Greater Visakhapatnam Municipal Corporation
-
Visakhapatnam: విశ్వ విశాఖ.. మరోసారి కీర్తి పతాకం ఎగరేసింది
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశ్వ విశాఖ..మరోసారి కీర్తి పతాక ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో నాల్గో ర్యాంకు సాధించి.. గత ర్యాంకును అధిగమించింది. 2018–19లో 23వ ర్యాంకుకు పడిపోయిన విశాఖ.. 2019–20లో 9వ స్థానానికి ఎగబాకింది. 2020–21లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది దేశంలో టాప్–5లో నిలిచి 4వ ర్యాంకు సాధించింది. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో కూడా టాప్ సిటీగా జీవీఎంసీ గుర్తింపు పొందడం విశేషం. గార్బేజ్ ఫ్రీ సిటీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి, పర్యాటక ప్రాంతంగా బీచ్ క్లీన్, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ నిషేధం. మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది ర్యాంకులను శనివారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో 2021–22కి గానూ విశాఖ మహా నగరం మొదటి 5 నగరాల జాబితాలో నిలిచింది. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో ఇండోర్‌కు మొదటిస్థానం దక్కగా.. జీవీఎంసీకి నాల్గో ర్యాంకు వచ్చింది. అవార్డులతో మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీశ, అదనపు కమిషనర్ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి జీవీఎంసీకి గతంలో 9.. ఇప్పుడు 4 జీవీఎంసీకి నాల్గో ర్యాంకు రావడంపై విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లీలోని తలక్‌తోరా ఇండోర్ స్టేడియంలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, గత కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి తదితరులు కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జీవీఎంసీకి వచ్చిన మార్కులివీ.. మొత్తం 7,500 మార్కులకు గానూ జీవీఎంసీకి 6,701 మార్కులు వచ్చాయి. పార్ట్–1లో స్వచ్ఛత లీగ్ ప్రోగ్రెసీవ్కు సంబంధించి 3,000 మార్కులకు 2,536, పార్ట్–2లో గార్బేజ్ ఫ్రీ సిటీకి సంబంధించి 1,250 మార్కులకు 1,050, పార్ట్–2బిలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంలో వెయ్యికి వెయ్యి మార్కులు, పార్ట్–3లో సిటిజన్ వాయిస్‌కు సంబంధించి 2,250కి గానూ 2,115 మార్కులు వచ్చాయి. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో బెస్ట్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో నగరాన్ని ఉన్నతంగా నిలపడంలో నగర పౌరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ విషయంలో విశాఖను నంబర్‌వన్‌గా నిలబెట్టారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వచ్ఛతా బృందం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వే నిర్వహించారు. వెబ్సైట్ ద్వారా, గూగుల్ పేలో స్వచ్ఛభారత్ యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో ఏ నగరం ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తారో ఆ నగరానికి గరిష్ట మార్కులు కేటాయిస్తారు. ఈ విభాగంలో వైజాగ్‌కు బెస్ట్ సిటీ అవార్డు వరించింది. 10 నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాలను ఓ విభాగంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో బెస్ట్ సిటీగా ఎంపికైంది. ప్రజల భాగస్వామ్యంతో 4వ ర్యాంకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ 4వ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. అవార్డు సాధించడంలో జీవీఎంసీ యంత్రాంగంతో పాటు స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, సెలబ్రిటీలు, ఆర్డబ్ల్యూఎస్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, నగర పౌరుల కృషి ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో నగరాన్ని మరింత సుందరంగా ఉంచేందుకు అనునిత్యం కృషి చేస్తాం. పోటీతత్వం ఉంటేనే నగరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. రోజురోజుకూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న విశాఖ నగరం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రజలందరి భాగస్వామ్యంతో వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకు సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. – గొలగాని హరి వెంకటకుమారి, మేయర్ అవార్డు మరింత బాధ్యత పెంచింది విశాఖ మహానగరం 4వ ర్యాంకు సాధించి టాప్–5లో నిలవడం గర్వంగా ఉంది. అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి. ఈ అవార్డు పొందడం వెనుక మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గత కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పాలకమండలి, అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు, ఆర్డబ్ల్యూఎస్, నేవల్, పోలీస్, విద్యాసంస్థలు, ఎన్జీవోస్ కృషి ఉంది. 