emergency services
-
104, 108 టెండర్లలో భారీ స్కెచ్.. ప్రజల ఆరోగ్యంతో ఆటలు
-
భద్రతకు గట్టి భరోసా
సాక్షి, అమరావతి: ఆపదలో ఆపన్న హస్తం అందించే ‘డయల్ 100’ వ్యవస్థను పోలీసు శాఖ మరింత బలోపేతం చేసి ప్రజల భద్రతకు గట్టి భరోసానిస్తోంది. అత్యవసర సేవలు అందించే ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగ్గా తీర్చిదిద్దింది. అందుకోసం డయల్ 100, డయల్ 112 వ్యవస్థను సమ్మిళితం చేస్తోంది. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మరిన్ని అత్యవసర సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. 20 జిల్లాల్లో ఇప్పటికే ఏకీకృత వ్యవస్థ అత్యవసర సర్వీసుల కోసం కేంద్ర ప్రభుత్వం డయల్ 112 వ్యవస్థను తెచ్చింది. చాలా రాష్ట్రాలు చాలా ఏళ్లుగా సొంతంగా నిర్వహిస్తున్న అత్యవసర సేవల వ్యవస్థలను దాదాపుగా తొలగించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యవసర సేవలు మరింత సమర్థంగా అందించేందుకు ఈ రెండు వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. అయితే డయల్ 100, డయల్ 112 కోసం రెండు వేర్వేరు కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు కాకుండా ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ రెండు వ్యవస్థలను సమ్మిళితం చేశారు. వైఎస్సార్, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వీటిని ఇంకా అనుసంధానించాల్సి ఉంది. సత్ఫలితాలనిస్తున్న సమ్మిళితం డయల్ 100, డయల్ 112ను అనుసంధానించడం సత్ఫలితాలనిస్తోంది. డయల్ 112 కాల్ సెంటర్‌కు 2020లో 7.55 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గవి 6,162 ఉన్నాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు జరిపి 196 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 2021లో 9.67 లక్షల కాల్స్ రాగా చర్యలు తీసుకోదగ్గవి 10,292 ఉన్నాయి. వాటి ఆధారంగా 242 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. డయల్ 100కి సగటున రోజుకు ఐదు వేల కాల్స్ వచ్చాయి. 2022లో డయల్ 100, డయల్ 112 సమ్మిళిత ప్రక్రియ ప్రారంభమయ్యాక అత్యవసర సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 17.82 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్ 85,143 ఉన్నాయి. వీటిని బట్టి ఇప్పటివరకు 2,518 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విశేషం. ప్రజల అత్యవసర కాల్స్‌పై పోలీసు శాఖ సత్వరం స్పందిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటోందనడానికి ఈ గణాంకాలే తార్కాణం. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షణ తాజాగా డయల్ 100ను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించారు. దీనికి వచ్చే కాల్ నేరుగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంతోపాటు రాష్ట్ర కమాండ్ కంట్రోల్‌కు చేరుతుంది. కాల్స్‌పై సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఎంత త్వరగా స్పందించారో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో పోలీసు వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ.. డయల్ 100లో కొత్తగా లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎవరైనా అత్యవసర సర్వీసుకు కాల్ చేస్తే తాము ఎక్కడ ఉన్నారో చెప్పాల్సి వస్తోంది. గుర్తు తెలియని ప్రదేశాల్లో ఆపదలో చిక్కుకున్న వారికి ఇది సమస్యాత్మకంగా మారింది. పూర్తి వివరాలు వెల్లడించేందకు తగినంత సమయం లేని సందర్భాల్లో పోలీసులు అక్కడకు చేరుకోవడం సవాల్‌గా పరిణమించింది. దీనికి పరిష్కారంగా కాలర్ లొకేషన్ ఆటోమేటిక్‌గా డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తెలిసేలా సమాచార వ్యవస్థను ఆధునీకరించారు. దీంతో డయల్ 100కు కాల్ వచ్చిన కచ్చితమైన ప్రదేశానికి పోలీసులు సత్వరం చేరుకుని తగిన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. డయల్ 100 పరిధిలోకి మరిన్ని సేవలు డయల్ 100 వ్యవస్థను దశలవారీగా విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కేవలం పోలీసు సేవలే కాకుండా మరిన్ని సేవలను ఈ పరిధిలోకి తెస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసి అగ్నిమాపక సేవలు, అంబులెన్స్ లాంటి వైద్య సేవలు, రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు (ఎస్డీఆర్ఎఫ్) మొదలైన సేవలను కూడా పొందే సౌలభ్యాన్ని త్వరలో కల్పించనున్నారు. దశలవారీగా దాదాపు 20 సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. -
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
గర్భిణులకు దన్నుగా 108
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 అంబులెన్సుల ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. గతంలో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్సు ఉంటే.. రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2020 జులై నుంచి ప్రతి 74,609 మందికీ ఒక అంబులెన్సు నడుస్తోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 జులై నుంచి 2021 ఆగస్టు వరకూ అంటే 14 నెలల్లో 10.77 లక్షల మంది ‘108’ ద్వారా లబ్ధిపొందారు. వీరిలో కోవిడ్ బాధితులు, గర్భిణులే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త అంబులెన్సులు రాకమునుపు ఏడాదికి సగటున 6.33 లక్షల ఎమర్జెన్సీ సర్వీసులు నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య 10.77 లక్షలకు పెరిగింది. వీరిలో 54 శాతం మంది పురుషులు కాగా, 46 శాతం మంది మహిళలున్నారు. అలాగే, 1.10 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాద బాధితులు అంబులెన్సుల్లో ఆస్పత్రులకు వెళ్లారు. 6.62 లక్షల మందికి ఆక్సిజన్ ఇక 108 అంబులెన్సులో వెళ్తున్నారంటేనే ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుందని ఒక భావన. అలా గడిచిన 14 నెలల్లో 6.62 లక్షల మంది ఆక్సిజన్ సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 72 వేల మందికి పైగా ఈ సౌకర్యం పొందారు. అనంతపురం జిల్లాలో 67 వేల మందికి పైగా ఆక్సిజన్ సాయంతో ‘108’లో ఆస్పత్రులకు వెళ్లారు. లబ్ధిదారుల్లో గర్భిణులే ఎక్కువ మొత్తం 10.77 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు మహిళలకు బిడ్డలు కనే వయసు కాబట్టి ఎక్కువమంది గర్భిణులు 108 వాహనాలను వినియోగించుకున్నారు. ఒక్క 21 నుంచి 30 ఏళ్లలోపు కేటగిరీలోనే 2.43 లక్షల మంది మహిళలు ‘108’లో వచ్చినట్లు వెల్లడైంది. అంబులెన్సుల్లో లబ్ధిపొందిన వారిలో 21.7 శాతం మంది అంటే 2.34 లక్షల మంది గర్భిణులే ఉన్నారు. అత్యధికంగా 22.4 శాతం మంది (2.41 లక్షలు) కోవిడ్ బాధితులున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అలాగే, 1.10 లక్షల మంది ప్రమాద బాధితులు, 32 వేల మందికి పైగా హృద్రోగులు, 63వేల మందికి పైగా పక్షవాతం బాధితులు తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) ఆస్పత్రులకు వెళ్లగలిగారు. -
ఎయిర్ అంబులెన్స్‌గా జయలలిత హెలికాప్టర్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత హయాంలో 2006లో కొనుగోలు చేసిన ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు డీఎంకే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పట్లో సీఎం పర్యటనల కోసం దీన్ని సిద్ధం చేశారు. సీఎంతో పాటుగా 14 మంది పయనించేందుకు అవసరమైన వసతులు ఇందులో ఉన్నాయి. అయితే తర్వాత వచ్చిన డీఎంకే సర్కారు ఈ హెలికాప్టర్‌ను పెద్దగా వాడుకోలేదు. 2011లో మళ్లీ అధికారంలోకి వచ్చిన జయలలిత దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. దీంతో అమ్మ హెలికాప్టర్‌గా ఇది ముద్ర పడింది. అమ్మ మరణం తర్వాత సీఎంగా పళనిస్వామి కొన్ని సందర్భాల్లో ఉపయోగించినా, చివరకు 2019 నుంచి ఇది మీనంబాక్కం విమానాశ్రయానికే పరిమితమైంది. ఇక ప్రస్తుత సీఎం స్టాలిన్ హెలికాప్టర్ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, రైలు, విమానం లేదా రోడ్డు మార్గంలోనే పయనిస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) అత్యవసర వైద్య సేవలకు వృథాగా పడి ఉన్న ప్రభుత్వ హెలికాప్టర్ సేవను ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తులు ఆరోగ్య శాఖ చేపట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ 2,449 గంటలు మాత్రమే ప్రయాణించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆవరణల్లో హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్‌కు తగ్గ వసతులు ఉన్న దృష్ట్యా, అత్యవసర వైద్య సేవలకు ఎయిర్ అంబులెన్స్‌గా సర్కారీ హెలికాప్టర్‌ను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మ హెలికాప్టర్‌ను రంగంలోకి దిగిన పక్షంలో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. చదవండి: (అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) -
అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. చదవండి : న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని అన్నారు. -
'వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం'
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయానికి తెరతీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో 108 వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయన్నారు.(అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం) ఆళ్ల నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 201 కోట్ల రూపాయలు నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో 676 మండలాల్లో నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాలు, రూరల్ పరిధిలో 20నిమిషాలు,ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తేవడంతో పాటు 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా సౌకర్యాలు పెంచే దిశగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలకు సంభందించి అవగాహన సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం ప్రత్యేకంగా చెప్పారన్నారు. ప్రతి క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు పెంచాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు రూపొందించారన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు సహకరించారు కాబట్టే కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. కేంద్రం రూపొందించిన కరోనా మార్గదర్శకాలుకు అనుగుణంగా ప్రజలు తమ భాగస్వామ్యం, సహకారం కావాలన్నారు. లాక్డౌన్ సడలింపు తర్వాత ఎక్కువగా కేసులు పెరగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఆయన తెలిపారు. -
అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం
