అత్యవసర సేవలు బంద్
- ఉధృతమవుతున్న సమ్మె
- పరిస్థితి ఆందోళనకరం
- పారిశుధ్యం, తాగునీటి సరఫరా బంద్
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని గ్రేటర్
- జనజీవనం అస్తవ్యస్తం
వరంగల్ అర్బన్ : మహా నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత నిలిపివేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులు శనివారం నుంచి తాగునీటి శుద్ధి, సరఫరా, వీధిలైట్ల మరమ్మతుల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఐదు రోజులుగా విధులను నిర్వహిస్తునే పరోక్షంగా సమ్మెకు మద్దతు పలికినా తాగునీటి వీధిలైట్ల కార్మికులు పోరాట బాట పట్టడంతో పరిస్థితి సమాస్యాత్మకంగా తయారైంది. ఇప్పటికే ఇళ్ల ఎదుట, వీధుల్లో, డ్రెరునేజీల్లో,ఖాళీ స్థలాల్లో చెత్త గుట్టలుగా పేరుకపోయింది. మురుగునీరు స్తంభించిపోయి అక్కడక్కడ పొంగిప్రవహిస్తోంది. అపరిశుభ్రత వాతావరణంలో అనారోగ్య ముప్పు వాటిల్లుతుంది.
న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని ఆరు రోజులుగా చేపట్టిన సమ్మె ఉధృతమైంది. గ్రేటర్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమైంది. ఇంటింటా చెత్త సేకరించే, వాహనాల్లోకి చెత్త ఎత్తే కార్మికులు,వాహనాల డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా నగర వీధుల్లో, రహదారులు దుర్గందంగా మారాయి. ఆరు రోజుల వ్యవధిలో 1,600 మెట్రిక్ టన్నుల చెత్త సిటీలోనే స్తంభించిపోయింది చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వల్లో పూడికతీత లేక మల, మూత్రాలతో కంపుకొడుతున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన తాగునీటి శుద్ధి, నల్లాల విడుదలకు సంబంధించిన సూమారు 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. వడ్డేపల్లి, కేయూసీ,దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌లలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు,కాలనీలకు పైపులైన్లకు నీటి సరఫరా చేసే 30 మంది కార్మికులు సేవలను నిలిపివేశారు.
అరకొరగా ఏర్పాట్లు..
తాగునీటి శుద్ధి కోసం పర్మినెంట్ కార్మికులతో పనిచేయిస్తామని బల్దియా డీఈ కొండల్ రావు తెలిపారు. షిఫ్టుకు ఇద్దరు కాకుండా ఒక్కొరు చొప్పన రెండు షిప్టులు పనిచేయిస్తూ తాగునీటి శుద్దీ చేస్తాం.ై పెపులైన్ల నుంచి వాల్వాలను విడుదల చేసే విషయంపై ప్రత్యామ్నయం కార్మికులను ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు కలగకుండా చెత్తను తరలిస్తున్నామని బల్దియా ఎస్‌డబ్ల్యూఎంం ఇంజినీరు లక్ష్మారెడ్డి తెలిపారు. 15 అద్దె వాహనాల ద్వారా సర్కిల్‌కు ఒకటి చెప్ప వాహనాన్ని కేటాయించి చెత్తను తరలిస్తున్నట్లు వివరించారు. పర్మినెంట్ కార్మికుల ద్వారా రంజాన్ పర్వదినానికి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు.
ఫిల్టర్ బెడ్ కార్మికులు ఆందోళన..
డిమాండ్లను పరిష్కారించాలని ఫిల్టర్ బెడ్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి దేశాయిపేట, వడ్డేపల్లి, కేయూ ఫిల్టర్ బెడ్‌లలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కారించాలని నినాదాలు చేశారు. మూడు ఫిల్టర్ బెడ్‌ల కార్మికులు బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిల్టర్ బెడ్ వర్కర్స్‌అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, నాయకుడు శంకర్, కార్మికులు పాల్గొన్నారు.