2023లో టాప్–1 స్థానాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమిస్తాం. కేవలం ర్యాంకు కోసమే కాకుండా.. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనం అందించడంతో పాటు క్లీన్ సిటీగా నిత్యం ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్ శత శాతం క్లీన్ సిటీ విశాఖ కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో నియమ నిబంధనలతో పనులు పూర్తి చేస్తున్నాం. పారిశుధ్యం విషయంలో రాజీ పడటం లేదు. అందుకే గత ర్యాంకును అధిగమించి టాప్–5లో నిలిచాం. వచ్చే ఏడాదికి మరింత మెరుగు పడేందుకు ప్రయత్నిస్తాం. పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎంహెచ్వోలు, జెడ్సీలు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు, ఎన్జీవోల సమష్టి కృషితో ఈ అవార్డును సొంతం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. – డా.కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి చెత్త రహిత నగరాల్లో 5 స్టార్ రేటింగ్ చెత్తరహిత నగరాల జాబితాలో గతేడాది 3స్టార్ రేటింగ్ సాధించిన జీవీఎంసీ ఈ ఏడాది 5 స్టార్ రేటింగ్ సాధించింది. 98 వార్డుల్లోనూ తడి పొడి చెత్త విభజన చేసి, ఎరువును తయారు చేయడం వంటి అంశాలన్నీ విశాఖ నగరాన్ని 5 స్టార్ రేటింగ్‌కు తీసుకెళ్లాయి. -
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 9 నామినేషన్లు వేసి టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థికి అదనపు ఓట్లు వచ్చాయి. చదవండి: కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
-
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
విశాఖపట్టణం: గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ముగిసింది. అనంతరం సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 10 మంది విజయం సాధించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో 67 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 57 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మంది ఉండగా, స్వతంత్రులు 4, ముగ్గురు టీడీపీ, బీజేపీ 1, జనసేన 1, సీపీఐ 1 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా టీడీపీ ఉనికి కాపాడుకోవడానికి పోటీ చేసిందని విమర్శించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. పరిపాలన రాజధానికి గ్రేటర్ విశాఖ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తమకు ఏ పార్టీలు పోటీనే కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన విశాఖ అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు. విశాఖలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని పార్టీ నేతలు విమర్శించారు. గ్రేటర్ విశాఖలో గెలిచి మరోసారి సత్తా చాటామని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. -
విశాఖలో చంద్రబాబు రోడ్ షో
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆటవిక రాజ్యం కొనసాగించడానికి రాష్ట్రం నీయబ్బ సొత్తా. కొన్ని రోజులు పోయాక బట్టలేసుకుని తిరిగే పరిస్థితి ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. బీచ్ రోడ్డును తానే అభివృద్ధి చేశానని, విశాఖ అగ్ర నగరంగా తయారు కావాలని కాంక్షించానని, ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపానని చెప్పారు. కాయకష్టం చేసేవారికి ఒక పెగ్గు వేసి పడుకోవడం అలవాటు అని, వారికి నాసిరకం బ్రాండ్లను మూడు రెట్లు ధరలు పెంచి అమ్ముతుండటం సిగ్గు చేటని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎలా పరిరక్షించాలా అని టీడీపీ తాపత్రయ పడుతుంటే.. వైఎస్ జగన్ మాత్రం 7 వేల ఎకరాల్ని అమ్మేయాలంటున్నారని విమర్శించారు. విశాఖ నగరంలో అడ్డపంచెలు కట్టుకుని దిగి, భూకబ్జాలు చేస్తూ, సెటిల్మెంట్ ఆఫీస్‌లు ఏర్పాటు చేశారన్నారు. విశాఖ నగరానికి శనిగ్రహం పట్టిందని, నగరంపై విజయసాయిరెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు. లోకేశ్‌ను మించిపోయిన బాబు అబద్ధపు ప్రచారాలు, పొంతన లేని మాటలు చెప్పే నారా లోకేశ్‌ను మించిపోయేలా చంద్రబాబు విశాఖ పర్యటనలో మాట్లాడారు. నివాసయోగ్య నగరాల్లో విశాఖ నగరం 3వ స్థానం నుంచి 46వ స్థానానికి పడిపోయిందంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2018లో చంద్రబాబు హయాంలో విశాఖ నగరం 17వ స్థానంతో సరిపెట్టుకుంటే.. ఈసారి 2 స్థానాలు మెరుగుపడి 15వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు మాత్రం 46వ స్థానం వచ్చిందని చెప్పడంతో జనం ఆశ్చర్యపోయారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, సిమెంట్, గ్యాస్, నిత్యావసరాల ధరలను సీఎం జగన్ పెంచేశారంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా పొంతన లేని మాటలు చెప్పడంతో అక్కడి వారంతా అసహనం వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థిగా పీలా పెందుర్తి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా 96వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు ప్రకటించారు. బీసీ సంఘాల మండిపాటు చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత తొలుత విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుపై ఉత్తరాంధ్ర బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద బీసీ సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో విమానాశ్రయ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చేసిన తర్వాతే ప్రచారానికి వెళ్లాలని, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా.. రాత్రి 9 గంటలకు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. వంద మందికి పైగా యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు.. విశాఖలో తిరిగే హక్కు లేదంటూ నినాదాలు చేయగా.. పోలీసులు వారిని నిలువరించారు. -
ప్రాజెక్టులతో మహా సంక్రాంతి
జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.374.17 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. కార్య నిర్వాహక రాజధానిగా ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు సన్నద్ధమవుతున్న విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా జీవీఎంసీ చేపట్టిన స్మార్ట్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలకు అనుగుణంగా చేపట్టిన ప్రాజెక్టుల విశేషాలివీ.. సాక్షి, విశాఖపట్నం: విశ్వనగరిని అభివృద్ధి మణిమకుటంగా మార్చేందుకు సంకల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖ నగర ప్రజల సంక్షేమం కోసం జీవీఎంసీ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ సందర్భంగా వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జిందాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టు ఫ్యాబ్రికేషన్స్(జెఐటీఎఫ్) సంస్థతో జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కాపులుప్పాడ డంపింగ్ యార్డు స్థలంలోని 17.50 ఎకరాల యార్డులో ప్లాంట్ నిర్మాణ పనులను జిందాల్ సంస్థ రెండేళ్ల క్రితం ప్రారంభించింది. రూ.320 కోట్లతో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ విశాఖ లిమిటెడ్ పేరుతో ప్లాంట్ సిద్ధమవుతోంది. యార్డులో డంప్ చేసిన చెత్తనంతటినీ ప్లాంట్‌లోకి పంపించి.. రోజుకు 18 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. వచ్చిన చెత్తను బాయిలర్లలో వేసి మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఈ చెత్తను వేడి చేసేందుకు అవసరమైన నీటిని మారికవలస సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పైప్ లైన్ల ద్వారా తీసుకురానున్నారు. విద్యుత్ ఉత్పత్తి జరిగిన తర్వాత మిగిలిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. జనవరి మొదటి వారానికి ప్లాంట్ పూర్తి కానుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు రూ.320 కోట్లు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ రూ.9.70 కోట్లు వారసత్వ కట్టడాల పరిరక్షణ ప్రాజెక్టు రూ.10.97 కోట్లు వుడా పార్కు అభివృద్ధి రూ.33.50 కోట్లు స్మార్ట్‌గా వుడా పార్కు బీచ్ రోడ్డులో 47 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎకరాలను ఖాళీగా విడిచిపెట్టి, మిగిలిన 40 ఎకరాల్లో ఉన్న వుడా పార్కును సమగ్ర అభివృద్ధి చేసి స్మార్ట్ పార్క్‌గా