సాక్షి, అమరావతి : అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించనున్నారు. విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. 108 సర్వీసుల్లో మార్పులు : అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారు ఎవరికైనా గుర్తుకు వచ్చే 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు.కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఏయే సదుపాయాలు ? బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ, ప్రమాదానికి గురైన వారు కానీ, చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శిశు మరణాలను కూడా పూర్తిగా నివారించే దిశలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఎంత వేగంగా సేవలు..? పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ఎలా సాధ్యం..? ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. 104 సర్వీసుల్లో మార్పులు : 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్ కేర్ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు. ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు : ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎంతో పాటు, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషథాలను ఉచితంగా అందజేస్తారు.ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (ఈహెచ్‌ఆర్) తయారు చేయడం చాలా సులువు అవుతుంది. ఎంఎంయూలు- 20 రకాల సేవలు : మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ, ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఈ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏయే సర్వీసులు ఎన్నెన్ని.. ? అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1068 వాహనాలను సీఎం వైయస్ జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.200.15 కోట్లు ఖర్చు చేసింది.కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది. గతంలో... ఇప్పుడు : రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్సులు 440 చోట్ల (ప్రాంతాలు వాహనాలు)లో మాత్రమే సేవలందించగా, ఇప్పుడు మొత్తం 705 చోట్లనుంచి పని చేయనున్నాయి. ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. అదే విధంగా గతంలో 104 అంబులెన్సులు (ఎంఎంయూ) 292 మాత్రమే ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ, రోగులకు అవసరమైన మొత్తం 74 రకాల ఔషథాలు కూడా అందజేయనున్నాయి. గతంలో ఈ అంబులెన్సులలో కేవలం 52 రకాల ఔషథాలు మాత్రమే ఉండేవి. వైద్యులు అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు 104ల్లోమొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. ఇంకా వీటిని డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని చోట్ల క వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 676 సంఖ్యలో ఉన్న 104 వాహనాలు ప్రతి రోజూ 40,560 మందికి సేవ చేస్తూ, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని భావిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత 108 సర్వీస్ ద్వారా.. 108 అంబులెన్సు సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైయస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు ఆ వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సమయం చెప్తే ఆధారాలతో వస్తా..
సాక్షి, తాడేపల్లి : ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు రాయడం, వాటిని పట్టుకొని టీడీపీ నేతలు మీడియా ముందుకు మళ్ళీ రావడంపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులైన 108, 104 గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. 104, 108లలో ఎక్కడ అవినీతి జరిగిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. 108, 104లలో అవినీతి జరిగిందంటున్న మీడియా సమక్షంలో టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సమయం చెబితే తన దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని వస్తానని, తమ దగ్గర ఉన్న ఆధారాలతో టీడీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. (‘ఆ భేటీ వెనుక కుట్ర దాగుంది’) దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అత్యవసర సర్వీసుల వాహనాలు లక్షల మంది ప్రాణాలు నిలబెట్టాయని, చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 108, 104 సర్వీసులు సరిగా పనిచేయక ఎంతోమంది ప్రాణాలు పోయాయని, ఇవన్నీ ఎల్లో మీడియా పచ్చ గ్యాంగ్‌కు కనిపించవా అని ప్రశ్నించారు. 1060 కొత్త వాహనాలు ప్రవేశ పెడితే చంద్రబాబు కడుపు మంటతో మండిపోతున్నారని, పేదల ప్రాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపాడతారని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. (మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!) 108,104 వాహనాలను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి టెండర్లు పిలిశామని, తాడు బొంగరం లేని నేతలు సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటిలేటర్లు ఉండే 108 వాహనాలు తీసుకువస్తున్నామని జోగి రమేష్ తెలిపారు. 108, 104 టెండర్లకు రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయని, అరబిందో కంపెనీ టెండర్లు దక్కించుకుందని తెలిపారు. అచ్చెన్నాయుడును చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ఆదిరెడ్డి భవాని పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. బాబాయికి అన్యాయం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా భవాని ఓటు వేస్తోందా అని ఎమ్మెల్యే జోగి రమేష్ నిలదీశారు. (హాలీవుడ్ నిర్మాత ఆత్మహత్య ) -
లాక్డౌన్.. స్ఫూర్తిని వీడని పోస్టల్ శాఖ
న్యూఢిల్లీ : ఓవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారత తపాలా శాఖ పూర్తి స్థాయిలో సేవలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తూ స్ఫూర్తి కొనసాగిస్తుంది. ప్రస్తుత తరుణంలో తపాలా సేవలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రజలకు ఇంటి వద్దే బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఉపసంహరించుకునే సౌలభ్యం, గ్రామీణ డాక్ సేవలతో సహా వివిధ విధులను పోస్టల్ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు అవసరమైన చోట్ల మెడిసిన్, ఆహార పొట్లాలు, అవసరమైన సరుకులు కూడా సరఫరా చేస్తున్నారు. కష్టకాలంలో పేదలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అందజేసిన సబ్సిడీలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు కరోనా వేళ సేవలు అందిస్తున్న తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధులను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడి మరణిస్తే రూ.పది లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్లో ఏప్రిల్ 25వరకు పోస్టల్ శాఖ అందజేసిన సేవలు.. రూ. 452 కోట్లు విలువచేసే 23 లక్షలకు పైగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలు రూ. 700 కోట్లు విలువచేసే 74.6 లక్షల డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) పేమెంట్స్ అందజేత రూ. 33,000 కోట్లు విలువచేసే 2.3 కోట్ల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు, రూ. 2,600 కోట్లు విలువచేసే ఒక కోటి ఐపీపీబీ(ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) లావాదేవీలు 42.5 లక్షల లేఖలు, రూ. 355 కోట్లు విలువచేసే 31.5 లక్షల మనీ ఆర్డర్స్ వినియోగదారులకు అందజేత -
ప్రాణాలను పణంగా పెట్టి...
-
12 వేలకు అడుగు దూరంలో..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు.. గత 24 గంటల్లో 39 మంది కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 11,933కు, కరోనా సంబంధిత మరణాల సంఖ్య 392కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా పాజిటవ్ కేసులు 10,197 కాగా, 1,343 మంది చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న 392 మరణాల్లో 178 మరణాలు మహారాష్ట్రలోనే వెలుగుచూడడం గమనార్హం. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,561, తమిళనాడులో 1,204, రాజస్తాన్‌లో 1,005, మధ్యప్రదేశ్‌లో 987, ఉత్తరప్రదేశ్‌లో 735, గుజరాత్లో 695 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 170 జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా, 207 జిల్లాలను నాన్–హాట్స్పాట్లుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. నాన్–హాట్‌స్పాట్ జిల్లాల్లోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశం(పొటెన్షియల్) ఉన్నందున అక్కడ నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇంకా సామూహిక సంక్రమణ దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని, కరోనా అనుమానితులను గుర్తించడానికి వీరంతా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు మరింత పటిష్టం హాట్స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అక్కడ మనుషుల కదలికలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది. హాట్స్పాట్లలో అన్ని రకాల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లలో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, మందుల దుకాణాలు, ఫార్మసీలు, జన ఔషధీ కేంద్రాలు, వైద్య ఉపకరణాల దుకాణాలు, మెడికల్ ల్యాబ్‌లు, వెటర్నరీ ఆసుపత్రులు యథాతథంగా పని చేస్తాయని తెలిపింది. -
అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం
సాక్షి, విజయవాడ: కరోనా లాక్‌డౌన్‌ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: గుంజీలు తీయించి, పూలదండలు వేశారు..) ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. (చదవండి: లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్) అప్లయ్ చేయడం ఇలా.. కోవిడ్-19 ఎమర్జెన్సీ వెహికల్ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు కింద ఇవ్వడం జరిగింది. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. (చదవండి: కష్టంలో ఆదుకుంటున్న కామన్‌మ్యాన్) -
వృత్తి ధర్మం మరచిన ప్రైవేటు
సాక్షి, అనంతపురం: కరోనా కల్లోలంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో సాయంగా నిలవాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు బాధ్యత మరిచాయి. ఎమర్జెన్సీ సేవలతో పాటు ఓపీ తప్పనిసరిగా చూడాలని కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్ ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులను ఆదేశించినా.. కొందరు వైద్యుల్లో మార్పు రాలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ నిక్కచ్చిగా చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినా.. మరికొందరు మాత్రం తీరు మార్చుకోలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృతమైన సేవలందిస్తున్న ఈ తరుణంలో ప్రైవేటు వైద్యులు అండగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 90 శాతం ఆస్పత్రులు మూత.. జిల్లాలో మొత్తం 258 ప్రైవేట్ ఆస్పత్రులుండగా.. వీటిలో ప్రముఖ ఆస్పత్రులు మాత్రమే తెరిచారు. మిగతా 90 శాతం ఆస్పత్రులను మూసేశారు. వాస్తవంగా రోజూ వేల సంఖ్యలో రోగులు వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి. ఆస్పత్రులు మూతపడడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయం.. భయం కరోనా నేపథ్యంలో ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో మూడు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు తమ ఆస్పత్రులను ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని ముందస్తుగా వైద్య సేవలు బంద్ చేశారు. జిల్లాలోని చాలా ఆస్పత్రులు మూతపడగా.. ఇబ్బంది పడుతున్న రోగులు ఆరోగ్యశాఖాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పటికే కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి సైతం వెళ్లగా ఆయన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోగులకు ప్రత్యక్ష నరకం.. డయాబెటిక్‌తో బాధపడుతున్న శ్రీనివాస్ నగరంలోని సాయినగర్‌లోని ఓ ఆస్పత్రిలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇదివరకే హార్ట్ స్ట్రోక్ రాగా...వెంటనే ఆస్పత్రిలో చేరగా గండం గడిచింది. ప్రస్తుతం అతను క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అతను వెళ్లే ఆస్పత్రి వారం రోజులు క్రితం మూసివేయగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈయన రెవెన్యూ కాలనీకి చెందిన రాము. తన కూతురు జేష్వితకు సోమవారం విరేచనాలు, జ్వరం రావడంతో ఆస్పత్రులవైపు పరుగుతీశాడు. కానీ నగరంలో చాలా ఆస్పత్రులు మూసివేశారు. బిడ్డ పరిస్థితి చూసి రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ ద్వారా ఓ వైద్యున్ని సంప్రదించి మందులు తీసుకుని వెళ్లిపోయాడు. ..జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూసివేయగా.. రాము లాంటి వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లాలోని 258 ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఎమర్జెన్సీ సేవలు అందించాలని, ఎవరైనా తాళం వేస్తే ఎస్మా చట్టం కింద లైసెన్స్‌లను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించినా ప్రైవేటు వైద్యులు తీరు మారలేదు. హౌసింగ్‌బోర్డుకు చెందిన ఆంజనేయులు గుండె సంబంధ వ్యాధితో పాటు డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. నగరంలోని బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. ఆ ఆస్పత్రి మూసివేయడంతో ఆయన సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ కరోనా కేసుల నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారు. అదే ప్రైవేట్ ఆస్పత్రి తెరిచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నగరానికి చెందిన దంపతులకు మూడ్రోజుల క్రితం ఓ పాప జన్మించింది. జాండిస్ లక్షణాలు కనిపించడంతో చిన్నారిని ఫోటోథెరపీలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో వారు నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లగా ఎక్కడా చేర్చుకోలేదు. మూడ్రోజుల బిడ్డను తీసుకుని వారు పరుగులు పెట్టారు. చివరకు బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చిన్నారిని అడ్మిషన్ చేసుకోగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు మూసివేయగా.. కిడ్నీ, మధుమేహం, హైపర్‌టెన్షన్, మానసిక ఒత్తిడి, గుండె తదితర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు అవస్థలు పడుతున్నారు. వీరికి రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్ తప్పనిసరి. రెగ్యులర్‌గా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు క్రమం తప్పకుండా వాడకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. -
అత్యవసర సేవల్లో ఉన్న వారికి ఈ– పాస్‌లు
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఈ పాస్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి హిమాన్షు శుక్లా, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. విజయవాడలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ► నిత్యావసరాలకు సంబంధించిన ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులతోపాటు వ్యవసాయ, సహకార విభాగం ఈ నెల 26వ తేదీన జారీ చేసిన జీవో 289లో పేర్కొన్న వస్తు సేవల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న వారందరికీ ఈ పాస్‌లు ఇస్తారు. ► పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు. అందువల్ల కనిష్టంగా 5, గరిష్టంగా ఇ–పాస్ జారీ నిబంధనలు, షరతులకు లోబడి పాస్‌లు మంజూరు చేస్తారు. ► ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుంచి 11 వరకు) అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్‌తో పని లేదు. అంతా ఆన్లైన్లోనే..! ► https:// gramawardsachivalayam. ap. gov.in/CVPASSAPP/CV/ CVOrganiza tion Registration పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► స్పందన పోర్టల్ వెబ్‌లింక్ ( https:// www. spandana. ap. gov. in/) ద్వారా కూడా పాస్ పొందొచ్చు. ► నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్‌ను ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో ఎస్ఎంఎస్ ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్‌కు పంపుతారు. -
ఇక ‘పిట్ స్టాప్’ ఉచిత మరమ్మతు సేవలు
బెంగళూరు: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది, అగ్నిమాపక, పోలీస్, అంబులెన్స్, వైద్యులు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే వ్యక్తులు ఉపయోగించే వాహనాలు మధ్యలో ఆగిపోతే వారికి ఉచిత మరమ్మతు సేవలందించేందుకు గాను పిట్ స్టాప్ అనే సంస్థ ముందుకొచ్చింది. పిట్ స్టాప్ ఉచిత మరమ్మతు సేవల్ని పొందేందుకు గాను 626262 1234 నంబర్‌కు ఫోన్ గానీ, లేదా www.getpitstop.comను గానీ సంప్రదించవచ్చు. సమాచారం అందుకున్న పిట్ స్టాప్ సిబ్బంది తమ సంచార వాహనంతో వచ్చి సదరు వాహనాన్ని రిపేరు చేసి వెళ్లిపోతుందని సంస్థ ప్రతినిధులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సేవలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, చెన్నై, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ వివరించింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వారందరికీ పిట్ స్టాప్ సంస్థ తరఫున సీఈవో మిహిర్ మోహన్ సెల్యూట్ చేసి అభినందించారు. -
అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్
-
‘ఆధార్’ లేదని సేవలు నిరాకరించొద్దు
న్యూఢిల్లీ: ఆధార్ లేదనే సాకుతో పౌరులకు అత్యవసర సేవలు నిరాకరించవద్దని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ, పరిపాలనా విభాగాలకు లేఖలు రాసింది. అత్యవసర వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, నిరుపేదలకు రేషన్ సరుకుల పంపిణీ వంటి వాటిని తిరస్కరించవద్దని అధికారులకు సూచించింది. ఆధార్ లేని కారణంగా ప్రభుత్వ పరంగా అందించే ఎటువంటి లబ్ధినైనా నిరాకరించటానికి వీల్లేదంది. వైద్య సాయం, చికిత్స వంటి అత్యవసర సందర్భాల్లో కూడా ఆధార్ లేదని సేవలు నిరాకరిస్తున్నారంటూ వార్తలు రావటంపై తీవ్రంగా స్పందించింది. ఇవే నిజమైతే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంది. అన్ని సేవలను పొందే హక్కు పౌరులకుందనీ, ఎవరైనా నిరాకరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. -
ఆపదొస్తే అంతేనా..!
సాక్షి, జనగామ: ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను కాపాడి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్న 108 వాహనాలు జిల్లాలో కనిపించడం లేదు. మొత్తం 13 మండలాల్లో కేవలం 5 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో అత్యవసర సేవలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో పొరుగు మండలాల నుంచి వాహనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 108 వాహనాలు లేని మండలాలు ఇవే.. ఆపద సమయంలో ఉన్న బాధితులను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి వారికి వైద్యసేవలందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 వాహన సేవలను ప్రారంభించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. ఇందులో జనగామ, పాలకుర్తి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట మండలాలకు మాత్రమే వాహ నాలు ఉన్నాయి. లింగాలఘణపురం, జఫర్‌గఢ్, చిల్పూరు, తరిగొప్పుల, బచ్చన్నపేట, గుండాల, కొడకండ్ల మండలాలకు లేవు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర సమయంలో సమీపంలో ఉన్న మండలాల నుంచి 108 వాహనాలను రప్పించి అధికారులు సేవలు అందిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు అంతంతే.. జిల్లాలో 108 వాహనాల కొరత కారణంగా ఎమర్జెన్సీ సేవల కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, గర్భిణులను, పాము, తేలు కాటు, క్రిమిసంహారక మందు తాగిన వారిని, పరస్పర దాడుల్లో గా యపడిన వారిని, అగ్ని ప్రమాద బాధితులకు 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి తక్షణమే సమీపంలో పెద్ద ఆస్పత్రిలో చేర్పిస్తారు. అయితే స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 108 వాహనం ఇటు చిల్పూరు, అటు జఫర్‌గఢ్ మండలాలకు, దేవరుప్పులలోని వాహనం లింగాలఘణపురం, గుండాల మండలాల పరిధి లో సేవలు అందిస్తోంది. కాగా, జిల్లాలో 55 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాల కొరత కారణంగా జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోనే సేవలు అందిస్తుండగా.. మిగతా మండలాలకు కష్టంగా మారింది. జిల్లా ఏర్పడిన తర్వాత 7 మండలాలకు 108 వాహనాలు కావాలని అప్పటి డీఎంహెచ్ఓ హరీష్‌రాజు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. ఏడాది గడిచిపోయినప్పటికి కొత్త వాహనాలను కేటాయించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైన ఆయా మండలాలకు 108 వాహనాలను కేటాయించి అత్యవసర సేవలు అందించాలని కోరుతున్నారు. 108 వాహనాలు కేటాయించాలి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడే 108 వాహనాలను సమకూర్చాలి. ఏడు మండలాలకు వాహనాలు వచ్చే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ఉచితంగా సేవలందించే వాహనాలు లేక చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. –ఎండీ దస్తగిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రెండు మండలాలకే ప్రతిపాదనలు పంపాం జిల్లా నుంచి కొడకండ్ల, జఫర్‌గఢ్ మండలాలకు 108 వాహనాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం కేటాయిస్తే అందుబాటులోకి సేవలను తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న వాహనాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను అందిస్తున్నాం. –అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్ఓ -
‘అంబా’లెన్స్..!
