్రత్తగా కప్పుకుని వస్తారు.. నా చేతిని తాకకకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడతారు. కొందరైతే చేతులు కడుక్కోవడానికి ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగరు. వెంటనే నా ముందే సానిటైజర్లు వేసుకుని రద్దుకుంటారంటే ఆవేదన వ్యక్తం చేశారు. రోజు పెరుగుతున్న కొద్దీ పని తీవ్రత కూడా పెరుగుతుంది. చెత్తలో ప్రజలు వాడి పారేసిన మాస్క్ లుకూడా వుంటాయి తెలుసా.. భోజనానికి అరగంట విరామం తీసుకుంటాను. భార్య కట్టిచ్చింది తినడానికి 15 నిమిషాలు.ఆ తరువాత ఇంటికి ఫోన్ చేసి వాళ్ల గురించి అడుగుతా అంటూ చెప్పారు రెండు రోజుల క్రితం వరకూ గ్లౌజులు, మాస్క్ లు ఎంటా వుంటాయో కూడా తెలియని మనోజ్ తన చిరిగిన గ్లౌజ్ ను అప్యాయంతా తడుముతూ. మనోజ్ చెప్పిన ఇంకో భయంకరమై విషయం గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యి హోం క్వారంటైన్ లో ఉన్న ఇళ్లలోని చెత్త పరిస్థితి ఏంటి. ఆ చెత్తను ఎవరు తీస్తారు. దీనికి కూడా మనోజ్ వద్ద సమాధానం వుంది. అధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉన్న నాలుగు ఇళ్లు నాకు కేటాయించిన జోన్లో ఉన్నాయి. ఈ ఇళ్ళ నుండి వ్యర్థాలను నేనే సేకరించడాలి. ఇందుకు ఒక ప్రత్యేక ట్రక్ ఉంది అంటారు నిర్వేదంగా చూస్తూ... శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు గట్రా లేవుగా.. మరి వారి వ్యక్తిగత రక్షణ ఎలా? పనిని ముగించిన తరువాత సాయంత్రం 5.30కు తన సహచరులతో ఒక కప్పు టీ తాగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరతా.. పిల్లలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు.. పిల్లలకు వైరస్ అంటుకుంటుందని భయం. జాగ్రత్తగా వుండాలిగా.. అందుకే బూడిదతో బాగా చేతులు రుద్దుకొని, నీళ్లతో కడుక్కుంటాను...దుమ్మంతా శుభ్రంగా దులుపుకుంటాను. అయినా వైరస్ తో చావాలని ఆ విధి రాసి పెడితే.. ఏ దేవుడూ రక్షించలేడు అంటారు వేదాంతిలా.. అన్నట్టు మరో విషయం ప్రతి రోజు రాత్రి 9 గంటలకు అందరూ తప్పకుండా కలిసి భోంచేయాలని మనోజ్ కుటుంబం ఒట్టు పెట్టుకుందిట. టీవీలో వస్తున్న వార్తల్ని చూస్తూ...విదేశాలనుంచి విమానాల ద్వారా వచ్చిన ధనవంతులనుంచి ఈ వైరస్ వచ్చిందని నాకు తెలుసు...కానీ నిజానికి ఫలితం మాత్రం నాలాంటి వాళ్లదే అంటారు మనోజ్ చెమ్మగిల్లిన కళ్లతో. (హిందుస్తాన్ టైమ్స్ కథనం ఆధారంగా) -
షాపులకు క్యూఆర్...ఇది కొత్తది యార్!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలోని జనప్రియ ప్రాంతంలో క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా కమర్షియల్ ప్రాంతాల్లోనూ క్యూఆర్ కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్వైజర్లు ఆంజనేయులు, కృష్ణ కిశోర్ ఆధ్వర్యంలో హైదర్‌గూడ, అత్తాపూర్‌లోని దుకాణాలను సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రతి దుకాణానికి ఒక కోడ్‌ను కేటాయిస్తున్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేసి చెత్తను సేకరించనున్నారు. అదేవిధంగా కోడ్ ఆధారంగా సిబ్బంది పని తీరును సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నా రు. హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు చెత్తను రోడ్లపై వేయకుండా ఏర్పాట్లు చేశారు. తడి, పొడి చెత్త కోసం డబ్బాలను సైతం అందజేశారు. క్యూఆర్ కోడ్‌తో మరింత పకడడడడ్బందీగా ప్రతి దుకాణం నుంచి చెత్తను సేకరించడం సులభతరం కానుంది. – రాజేంద్రనగర్ హైదర్‌గూడ అపార్ట్మెంట్లో తొలిసారిగా గత మార్చి 28న జీహెచ్ఎంసీ యంత్రాంగం 1,200 కుటుంబాలు ఉంటున్న హైదర్‌గూడ జనప్రియ అపార్ట్మెంట్లో దేశంలోనే తొలిసారి క్యూఆర్ కోడ్‌తో చెత్త సేకరణను ప్రారంభించింది. మొదట కొంతమేర ఇబ్బందులు ఎదురైనా అనంతరం పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వ్యాపార ప్రాంతాల్లో అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల నుంచీ క్యూఆర్ కోడ్‌తో చెత్త సేకరిస్తున్నారు. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు.. అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. ఇవి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అతిపెద్ద వ్యాపార కేంద్రాలు. దీంతో ఈ ప్రాంతంలో నూరు శాతం చెత్తను సేకరించేందుకు అధికారులు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు త్వరలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఆహ్వానించేందుకు అధికారులు నిర్ణయించారు. -
చెత్త సేకరణకు క్యూఆర్ కోడ్
రాజేంద్రనగర్: ‘క్యూఆర్ కోడ్’.. డబ్బులు చెల్లించేందుకు.. అకౌంట్లో వేసేందుకు అతి సులువైన విధానం. ఇప్పుడు ఈ ‘కోడ్’ను చెత్త సేకరణకూ అనుసంధానించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మన జీహెచ్ఎంసీలోని రాజేంద్రనగర్ సర్కిల్–11లో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్వైజర్ ఆంజనేయులు బుధవారం ‘స్వచ్ఛ్ గృహ క్యూఆర్ కోడ్’ ద్వారా చెత్త సేకరణను లాంఛనంగా ప్రారంభించారు. జనప్రియ అపార్ట్మెంట్లో 1200 నివాసాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన చెత్త చెదారాలను ప్రతిరోజూ ఆటో రిక్షా కార్మికుడితో పాటు అతడి హెల్పర్ సేకరిస్తున్నారు. ఐటీసీ సంస్థ సీఎస్ఆర్లో భాగంగా అర్బన్ రిబాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఈ క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. దీన్ని 1200 కుటుంబాల్లో ప్రతి ఇంటికీ ఏర్పాటు చేశారు. వారి పూర్తి వివరాలను సేకరించి క్యూఆర్ కోడ్‌కు అనుసంధానించారు. ప్రతిరోజు చెత్త సేకరించే కార్మికుడు వీరి ఇళ్లకు వెళ్లి తన సెల్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెత్తను సేకరిస్తాడు. కోడ్‌ను స్కాన్ చేయగానే అందులో ఇంటి యజమాని పేరుతో పాటు తడి, పొడి చెత్త వేరు చేశారా, లేదా, ఇంటికి తాళం వేసి ఉందా, చెత్తను ఇచ్చేందుకు తిరస్కరించారా, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారా, నెల వారి డబ్బు చెల్లించారా లేదా.. ఇలాంటి ఆరు ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకటి సెలక్ట్ చేసి సడ్మిట్ చేస్తాడు. దీంతో దానికి సంబంధించిన పూర్తి డేటా నిక్షిప్తమవుతుంది. దీని ద్వారా ఇంటి యజమానితో పాటు కార్యాలయంలోని అధికారులకు ఆ అపార్ట్మెంట్లోని ఇంటి యజమాని చెత్త ఎలా ఇస్తున్నాడో వివరాలన్నీ చేరుతాయి. చెత్త సేకరణదారు ప్రతిరోజు వారి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నాడా లేదా అన్న సమాచారంతో పాటు తడి పొడి చెత్తను ఇట్లోవారు ఎలా ఇస్తున్నారో ఈ విధానం ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ సందర్భంగా ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్వైజర్ అంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా జీహెచ్ఎంసీ క్యూఆర్ బార్ కోడ్‌తో చెత్త సేకరణను ప్రారంభించిందని, జనప్రియలో ప్రారంభించిన ఈ విధానం పనితీరును పరిశీలిస్తామన్నారు. మొదటి రోజు చెత్త సేకరణ విజయవంతంగా పూర్తి చేశామని, బార్ కోడ్ సైతం ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాఫీగా ఉందన్నారు. చెత్త సేకరించే నిరక్షరాశులకు సైతం ఈ విధానం చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో కోడ్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పరిశీలించి రానున్న రోజుల్లో సర్కిల్ పరిధిలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీహాల్స్, విల్లాలకు అనుసంధానం చేస్తామని, అనంతరం బస్తీలు, కాలనీల్లో ఇళ్లకు వర్తింపజేస్తామన్నారు. -
‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
భోపాల్: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్ వెళ్లాడు. అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
టెన్త్ జవాబు పత్రాలు @ రూ.8,500
పట్నా: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను చెత్తతో కలిపి అమ్మేశారు కొందరు ఘనులు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ లోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పరిచిన సుమారు 40 వేల జవాబు పత్రాలు కనిపించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల నైట్‌వాచ్‌మన్ పూజన్ సింగ్, ప్యూన్ చిట్టు సింగ్‌లను అరెస్టు చేసి విచారించారు. విచారణలో అవి ఓ చెత్త కొనుగోలు డీలరు పప్పు కుమార్ గుప్తాకు రూ.8,500కు అమ్మేసినట్లు తేలింది. -
ఘన వ్యర్థాలపై కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చింది. ఇకపై.. చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. స్త్రీలు, పిల్లల న్యాప్కిన్లు, డైపర్లను ఉపయోగానంతరం పారవేయడానికి చిన్నపాటి సంచులను అందిచాల్సిందిగా తయారీ సంస్థలకు స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. వంద మందికిపైగా హాజరయ్యే వేడుకల్లో నిర్వాహకులే ఘన వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరుచేసి చెత్త సేకరించే వారికివ్వాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడలు, ఉద్యానవనాల మొత్తం స్థలంలో కనీసం 5 శాతం స్థలాన్ని చెత్త సేకరణ, రీసైక్లింగ్‌కు కేటాయించాలి. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో అమ్మకాలు జరిపేవారు చెత్తను నిల్వ ఉంచేందుకు చెత్త బుట్టలను తప్పక పెట్టాలి. చెత్త సేకరించే కార్మికులను నమోదు చేసుకుని వారిని క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చెత్త సేకరణలో వీరి పాత్ర ఎంతో ప్రముఖమని పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. -
‘చెత్త’ డబ్బాలొస్తున్నాయ్!
తడి.. పొడి చెత్త సేకరణకు {పత్యేక ఏర్పాట్లు సర్కిళ్లకు డస్ట్బిన్ల చేరిక త్వరలో పంపిణీ హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఇంటింటికీ రెండు రంగుల డస్ట్బిన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమయింది. దసరా రోజున వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేరోజు ప్రారంభం కానున్న బోయిగూడ ఐడీహెచ్‌కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రజలకు వాటిని అందజేయనున్నారు. వారితోపాటు తొలిదశలో సర్కిల్‌కు దాదాపు 50 వేల వంతున చెత్త డబ్బాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 24 సర్కిళ్లకు వెరసి దాదాపు 12 లక్షల డబ్బాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను ఉత్పత్తి సంస్థల నుంచి బిన్లను ఆయా సర్కిళ్లకు చేరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్కిళ్లకు ఇవి చేరాయి. మిగతా సర్కిళ్లకు త్వరలోనే చేరనున్నాయి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, రోడ్ల మీద చెత్త కనబడకుండా చేసేందుకు, త డి..పొడి చెత్తలను ఇంటినుంచే వేర్వేరుగా వేసేందుకు రెండు రంగుల డబ్బాలను అందజేస్తామని తొలివిడత స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. హామీకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ చర్యలకు దిగారు. చెత్తడబ్బాల పంపిణీ కోసం జీహెచ్ఎంసీ నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతించడంతో వెంటనే రంగంలోకి దిగి, టెండర్లు ఖరారు చేసి, ఆయా సంస్థలకు ఉత్పత్తి బాధ్యతలప్పగించారు. దీంతోపాటు చెత్త రవాణా ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇంకా ఈ చెత్త డబ్బాలను ఇంటింటినుంచి ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించేందుకుగాను స్థానిక యువతకు ఆటోట్రాలీలు అందజేయనున్నారు. -
అత్యవసర సేవలు బంద్
- ఉధృతమవుతున్న సమ్మె - పరిస్థితి ఆందోళనకరం - పారిశుధ్యం, తాగునీటి సరఫరా బంద్ - ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని గ్రేటర్ - జనజీవనం అస్తవ్యస్తం వరంగల్ అర్బన్ : మహా నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత నిలిపివేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులు శనివారం నుంచి తాగునీటి శుద్ధి, సరఫరా, వీధిలైట్ల మరమ్మతుల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఐదు రోజులుగా విధులను నిర్వహిస్తునే పరోక్షంగా సమ్మెకు మద్దతు పలికినా తాగునీటి వీధిలైట్ల కార్మికులు పోరాట బాట పట్టడంతో పరిస్థితి సమాస్యాత్మకంగా తయారైంది. ఇప్పటికే ఇళ్ల ఎదుట, వీధుల్లో, డ్రెరునేజీల్లో,ఖాళీ స్థలాల్లో చెత్త గుట్టలుగా పేరుకపోయింది. మురుగునీరు స్తంభించిపోయి అక్కడక్కడ పొంగిప్రవహిస్తోంది. అపరిశుభ్రత వాతావరణంలో అనారోగ్య ముప్పు వాటిల్లుతుంది. న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని ఆరు రోజులుగా చేపట్టిన సమ్మె ఉధృతమైంది. గ్రేటర్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమైంది. ఇంటింటా చెత్త సేకరించే, వాహనాల్లోకి చెత్త ఎత్తే కార్మికులు,వాహనాల డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా నగర వీధుల్లో, రహదారులు దుర్గందంగా మారాయి. ఆరు రోజుల వ్యవధిలో 1,600 మెట్రిక్ టన్నుల చెత్త సిటీలోనే స్తంభించిపోయింది చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వల్లో పూడికతీత లేక మల, మూత్రాలతో కంపుకొడుతున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన తాగునీటి శుద్ధి, నల్లాల విడుదలకు సంబంధించిన సూమారు 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. వడ్డేపల్లి, కేయూసీ,దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు,కాలనీలకు పైపులైన్లకు నీటి సరఫరా చేసే 30 మంది కార్మికులు సేవలను నిలిపివేశారు. అరకొరగా ఏర్పాట్లు.. తాగునీటి శుద్ధి కోసం పర్మినెంట్ కార్మికులతో పనిచేయిస్తామని బల్దియా డీఈ కొండల్ రావు తెలిపారు. షిఫ్టుకు ఇద్దరు కాకుండా ఒక్కొరు చొప్పన రెండు షిప్టులు పనిచేయిస్తూ తాగునీటి శుద్దీ చేస్తాం.ై పెపులైన్ల నుంచి వాల్వాలను విడుదల చేసే విషయంపై ప్రత్యామ్నయం కార్మికులను ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు కలగకుండా చెత్తను తరలిస్తున్నామని బల్దియా ఎస్డబ్ల్యూఎంం ఇంజినీరు లక్ష్మారెడ్డి తెలిపారు. 15 అద్దె వాహనాల ద్వారా సర్కిల్‌కు ఒకటి చెప్ప వాహనాన్ని కేటాయించి చెత్తను తరలిస్తున్నట్లు వివరించారు. పర్మినెంట్ కార్మికుల ద్వారా రంజాన్ పర్వదినానికి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఫిల్టర్ బెడ్ కార్మికులు ఆందోళన.. డిమాండ్లను పరిష్కారించాలని ఫిల్టర్ బెడ్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి దేశాయిపేట, వడ్డేపల్లి, కేయూ ఫిల్టర్ బెడ్లలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కారించాలని నినాదాలు చేశారు. మూడు ఫిల్టర్ బెడ్ల కార్మికులు బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిల్టర్ బెడ్ వర్కర్స్అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, నాయకుడు శంకర్, కార్మికులు పాల్గొన్నారు.