రూపొందిస్తున్నారు. రూ.33.50 కోట్లతో పార్కు ఆధునికీకకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లేక్ బోటింగ్ ఆధునికీకరణలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎథిలీన్ ప్రాపలీన్ డయిన్ ప్రోమేన్ మెనిమేర్(ఈపీడీపీఎం) ఫ్లోరింగ్ నిర్మించారు. పిల్లలు ఆటలాడుకునేలా, పెద్దలు కూర్చొని కబుర్లు చెప్పుకునేలా మల్టీ పర్పస్ లాన్, స్పోర్ట్స్ ఏరియాలో స్కేటింగ్ రింగ్‌తో పాటు టెన్నిస్‌కోర్టులు, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఓపెన్ కోర్టులు పార్కులో సిద్ధమవుతున్నాయి. యాంపీ థియేటర్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఎంట్రన్స్ ప్లాజాలో పగోడాలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖద్వారం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉల్లాసంతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు ఏర్పాటు చేసి వాటి శాస్త్రీయ నామాలు సూచించే బోర్డులు పెడుతున్నారు. మొత్తమ్మీద వుడా పార్కు సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కొత్త రూపు సంతరించుకుంది. పార్కింగ్ కష్టాలకు చెక్ జగదాంబ జంక్షన్లో పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు జీవీఎంసీ రూ.9.70 కోట్లతో రాష్ట్రంలో తొలి మల్టీ లెవెల్ కార్‌పార్కింగ్, దేశంలో తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. 367 చ.మీ. విస్తీర్ణంలో మొత్తం 100 కార్లు పార్క్ చేసేలా దీన్ని నిర్మించారు. ఇప్పటికే కార్ల పార్కింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తం 6 లెవెల్స్‌లో స్ట్రక్చర్ నిర్మించారు. దివ్యాంగులు కూడా పార్క్ చేసుకునేలా సౌకర్యం కల్పించారు. పూర్తి సెన్సార్ల సహకారంతో పార్కింగ్ చేసేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది. వారసత్వ సంపద పరిరక్షించేలా... నగరంలోని వారసత్వ సంపదను పరిరక్షించేందుకు జీవీఎంసీ నడుం బిగించింది. చారిత్రక గురుతులుగా మిగిలి, శిథిలావస్థలో ఉన్న టౌన్‌హాల్, ఓల్డ్ మున్సిపల్ హాల్ సంరక్షణ బాధ్యతలను స్వీకరించింది. రూ.4.13 కోట్లతో టౌన్‌హాల్, రూ.6.84 కోట్లతో పాత మున్సిపల్ భవనం సంరక్షణ పనులు చేపట్టింది. దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయి. పాత కట్టడాలు రూపురేఖలు కోల్పోకుండా, రెండు భవనాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు ఎంవీపీ కాలనీలోని స్పోర్ట్స్ ఎరీనాను రూ.19.89 కోట్లతో నిర్మిస్తున్నారు. రూ.20 కోట్లతో మూడు స్మార్ట్ రహదారులు పూర్తి చేస్తున్నారు. జనవరి మొదటి వారానికల్లా ఈ రెండు ప్రాజెక్టుల పనులు పూర్తయితే.. వీటిని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే నగర వాసులకు మరింత ఆహ్లాదం, అంతకు మించి ఆరోగ్యం అందుతుందని భావిస్తున్నారు. -
గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు
సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. (చదవండి: గీతం ఆక్రమణలకు చెక్) అక్రమాల ‘గీతం’పై ప్రభుత్వం ఆరా.. గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు. దీనికి తోడు.. అడ్డగోలుగా.. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్ పాసేజ్ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్ కాలేజ్‌కి మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తి చేసేశారు. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. -
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్‌రాజు విమర్శలు గుప్పించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని అన్నారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు తెలిపారు. రికార్డులు తారుమారు చేసి సబ్బం హరి పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. గతంలో ఆయన ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి పట్టించుకోలేదని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. గతంలో ఆయన భూకబ్జాపై అయ్యన్నపాత్రుడు పోరాటం కూడా చేశారని, జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను అయ్యన్న నిలదీశారని తెలిపారు. ఇప్పుడు సబ్బం హరికి మద్దతుగా అయ్యన్న మాట్లాడటం సిగ్గుచేటని కరణం ధర్మశ్రీ విమర్శించారు. (చదవండి: కబ్జా స్థలంలో టాయిలెట్ నిర్మించిన సబ్బం హరి) -
చేతిలో నెల రోజుల బిడ్డతో..
-
చేతిలో నెల రోజుల బిడ్డతో..