♦ పశు అంబులెన్స్‌ల కేటాయింపు ఇలా.. ♦ ఖమ్మం జిల్లా ,ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు ♦ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ♦ కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట పాల్వంచరూరల్ : మనుషులకు అత్యవసర సేవలు అందాలంటే..108కు ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ కుయ్..కుయ్‌మంటూ వస్తుంది. అదే తరహాలో పశువులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 1962నంబర్‌కు ఫోన్ చేస్తే సంచార వైద్యశాల గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్యసిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులు, పెంపకందారులకు మందులు ఇచ్చి వెళతారు. ఈ సంచార వైద్యశాల(అంబులెన్స్) వాహనాలు త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చేరనున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మైరుగైన వైద్యం అందించడమే వీటి లక్ష్యం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండు జిల్లాల పరిధిలో 10 వాహనాలు రానున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పశువుల అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించి, 1962 నంబర్‌కు ఫోన్ చేసి..కాల్ సెంటర్ పనితీరును ప్రశంసించడంతో..సంచార వైద్యసేవలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. రెండు జిల్లాలో పశుసంపద ఇలా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు, 44 గ్రామీణ వైద్యశాలలు, 30 ప్రాథమిక వైద్యశాలలు, 6 గ్రేడ్–1 స్ధాయి పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 14,67,126 పశువులు ఉన్నాయి. గేదెలు 1,92,376, గొర్రెలు 1,04,288, మేకలు 2,25,171, కోళ్లు 7,12,546 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో తెల్లపశువులు మొత్తం 1,44,710, గేదెలు 3,58,251, గొర్రెలు 3,12,607, మేకలు 1,60,276 ఉన్నా యి. వీటికి ఏదైనా జబ్బు సోకినా, అత్యవసర వైద్యం కావాల్సి వచ్చినా..1962కు ఫోన్ చేస్తే పశువైద్యసేవల అంబులెన్స్ ఆ ఊరికి రానుంది. రైతులకు ఎంతో మేలు.. పశు సంచార వైద్యానికి కొత్తగా వాహనాలను కేటాయించడం ఎంతో సంతోషం. పశువైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. రైతులు ఫోన్ చేయగానే వారి ఊరికి పోయి..పశువైద్య సిబ్బంది మూగ జీవాలకు చికిత్స అందిస్తారు. పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చే స్థితిలో లేని వారికి ఇది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా పశువైద్యసేవలు అందనున్నాయి. పశువుల వద్దకే వైద్యం రావడం మంచి పరిణామం. –డాక్టర్ వేణుగోపాల్‌రావు, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం -
మీ సురక్ష మా చేతుల్లో!
ఈఆర్పీ బటన్‌తో అత్యవసర సేవలు ► క్షణాల్లో అంబులెన్స్; బంధువులకూ సందేశం ► ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో సేవలు ► దశల వారీగా కర్ణాటక, తమిళనాడులకు విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘కాల్ చేస్తే అంబులెన్స్’ ఇది సాధారణంగా మనకు తెలిసిందే. కానీ, కాల్ కూడా అవసరం లేదు.. జస్ట్ బటన్ నొక్కితే చాలు అంబులెన్స్ వచ్చేస్తుంది అంటోంది మీ సురక్ష. అంబులెన్సే కాదు దగ్గర్లోని బంధువులు, సన్నిహితులనూ అలెర్ట్ చేస్తామంటోంది కూడా. త్వరలోనే బీమా, డయాగ్నోస్టిక్ సేవలకూ విస్తరించనుంది. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న మీ సురక్ష. కామ్ సేవల గురించి సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎర్నెస్ట్ రోహిత్ కట్టా మాటల్లోనే.. మెట్రో నగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణం. మరి, ఇంట్లో ఒంటరిగా ఉండే పెద్దవాళ్ల సంగతేంటి? వారి ఆరోగ్యబాగోగులు ఎవరు చూసుకుంటారు? అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌కో, సమీప బంధువులకో సమాచారం అందించేదెవరు? స్వయంగా ఇలాంటి పరిస్థితిని అనుభవించిన రోహిత్.. ఈ అనుభవాన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాడు. ఇదే గతేడాది అక్టోబర్‌లో మీసురక్ష.కామ్ సంస్థకు బీజం వేసింది. ఎమర్జెన్సీ ప్యానిక్ రెస్పాన్స్ (ఈఆర్పీ) సొల్యూషన్స్‌తో అంబులెన్స్ సేవలందించడం అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో ప్రారంభించాం. 4 సెకన్లలో అంబులెన్స్.. మీసురక్ష.కామ్ సేవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఈఆర్పీలోని బటన్ నొక్కితే చాలు అంబులెన్స్‌కు, స్థానిక బంధువులు, స్నేహితులకు సమాచారాన్ని అందించడమే అంతే! ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 4,500–5,000 ఆసుపత్రుల సమాచారాన్ని మెడికల్ కౌన్సిల్ నుంచి సమీకరించాం. అత్యవసర సమయాల్లో మొబైల్ అవసరం లేకుండానే ఈఆర్పీ మీదుండే బటన్ నొక్కితే చాలు అందులోని సిమ్ కార్డు యాక్టివేట్ అయి.. క్లౌడ్ ఆధారంగా 4 సెకన్లలో మీసురక్ష కాల్ సెంటర్‌కు ఫోన్ చేరుతుంది. వెంటనే అక్కడి సిబ్బంది దగ్గర్లోని అంబులెన్స్‌కు ఫోన్ చేసి పంపించేస్తారు. స్థానిక బంధువులు, స్నేహితులకూ సమాచారాన్ని చేరవేస్తుంది. అంబులెన్స్ ఆసుపత్రికి చేరేవరకూ ట్రాక్ చేస్తూనే ఉంటాం. అక్కడితో మీసురక్ష బాధ్యత పూర్తవుతుంది. చైనా నుంచి దిగుమతి.. ప్రస్తుతం ఈఆర్పీ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి గోడలకు తగిలించుకునేలా, మణికట్టు ట్యాగ్, నెక్లెస్ ట్యాగ్ 3 రకాలుగా ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 3 రోజుల పాటు పనిచేస్తుంది. 3 నెలలు, ఏడాది రెండు రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. 3 నెలలకు రూ.5,044, ఏడాదికైతే రూ.12,226. ఈ ధరల్లో ఈఆర్పీ ఉత్పత్తి ధర కూడా కలిసి ఉంటుంది. రెండోసారి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 70 శాతం ధర తగ్గుతుంది. బీమా, డయాగ్నోస్టిక్‌లకు విస్తరణ.. ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. అంబులెన్స్ సేవల్లాగే బీమా, డయాగ్నోస్టిక్ సేవలనూ అందించాలని నిర్ణయించాం. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఏడాదిలో కర్ణాటక, తమిళనాడులకు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటివరకు రూ.15 లక్షల పెట్టుబడి పెట్టాం. ఈఆర్పీని జీపీఎస్‌తో అనుసంధానం చేసేందుకు మరో రూ.10 లక్షలు అవసరం. ఇందుకోసం పెట్టుబడుల కోసం చూస్తున్నాం. -
సంచార స్వైప్ మెషిన్లు
► చిల్లర నోట్ల సమస్యకు చిట్కా ►అత్యవసర సర్వీసులకు నేటితో తెర ► రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సంచార స్వైప్ మెషిన్లను ప్రవేశపెట్టడం ద్వారా చిల్లర సమస్య పరిష్కారానికి కేంద్రం చిట్కాను కనుగొంది ఖాతాదారులు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి నగదును డ్రాచేసుకునే వసతిని కల్పించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా ఒకింత ఊరట కలిగిస్తూ సేలం జిల్లాలో సరికొత్త రూ.500 నోట్లు చెలామణిలోకి వచ్చారుు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు స్వైప్ మెషిన్లతో వెళ్లే ఏర్పాటును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కల్పించింది. సహాయ జనరల్ మేనేజర్ పాల్‌రాజ్ నేతృత్వంలో ఐదు బృందాలు స్వైప్ మెషిన్లతో సేవలు అందించనున్నారుు. వీరి ద్వారా రూ.2వేలను అందుకోవచ్చు. ఈరకమైన స్వైప్ సేవల కోసం రూ.2లక్షలను ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 గంటల్లో వందమందికి నగదు పంపిణీ చేసినట్లు ఒక అధికారి తెలిపాడు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: చెల్లని కరెన్సీ నోట్లను చేతపట్టుకుని ప్రజలు అల్లాడుతుండగా కేంద్రం మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. పైగా ఇది అంతంకాదు ఆరంభం మాత్రమేననే ప్రకటనతో ప్రధాని భయపెట్టడం ప్రారంభించారు. రద్దరుున నోట్ల స్థానంలో కొత్తనోట్లను అందించే ప్రక్రియ ప్రారంభమై బుధవారానికి 16 రోజులు గడిచినా సాధారణ పరిస్థితి నెలకొనలేదు. కరెన్సీని మార్చుకోని బ్యాంకులు, పనిచేయని ఏటీఎంల వద్ద ప్రజలు బాధలు పడుతూనే ఉన్నారు. బ్యాంకులను ముట్టడించడం, ఆందోళనలకు పూనుకోవడం నిత్యకృత్యమైంది. పాత నోట్లు చెలామణిలోలేవు, వాటి స్థానంలో కొత్త నోట్లు ఇచ్చేనాథుడు లేక ఖాతాదారులు అల్లాడుతున్నారు. తమిళనాడు అవసరాలకు తగినట్లుగా రిజర్వు బ్యాంకు తగిన స్థారుులో నగదును విడుదల చేయడం లేదు. సహనం నశించిపోరుున ప్రజలు బుధవారం ఎవరికి వారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దాదాపుగా ప్రతి బ్యాంకు ముందు ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నా రుు. 95 శాతానికి పైగా ఏటీఎంలు మూతపడి ఉన్నారుు. భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలూ కేంద్రాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. అధికార అన్నాడీఎంకే సైతం ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నాలో పాల్గొంది. తిరుప్పూరులో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలను మూసివేసి నిరసన పాటించారు. తిరుప్పూరు నుండి కడలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశారు. తంజావూరులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ముందు రాస్తారోకో నిర్వహించారు. అలాగే రామనాథపురంలో నిరసనలు సాగించారు. చైన్నై తిరువాన్మీయూరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీపీఎం నేతలు బిక్షమెత్తుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఒకటోతేదీ జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికసంఘాలు ఆందోళనలు నిర్వహించారుు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ అధ్వర్యంలో ఆందోళన సాగింది. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు వర్తక వాణిజ్య సంఘాల అధ్యక్షులు విక్రమ్‌రాజా ప్రకటించారు. రైళ్లు, బస్సులు తదితర అత్యవసర సర్వీసులకు పాత నోట్ల వినియోగం వెసులుబాటు ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో శుక్రవారం నుంచి కరెన్సీ కష్టాలు రెట్టింపు కాగలవనే భయం ప్రజల్లో నెలకొంది. -
అవన్నీ గాలి కబుర్లే
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల సౌకర్యం కరువు నగరంలోని బోధనాసుపత్రిలో సైతం ఐసీయూ లేని వైనం అందుబాటులో ట్రామాకేర్ సెంటర్ ఒక్కటే ఇదీ సర్కారీ ప్రజావైద్యం తీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అనేది ఉత్త మాటగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని గాలి కబుర్లు చెబుతున్న పాలకుల మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. జిల్లాలో ఎక్కడ నుంచైనా పేషెంట్లను వెంటిలేటర్ కోసం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రికి తరలించాల్సి వస్తోంది. నెల్లూరు(అర్బన్): రోడ్డు ప్రమాదాలు, పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం తదితర కేసుల్లో శ్వాస తీసుకోలేక పేషంట్లు ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందడం లేదనే విమర్శలున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు వైద్యం చేయాలంటే మొదట కృత్రిమ శ్వాసనందించే వెంటిలేటర్లు తప్పనిసరి. కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల్లో కనీసం ఒక్క చోట కూడా వెంటిలేటర్ సౌకర్యం లే దు. వెంటిలేటర్ అవసరమైన రోగులను నెల్లూరు నగరంలోని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రి (పెద్దాసుపత్రి)కి జిల్లా నలు మూలల నుంచి తరలించాల్సి వస్తోంది. అలాకాకుంటే అప్పో సప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలి. లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాలి. పెద్దాసుపత్రిలో సైతం రోగులకు తగినన్ని వెంటిలేటర్లు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో 74 పీహెచ్‌సీలు జిల్లాలో 74 పీహెచ్‌సీలు, మూడు ఏరియా ఆసుపత్రులు, 15 సీహెచ్‌సీలు, 24 గంటలు పని చేసే ఆసుపత్రులు 28 ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రి ఉంది. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ లేని బోధనాసుపత్రి నెల్లూరు నగరంలోని బోధనాసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించి రోజుకు సరాసరి 800 నుంచి 1000 వరకు ఔట్ పేషంట్లు వస్తున్నారు. ఇన్ పేషంట్లు సుమారు 100 వరకు ఉంటున్నారు. వీరిలో వెంటిలేటర్ వైద్యం కోసం 10 నుంచి 12 మంది వరకు వస్తున్నారు. ఆసుపత్రిలో వాస్తవానికి ఐసీయూనే లేదు. హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు రోగుల ప్రాణాలు కాపాడేందుకు 2007లో కేంద్రప్రభుత్వం ట్రామా కేర్ ఏర్పాటు చేసింది. నిర్వహణ బాధ్యతలు పెద్దాసుపత్రికి అప్పగించారు. ట్రామా కేర్‌కి చెందిన ఐసీయూనే పెద్దాసుపత్రి వారు తమ ఐసీయూగా చెప్పుకుంటున్నారు. మెడికల్ కళాశాలకు ఎంసీఐ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ట్రామాకేర్ ఐసీయూనే చూపించి బోధనాసుపత్రి ఐసీయూగా చెప్పుకున్నారు. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ లేని బోధనాసుపత్రి రాష్ట్రంలో నెల్లూరులో మాత్రమే ఉంది. వాస్తవాన్ని పరిశీలిస్తే ట్రామాతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పెద్దాసుపత్రికి ఉండాలి. ట్రామాకేర్‌లో ఉక్కపోత.. ట్రామాకేర్ సెంటర్లో ఆరు బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అధికారులు మాత్రం 23 బెడ్లతో కూడిన ఐసీయూ ఉందని చెబుతున్నారు. ఏడు వెంటిలేటర్లున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి మరమ్మతుల్లో ఉన్నాయి. ట్రామాకేర్‌లో రెండు ఏసీలున్నాయి. వీటిలో ఒకటి చాలా కాలంగా మరమ్మతులకు గురై ఉంటే ఇటీవల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు రిపేరు చేయించారు. అయినా చ ల్లటి గాలే రావడం లేదు. ఉక్కపోతతో రోగులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉంటే బయట ఆసుపత్రుల నుంచి వచ్చే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు లేక కొంతమందిని ట్రామా వార్డులోనే ఉంచుతున్నారు. ప్రతి రోజూ రోగులు ఒకరో, ఇద్దరో మరణిస్తూనే ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఒక బెడ్డుకు ఒక నర్సు ఉండాలి. కాని ట్రామా కేర్ ఐసీయూ మొత్తానికి ఒకే నర్సు ఉంటున్నారు. ఉన్న క్యాజువాల్టీలో (అత్యవసర వార్డు) సైతం కనీస సదుపాయాలు లేవు. ఆక్సిజన్, వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్లు ఉండాల్సి ఉంటే అలాంటివేమి లేకుండానే క్యాజువాల్టినీ నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్యంపై విమర్శల వెల్లువ పేదలందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లను, తగిన సిబ్బందిని నియమించకుండా రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. -
అత్యవసర సేవల కోసం 112
* దేశ వ్యాప్తంగా ఒకే నంబర్ * అన్ని సేవలు దాని పరిధిలోకే సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రానున్నాయి. దీని కోసం కేంద్ర హోం శాఖ.. నేషనల్వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం(ఎన్‌ఈఆర్‌ఎస్) పేరుతో మైక్రో మిషన్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ‘112’ నంబర్‌ను టెలికం శాఖ కేటాయిం చింది. రాష్ట్రాల్లో అమలులో ఉన్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కేంద్ర హోం శాఖ వీలైనంత త్వరలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో సేవలు ప్రస్తుతం కంట్రోల్‌రూమ్‌కు ఓ కాల్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది అనేది గుర్తించేందుకు కొంత పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. ఎన్‌ఈఆర్‌ఎస్ అమలుతో మరింత అత్యాధునికమైన పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే జీఐఎస్(జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యాదు చేస్తున్నారనేది దీని ద్వారా తక్షణం గుర్తించే అవకాశం ఉంటుంది. రక్షక్, మొబైల్ వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి బాధితుడికి దగ్గరలో ఉన్న వాహనాన్ని వెంటనే పంపిస్తారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగసామ్యం ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనుంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అందిస్తుండగా... వీటిలో పని చేసే సిబ్బంది, పోలీసులకు అవసరమైన వాహనాలు తదితరాలను రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్సోర్సింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగానిర్ణయించారు. -
విమానాశ్రయంలో వైఫై సేవలు
గన్నవరం విమానాశ్రయంలో వచ్చే నెల నుంచి వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 52 విమానాశ్రయాల్లో వైఫై సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నూతన రాజధానికి దగ్గర్లో ఉన్న గన్నవరం విమానాశ్రయంలో అత్యున్నత నాణ్యమైన సేవలందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు దేశంలో పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 నుంచి 24 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సుమారు రెండువేల మంది ప్రయాణికులు నిత్యం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమాన ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించేందుకు కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనంలో వైఫై సేవలు అందించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ సమయంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలందించే వైఫైని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ సంస్థ కూడా విమానాశ్రయం బయట వైఫై సేవలందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ అధికారులు విమానాశ్రయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. -
అత్యవసర సేవలు బంద్
- ఉధృతమవుతున్న సమ్మె - పరిస్థితి ఆందోళనకరం - పారిశుధ్యం, తాగునీటి సరఫరా బంద్ - ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని గ్రేటర్ - జనజీవనం అస్తవ్యస్తం వరంగల్ అర్బన్ : మహా నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత నిలిపివేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులు శనివారం నుంచి తాగునీటి శుద్ధి, సరఫరా, వీధిలైట్ల మరమ్మతుల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఐదు రోజులుగా విధులను నిర్వహిస్తునే పరోక్షంగా సమ్మెకు మద్దతు పలికినా తాగునీటి వీధిలైట్ల కార్మికులు పోరాట బాట పట్టడంతో పరిస్థితి సమాస్యాత్మకంగా తయారైంది. ఇప్పటికే ఇళ్ల ఎదుట, వీధుల్లో, డ్రెరునేజీల్లో,ఖాళీ స్థలాల్లో చెత్త గుట్టలుగా పేరుకపోయింది. మురుగునీరు స్తంభించిపోయి అక్కడక్కడ పొంగిప్రవహిస్తోంది. అపరిశుభ్రత వాతావరణంలో అనారోగ్య ముప్పు వాటిల్లుతుంది. న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని ఆరు రోజులుగా చేపట్టిన సమ్మె ఉధృతమైంది. గ్రేటర్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమైంది. ఇంటింటా చెత్త సేకరించే, వాహనాల్లోకి చెత్త ఎత్తే కార్మికులు,వాహనాల డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా నగర వీధుల్లో, రహదారులు దుర్గందంగా మారాయి. ఆరు రోజుల వ్యవధిలో 1,600 మెట్రిక్ టన్నుల చెత్త సిటీలోనే స్తంభించిపోయింది చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వల్లో పూడికతీత లేక మల, మూత్రాలతో కంపుకొడుతున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన తాగునీటి శుద్ధి, నల్లాల విడుదలకు సంబంధించిన సూమారు 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. వడ్డేపల్లి, కేయూసీ,దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు,కాలనీలకు పైపులైన్లకు నీటి సరఫరా చేసే 30 మంది కార్మికులు సేవలను నిలిపివేశారు. అరకొరగా ఏర్పాట్లు.. తాగునీటి శుద్ధి కోసం పర్మినెంట్ కార్మికులతో పనిచేయిస్తామని బల్దియా డీఈ కొండల్ రావు తెలిపారు. షిఫ్టుకు ఇద్దరు కాకుండా ఒక్కొరు చొప్పన రెండు షిప్టులు పనిచేయిస్తూ తాగునీటి శుద్దీ చేస్తాం.