అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ | CM YS Jagan Inaugurates Emergency Services Vehicles In AP | Sakshi
Sakshi News home page

అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

Published Thu, Dec 31 2020 11:39 AM | Last Updated on Thu, Dec 31 2020 3:26 PM

CM YS Jagan Inaugurates Emergency Services Vehicles In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది.  చదవండి : న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్‌

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు  అప్పగిస్తామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement