ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిఫల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జేఏసీ బుధవారం విశాఖపట్నంలో స్పష్టం చేసింది. అందులో భాగంగా గురువారం నుంచి 72 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పారిశుద్ద్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా సేవలు రేపటి నుంచి 72 గంటలపాటు నిలిచిపోతాయని తెలిపింది.