ై పెపులైన్ల నుంచి వాల్వాలను విడుదల చేసే విషయంపై ప్రత్యామ్నయం కార్మికులను ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు కలగకుండా చెత్తను తరలిస్తున్నామని బల్దియా ఎస్డబ్ల్యూఎంం ఇంజినీరు లక్ష్మారెడ్డి తెలిపారు. 15 అద్దె వాహనాల ద్వారా సర్కిల్‌కు ఒకటి చెప్ప వాహనాన్ని కేటాయించి చెత్తను తరలిస్తున్నట్లు వివరించారు. పర్మినెంట్ కార్మికుల ద్వారా రంజాన్ పర్వదినానికి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఫిల్టర్ బెడ్ కార్మికులు ఆందోళన.. డిమాండ్లను పరిష్కారించాలని ఫిల్టర్ బెడ్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి దేశాయిపేట, వడ్డేపల్లి, కేయూ ఫిల్టర్ బెడ్లలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కారించాలని నినాదాలు చేశారు. మూడు ఫిల్టర్ బెడ్ల కార్మికులు బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిల్టర్ బెడ్ వర్కర్స్అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, నాయకుడు శంకర్, కార్మికులు పాల్గొన్నారు. -
30 శాతం పడకలు అత్యవసర సేవలకే
- ప్రతి ఆస్పత్రిలోనూ కేటాయించాలి: లక్ష్మారెడ్డి - ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో 30 శాతం పడకలను అత్యవసర సేవా విభాగానికే (ఐసీయూ) కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్యా సంచాలకులు, ఐపీఎం డెరైక్టర్, నిమ్స్ తదితర అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయి అత్యవసర సేవలను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం కావాల్సిన పరికరాలు, మానవ వనరులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు. నిమ్స్‌లో ‘ఎమర్జెన్సీ మెడిసిన్’ పీజీ కోర్సును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కల్తీపై తడాఖా చూపించండి కల్తీ ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మ్యాగీలో ప్రమాదకర పదార్థాలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ చర్యలకు ఉపక్రమించారు. మామిడికాయలను కృత్రిమంగా మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారని పేర్కొన్నారు. పాలల్లో కల్తీ జరుగుతోందని, చిన్న పిల్లలు తాగే పాలల్లో కల్తీ జరిగితే ఉపేక్షించకూడదన్నారు. -
108 ఉద్యోగుల సమ్మె
- నిలిచిన అత్యవసర సేవలు - కదలని 32 వాహనాలు - ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఆదిలాబాద్ టౌన్ : అపర సంజీవని 108 సేవలపై సమ్మె దెబ్బపడింది. ఈ నెల 7న జీవీకే సంస్థకు ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు విఫలం కావడంతో గురువారం నుంచి ఉద్యోగులు సమ్మె చేపట్టారు. అత్యవసర వైద్య సేవలకు ఉద్యోగులు దూరంగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 32 వాహనాలు రోడ్డెక్కలేదు. జిల్లాలో 155 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఈఎం టీలు 80 మంది, పెలైట్లు 75 మంది సమ్మెలో పాల్గొన్నారు. రోజు కనీసం 160 నుంచి 170 మం దిని ప్రమాదాల్లో గాయపడిన వారిని అత్యవసర వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వీరు సమ్మె చేయడంతో బాధితులకు సమయానికి వైద్యం అందడం లేదు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. వైద్య శాఖ, 108 అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 108 సేవల్లో ఖాళీగా ఉన్న పోస్టులకోసం ఇంట ర్వ్యూలు నిర్వహించారు. వారి ద్వారా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. 54 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇటీవల ఇంటర్వ్యూలు జరిగాయని, వారితో విధు లు నిర్వర్తించేందుకు చర్యలు తీసుకుం టున్నామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. డిమాండ్లు ఇవీ.. - తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. - ఉద్యోగ భద్రత కల్పించాలి. - కనీస వేతనాలు అమలు చేయాలి. - పనిగంటలు 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించాలి. - 108 వాహనాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలి. - తెలంగాణ ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించాలి. - ఉద్యోగులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించాలి. - ఉద్యోగులు ఉన్నచోట మౌలిక సదుపాయాలు కల్పించాలి. - ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి. - ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
వెంటిలేటర్‌పై రుయా!
రుయా ఆస్పత్రిలో యంత్రాలకు జబ్బు చేసింది. అత్యవసర సేవలు అందడం లేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, ఉపయోగించుకోలేని దీనస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఆస్పత్రిలో కోట్ల విలువైన పరికరాలు మూలన పడుతున్నాయి. వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలు అత్యవసర విభాగం ఉన్నా లేనట్టుగా తయారైంది. తిరుపతి కార్పొరేషన్: ‘వైద్యోనారాయణ’గా పేరుగాంచిన రుయాలో విలువైన వైద్య పరికరాలు చూస్తే ఆసుపత్రికి జబ్బు చేసిందా అన్న సందేహం వస్తోంది. అత్యవసర విభాగంలో అడ్మిట్ అవుతున్న వారు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారు, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న వారే అధిక భాగం ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏఎంసీ విభాగంలో ఆర్ఐసీ(రెస్పిరేటరి ఇంటెన్సివ్ కేర్)లో రోగులకు వైద్య సేవలు అంది స్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు 18 వెంటిలేటర్లు మూలన పడ్డాయి. కేవలం రెండు మాత్రమే సేవలందిస్తున్నాయి. అవికూడా తరచూ మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని డాక్టర్లు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారు. రోగుల సహాయకులు బతిమిలాడితే వేలూరు సీఎంసీకి వెల్లండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే మిషన్ ఆరు నెలలుగా పనిచేయడం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో వచ్చే వారికి ముందుగా ఎక్స్‌రే తీయడం వలన ప్రమాద స్థాయిని గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించవచ్చు. ఎక్స్‌రే మిషన్ పనిచే యక పోవడంతో ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎక్స్‌రే భవనానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాళ్లు, చేతులు విరిగిన వారు అంతదూరం వెళ్లాలంటే ప్రాణం మీదకొస్తోంది. గాలిలో దీపంలా ప్రాణాలు రూ.5 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్న రుయా ఆసుపత్రికి వాటి నిర్వహణ భారంగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని సరిచే సేందుకు సాంకేతిక నిపుణులు లేరు. రోజుల తరబడి పరికరాలు మూలనపడ్డంతో అత్యవసర సేవలకు వచ్చే వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ప్రాణాప్రాయ స్థితిలో రోజూ పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుండ గా వెంటిలేటర్లు లేని కారణంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 29 మంది అత్యవసర సేవల కోసం వస్తే వెంటి లేటర్ లేని కారణంగా 9 మంది మృత్యువాత పడ్డట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రుయాలో వెంటిలేటర్లు లేక పోవడంతో రోగులను ఇక్కడి డాక్టర్లే దగ్గరుండి ప్రయివేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో రోగి అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని పేదవారు వైద్యుల కాళ్లపై పడి ఎలాగైనా బతి కించమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వెంటలేటర్లు పనిచేయడం లేదని, సరే పంప్ ఏర్పాటు చేస్తాం, వాటిని మీరే చేతులతో పంపింగ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేయి ఒక్క క్షణం ఆగినా రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆరోగ్యశ్రీ పేషేంట్ల పరిస్థితి మరీ దారుణం. వీరికి వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వెంటిలేటర్లు పని చేయకున్నా, ముఖానికి పైపులు పెట్టి ఫొటోలు తీసుకుం టూ ‘షో’ చే స్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి. పనిచేయక పోవడం వాస్తవమే... అత్యవసర వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక పోవడం వాస్తవమే. ఉన్నతాధికారులకు లెటరు రాశాం. ప్రభుత్వం ఐదు వెంటిలేటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిని త్వరగా ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం. -డాక్టర్ వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి, తిరుపతి -
అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరుతూ జూడాలు చేపట్టిన సమ్మె గురువారం 18 రోజుకు చేరుకుంది. పలు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను జూడాలు బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వంతో జూడాలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జూడాలు లేవనేత్తిన దాదాపు అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ గ్రామీణ ప్రాంతంల్లో విధుల నిర్వహణను జూడాలు వ్యతిరేకిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 107ను వెంటనే రద్దు చేయాలని జూడాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం తొసిపుచ్చింది. దీంతో జూడాల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
24 గంటల్లో తేల్చండి
లేదంటే అత్యవసర సేవలు బంద్ ప్రభుత్వానికి జూడాల హెచ్చరిక గాంధీ ఆస్పత్రి : తమ సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వివిధ రూపాల్లో వారు నిరసన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పడుతున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపజేసింది. తొలుత వారు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, డీఎంఈలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా గాంధీ జూడాల సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన భవనం నుంచి ఇందిరా పార్కు వరకు మహార్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి 24 గంటల గ డువుఇస్తామని, అప్పటికీ స్పందించకుంటే తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. జూడాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ రామంతాపూర్: రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో పెండింగ్‌లో ఉన్న స్టైపండ్ చెల్లించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం కళాశాల ప్రాంగణంలో చెత్తా చెదారాన్ని తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిప్రతాప్, సందీప్, సంధ్య, లిఖిత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన ఆందోళన సుల్తాన్‌బజార్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాలు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ఉద్ధృతం చేయనున్నట్లు జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
అంధకారంలో ‘గాంధీ’
మొరాయించిన జనరేటర్లు నిలిచిపోయిన అత్యవసర సేవలు టార్చిలైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు పాఠం నేర్వని యంత్రాంగం గాంధీ ఆస్పత్రి: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని చూస్తే అర్థమవుతుంది. వేల మంది పేద రోగులకు ప్రాణ దానం చేసే ఈ ఆస్పత్రిని కొన్నాళ్లుగా సమస్యలు చుట్టుముడుతున్నా నాయకులు గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదు. శనివారం ఆస్పత్రికి నాలుగు గంటల పాటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీని ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు కరెంటు పోయింది. జనరేటర్లు పనిచేయక పోవడంతో ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా మారింది. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వెంటిలేటర్ల బ్యాకప్ అయిపోవడంతో అత్యవసర విభాగాల్లోని రోగులకు మాన్యువల్‌గా ఆక్సిజన్‌ను పంపింగ్ చేశారు. టార్చిలైట్లు, సెల్ఫోన్ల వెలుగులో వైద్యసేవలు అందించిన దుస్థితి దాపురించింది. వార్డులో చీకట్లు అలుముకోవడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు జనరేటర్లను మరమ్మతు చేసేసరికి డీజిల్ అయిపోయింది. దీంతో సిబ్బంది డీజిల్ కోసం పరుగులు తీశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన గందరగోళానికి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రెండు గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గతంలోనూ ఇదే పరిస్థితి.. ఈ ఏడాది జూన్ 22,24 తేదీల్లో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. శస్త్ర చికిత్సలు నిలిచిపోవడంతో వైద్యులే ఆస్పత్రి పాలనా యంత్రాంగం తీరును తూర్పారబట్టారు. తరుచూ ఇటువంటి ఘటనలే జరుగుతున్నా నిర్లక్ష్యవైఖరి వీడక పోవడంపై రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ ఘ టనపై ఆస్పత్రి ముఖ్య అధికారి ఒకరిని వివరణ కోరగా నిర ్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. పది నిమిషాలే విద్యుత్‌కు అంతరాయం కలిగిందని, ఎటువంటి అపాయం జరగ లేదనడం గమనార్హం. -
ఎబోలా’ పోరుకు 300 కోట్లు: గేట్స్ ఫౌండేషన్
సియాటెల్: పశ్చిమాఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా ప్రబలిన ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించేందుకు, ఎబోలా వైరస్ నివారణ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ. 300 కోట్ల నిధులు ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన రూ.60 కోట్లకు అదనంగానే ఈ నిధులు అందించనున్నట్లు తెలిపింది. ఎబోలా నివారణకు కృషిచేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ఔషధాల పంపిణీ, టీకాల అభివృద్ధి, చికిత్సల వంటి వాటికి ఈ మొత్తం ఉపయోగించనున్నారు -
అందినకాడికి దండుకోవడమే..
పింప్రి, న్యూస్‌లైన్ : అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల్లోనూ దండుకొంటున్నారు. రోగుల నుండి అత్యధికంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్‌నెస్‌లేని వాహనాలను వినియోగిస్తున్నా రు. కొన్ని అంబులెన్సుల్లో కనీస సౌకర్యాలు లేవు. సామాజిక, రాజకీయ పార్టీలనుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి అంబులెన్స్ ప్రారంభిస్తున్న వారి ఆగడాలను అరికట్టే దిక్కులేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రోగుల బంధువుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న రోగులు, బంధువులుకూ ఇబ్బం దులు తప్పడం లేదు. తనిఖీలు నిల్ ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల అంబులెన్సులల్లో వైద్య సదుపాయాలను ఆయా ఆస్పత్రిలే తనిఖీల ను చేస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అం బులెన్సులను ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఒక్కో అంబులెన్సులో ఒక్కో ధరను వసూలు చేస్తున్నా యి. పుణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న అంబులెన్సులను పరిశీలిస్తే.. సంస్థల ద్వారా 288 అంబులెన్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- 326, కేంద్ర ప్రభుత్వం ద్వారా-11, శిక్షణ సంస్థల ద్వారా-8, స్వయం సేవా సంస్థల ద్వారా 110, స్థానిక సంస్థల ద్వారా-32, ఇతరులు-2 మొత్తం నగరంలో 1351 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. సౌకర్యాలు ఉండేవి..ఉండనివి.. అంబులెన్సులు రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీటిలో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఇవి కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రెండో రకం అంబులెన్సులల్లో సిలిండర్ , స్ట్రెక్చర్, ఈసీజీ మిషన్, సిరంజ్‌పంప్, డెఫ్రి బ్రిలేటర్ (హృదయ సంబంధించిన యం త్రం) బ్లడ్ ప్రెషర్ మిషన్, వెంటి లేటర్ సెక్షన్ మిషన్, నెబులైజర్, మాస్కులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, నర్సు, డాక్టర్లు, టెక్నీషియన్ ఉంటారని ససూన్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షులు డాక్టర్ డి.బి.కులకర్ణి పేర్కొన్నారు. ఆర్టీవో పరిశీలనకు దూరం ఆర్టీవో ద్వారా అంబులెన్సుల వాహనంలో అన్ని మిషన్ విడిభాగాలను పరిశీలిస్తారు. భద్రతా పరం గా ఈ వాహ నం ఫిట్నెస్ను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆర్టీవో జారీ చేస్తుంది. ఇలా ప్రతి ఏడాది పరిశీ లి స్తోంది. ఇందుకు ప్రతి అంబులెన్స్ నుండి రూ.300 రుసుం వసూలు ఆర్టీవో అధికారులు వసూలు చేస్తా రు. ప్రస్తుతం నగరంలో సేవలందిస్తున్న 1,351 అంబులెన్సులకు 561 అంబులెన్సు లు ఆర్టీవో వద్ద తనిఖీలు జరపనే లేదు. 2012 తర్వాత ఒక్కసారి కూడా వీటిని పరిశీలించిన దాఖ లాలు లేవు. అంబులెన్సుల పనితీరును పరిశీలించడం తమ పని కాదని పుణే కార్పొరేషన్ ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ తెలిపారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీవో ఈ విషయమై ఆర్టీవో అధికారి జితేంద్ర పాటిల్ మాట్లాడుతూ..ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోం, స్వయం సేవా సంస్థల ద్వారా మొత్తం 1,351 అంబులెన్సులు నడుస్తున్నాయన్నా రు. ఇందులో 790 అంబులెన్సులు ఫిట్నెస్ పరీక్ష లు చేయించుకున్నాయని, కొత్త అంబులెన్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి, పాత అంబులెన్సులను ప్రతి సంవత్సరం తప్పక పరిశీలించాల్సి ఉందన్నారు. ఫిట్నెస్ పరీక్షలు తప్పకుండా జరుపుకోవాలని, లేకుంటే ఆ వాహనాన్ని అన్ ఫిట్ వాహనాలుగా ప్రకటిస్తామని తెలిపారు. -
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేవలు నిల్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రికి రోజూ 600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. 350 వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. రోజూ అత్యవసర సేవల కోసం 25 నుంచి 30 మంది వరకు వస్తుంటారు. వీరికి సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలలో సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. ఆస్పత్రిలో 130 స్టాఫ్‌నర్సు పోస్టులుండగా 32 మంది మాత్రమే ఉన్నారు. 250 వరకు సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అవసరం కాగా 19 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. వీరి సేవలూ అన్ని విభాగాలకు అందుబాటులోకి రావడం లేదు. అత్యవసర సేవల కోసం వచ్చేవారికి కుట్లు, కట్లు వేయడం కోసం వైద్యసిబ్బందికీ కొరత ఉంది. ఒకేసారి అత్యవసర చికిత్స కోసం మూడు నుంచి నాలుగు కేసుల వరకు వచ్చినపుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది. దీంతో రోగుల బంధువులు వైద్యులు, వైద్యసిబ్బందితో తరచూ వాగ్వాదానికి దిగుతున్నారు. అందుబాటులో ఉండని వైద్యులు ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడానికి వైద్యులు సైతం అందుబాటులో లేరు. రోజు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు ఓపీ సేవలకోసం వేచి చూడాల్సిందే.. వైద్యులు ఇష్టానుసారంగా ఆస్పత్రికి వస్తుండడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. జిల్లా ఆస్పత్రిలో 36 మంది వైద్యులు ఉండాలి. కానీ, 14 మందే ఉన్నారు. మెడికల్ కళాశాలకు సంబంధించి 66 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రిలో సేవలందించాల్సి ఉండగా, 18 మందికి మించి విధులకు హాజరు కావడం లేదు. మిగతా ప్రొఫెసర్లు ఆస్పత్రి వైపే కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రొఫెసర్లలో మార్పు రావడం లేదు. సమస్యలపై స్పందన కరువు ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, ఆర్ఎంఓ లేకపోవడంతో స్థానిక వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా పోస్టులలో రెగ్యులర్ అధికారులను నియమిస్తే ఆస్పత్రి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి. వెంటిలేటర్ సౌకర్యం లేదు ఆస్పత్రిలో వెంటలేటర్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటు. దీంతో వెంటిలేటర్ అవసరమైన రోగిని ఇతర ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో అప్పటి కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆస్పత్రిలో ఆ సౌకర్యం ఏర్పాటు కాలేదు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ కూడా లేదు. పోస్టుమార్టం కోసం ప్రత్యేక డాక్టర్‌ను నియమించినా, ఆయన ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రికి వచ్చే వైద్యులు, ప్రొఫెసర్లే అత్యవసర సేవలు, వైద్య సేవలు, పోస్టుమార్టం తదితర సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సరైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. -
ఎస్మాకు ఒకే
అసెంబ్లీలో బిల్లు ఆమోదం.. = అక్రమ సమ్మెలు చేస్తే నాన్-బెయిలబుల్ కేసు = అత్యవసర సేవలు అడ్డుకుంటే వారెంట్ లేకుండా అరెస్ట్ = సమ్మెను ప్రోత్సహించే వారూ శిక్షార్హులే = బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు = పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశముందంటూ విమర్శ = సమ్మె హక్కును కాలరాసేందుకే ఈ బిల్లంటూ ధ్వజం = వాకౌట్ చేసిన జేడీఎస్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజలకు అత్యవసర సేవలను అందించే క్రమంలో భాగంగా అక్రమ సమ్మెలను నివారించడానికి ఉద్దేశించిన ‘కర్ణాటక అత్యవసర సేవల నిర్వహణ బిల్లు-2013’ (ఎస్మా)కు శాసన సభ బుధవారం ఆమోదం తెలిపింది. బెల్గాంలో శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం జేడీఎస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. ఈ బిల్లు ‘అపాయకరమైనది. పోలీసుల అధికారాలను దుర్వినియోగం చేయడానికి ఉద్దేశించినది’ అని ఆ పార్టీ విమర్శించింది. రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి బిల్లును ప్రవేశ పెట్టారు. ఇందులోని ముఖ్యాంశాలను ఆయన వివరిస్తూ, అత్యవసర సేవలకు అడ్డు పడే ఎవరినైనా ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్టు చేయవచ్చని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నేరాలన్నీ నాన్-బెయిలబుల్ కిందకు వస్తాయని తెలిపారు. సమ్మెను ప్రోత్సహించే వారు కూడా శిక్షార్హులేనన్నారు. ఆరోపణలు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా ఉంటుందని చెప్పారు. అక్రమ సమ్మెలకు ఆర్థిక సాయం అందించడం కూడా శిక్షార్హమేనన్నారు. అక్రమ సమ్మెలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుత రూపంలోని బిల్లును ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, జేడీఎస్ సభ్యులు ఎంటీ. కృష్ణప్ప, ఎన్. చెలువరాయ స్వామి, కేఎం. శివలింగే గౌడ, బీజేపీ సభా నాయకుడు జగదీశ్ శెట్టర్, ఆ పార్టీ సభ్యులు విశ్వేశ్వర హెగ్డే కాగేరి, కేజీ. బోపయ్య, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, బీఎస్ఆర్ సీపీ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణప్ప బిల్లు ప్రతులు చించి పైకి విసిరేశారు. ఉద్యోగుల సమ్మె హక్కును ప్రభుత్వం కాలరాయదలచుకుందని దుయ్యబట్టారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకమని విమర్శించారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్, జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా పోలీసులకు అపరిమిత అధికారాలు లభిస్తాయని, తద్వారా వారు చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు కార్మిక వ్యతిరేకమైనదని, కనుక ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్ కోరారు. అయినప్పటికీ రామలింగా రెడ్డితో పాటు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర బిల్లును సమర్థించుకున్నారు. కాగా ఉత్పత్తి, స్టోరేజీ, పంపిణీ, సరఫరా, నీటి పంపిణీ, విద్యుత్, రవాణా సేవలు, సరుకుల రవాణా తదితర రంగాల్లో సమ్మెను ఈ బిల్లు నిషేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 2009లో తీసుకొచ్చిన కర్ణాటక అత్యవసర సర్వీసుల నిర్వహణా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
తుపాను గండం
= ‘ఫైలిన్’ ప్రభావంతో జిల్లాలో వర్షాలు = ఈదురు గాలులు, భారీ వర్షాలు పెరిగే ప్రమాదం = జిల్లాకు ప్రత్యేక అధికారిగా బీఆర్ మీనా నియామకం = కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు = అత్యవసర సేవలకు రెవెన్యూ సిబ్బంది అంగీకారం సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంతో రగిలిపోతున్న జిల్లాకు తుపాను గండం ముంచుకురానుంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతుండటంతో జిల్లా వాసులు కష్టాలను కాస్త ఇష్టంగానే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ‘ఫైలిన్’గా నామకరణం చేసిన తుపాను దెబ్బకు భారీ వర్షాలు, ఈదురుగాలులు ప్రజలను మరింత కుంగదీసే ప్రమాదం ముంచుకురానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి కళింగపట్నం సమీపంలో తీరందాటే అవకాశముందని వాతావరణం నిపుణులు హెచ్చరించారు. దీని ధాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పెనుముప్పు పొంచివుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తుపాను ప్రమాదాన్ని వెల్లడించడంతో కోస్తా తీరంలో కంగారు మొదలైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అధికారి నియామకం.. జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు బీఆర్ మీనాను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. జిల్లాలోని మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధర్‌రావు, విజయవాడ సబ్‌కలెక్టర్ దాసరి హరిచందనలను అప్రమత్తం చేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎల్.విజయ్‌చందర్ ‘సాక్షి’కి చెప్పారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసినట్టు వివరించారు. సహాయక చర్యల కోసం 08672-252572 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు తుపాను అత్యవసర సేవలకు తాము సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్‌వీ చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే రెవెన్యూ సిబ్బంది మాత్రమే సమ్మెను కొనసాగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు.. తుపాను ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. మచిలీపట్నంలో బుధవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సైతం జలమయమై కాలువలను తలపించాయి. పెడనలో భారీ వర్షం కురిసింది. కైకలూరులో మంగళవారం, బుధవారం రాత్రి కూడా కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. గుడివాడ పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోతగా వర్షం పడింది. దీంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉయ్యూరు, పామర్రు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నూజివీడు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. రైతుల్లో ఆందోళన... తుపాను హెచ్చరికలతో జిల్లాలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం నాటి వర్షాల వల్ల నష్టమేమీ ఉండదని, పైగా వరి పైరుకు మేలు చేస్తుందని చెబుతున్నారు. తుపాను ప్రభావం వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెండురోజులకు పైగా కొనసాగితే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్ టి.కల్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. -
72 గంటల పాటు అత్యవసర సేవలు బంద్: జీవీఎంసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిఫల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జేఏసీ బుధవారం విశాఖపట్నంలో స్పష్టం చేసింది. అందులో భాగంగా గురువారం నుంచి 72 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పారిశుద్ద్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా సేవలు రేపటి నుంచి 72 గంటలపాటు నిలిచిపోతాయని తెలిపింది. -
అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దు: సీఎం
టీటీడీ, విద్యుత్, విద్య, వైద్యం తదితర అత్యవసర సేవలకు విఘాతం కలిగంచవద్దని సమ్మె చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవస సేవల ఆవశ్యకతను ఉద్యోగ సంఘాలకు వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యుత్ అధికారులను ఆదేశించారు. సమ్మె పరిస్థితిపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారని పేర్కొంటూ సీఎంవో పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులను అడిగి తెలసుకున్నారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.