పండంటి బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనా వైరస్‌పై పోరాడేందుకు విధుల్లో చేరారు. సెలవు తీసుకునే వెసులుబాటును పక్కకు పెట్టి.. విశాఖలో కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్నారు. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా భావించి.. విపత్కర పరిస్థితుల్లో ఎంతో బాధ్యతతో, ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో ముందుకు కదులుతున్నారు. ఆమె జీవీఎంసీ కమిషనర్ జి సృజన. సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వరిస్తున్న సృజన.. నెల రోజుల కిందట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఇలాంటి సమయంలో విశాఖపట్నం లాంటి మహానగరంలో మున్సిపల్ కమిషనర్ అవసరం ఎంతమేర ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణకు తన అవసరం ఎంత ఉందో తెలిసిన సృజన.. వెంటనే విధుల్లో చేరారు. బిడ్డను భర్త, తల్లికి అప్పజెప్పి తన విధులకు హాజరవుతున్నారు. కేవలం ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పేద ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడి తన వంతు బాధ్యతను నిర్వరిస్తున్నారు. ఆమె ప్రసవానికి కొద్ది రోజుల ముందువరకు కూడా తన బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో విశాఖలోని ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై సృజన సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, జిల్లా యంత్రాంగం సహకారంతో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని సృజన తెలిపారు. విశాఖలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..‘కరోనాతో అనుకోని క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా నియంత్రణలో భాగంగా నా పాత్రను నిబద్ధతతో పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ప్రజల తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి అవసరం ఉంటుందని తెలుసు. కానీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టాను. కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నా. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆ స్ఫూర్తిలో నాది చిన్న పాత్ర. నా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ధైర్యమిచ్చారు’ అని పేర్కొన్నారు. -
జీవీఎంసీ అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం
సాక్షి, విశాఖపట్నం : ఇసుక కొరతకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతీ శ్రీనివాస్, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యే గుడివా అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు యుద్ద ప్రాదిపదికన జీవీఎంసీలోని రోడ్లు, కాల్వలు, శ్మశాన వాటికల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో మూడు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలకు సిద్దం చేయనున్నట్లు మరో మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి నాటికి విశాఖలో ఇసుకకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, అందుకోసం డెంకాడలో ఇసుక రీచ్ కేటాయింపులు జరపాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బూసర్ల లక్ష్మి కుటుంబానికి మంత్రులు బొత్స, అవంతీలు పది లక్షల నష్ట పరిహారం అందించారు. బోటు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం బోటు ప్రమాదంలో మృతి చెందిన తిరుపతి వాసుల కుటుంబీకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కుమార్తె, కుమారుడు చనిపోయారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సుబ్రమణ్యం భార్య మాధవి లతకు 15 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. బోటు ప్రమాదం లో సుబ్రమణ్యం తో పాటు ఆయన ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరమని కరుణాకర్ రెడ్డి అన్నారు. సుబ్రమణ్యం కుటుంబీకులకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. -
మాజీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని శనివారం జీవిఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందునే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీవిఎంసీ పరిధిలో జీ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ అందుకు విరుద్దంగా పీలా గోవిందు ఐదు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో దానిని కూల్చివేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. -
విశాఖలో అవినీతి చేపలు ; ఏసీబీ వల
సాక్షి, విశాఖపట్నం : అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఏసీబీ షాకించ్చింది. విశాఖపట్నం జిల్లా మదనపల్లె వీఆర్వో వెంకటేశ్వరరావు, మద్దెలపాలెం వీఆర్వో ఏవో వెంకటేశ్వరరావు, మాల్కాపురం సంజీవ్ కుమార్, జీవీఎంసీ 3వ జోన్ చైన్మన్ నాగేశ్వరరావుల ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార కేసులో ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్‌లో తాము చేపట్టిన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా జీవీఎంసీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు జుపిటర్ ఆటోమొబైల్స్‌కు భవన నిర్మాణ అనుమతినివ్వాలంటూ జీవీఎంసీని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో సదరు సంస్థ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు జీవీఎంసీ కమిషనర్ తీరును తప్పుపట్టారు. కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఇందుకు గాను కోర్టు ధిక్కారం కింది కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. సింగిల్ జడ్జి తీర్పు గురించి ఏజీ వివరించారు. అనంతరం ఆ తీర్పు అమలును నిలిపేస్తూ ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా
విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం: కోర్టు ఆదేశాల మేరకే జూపిటర్ ఆటోమొబైల్స్ సంస్థకు భవన నిర్మాణం కోసం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూపిటర్ ఆటో మొబైల్స్ సంస్థ భవన నిర్మాణానికి 2009లో దరఖాస్తు చేసిందని, వివిధ కారణాల వల్ల జాప్యం జరగ్గా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిందన్నారు. విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష ఆ సంస్థకు నాలుగు వారాల్లో అనుమతులు మంజూరు చేయాలని హైకోర్టు 2014 డిసెంబర్లో ఆదేశించిన విషయం వాస్తవమేనన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో అనుమతుల మంజూరులో జాప్యం జరిగిందని, అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టంచేశారు. -
విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఉమ్మడి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనకు 30 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. 4 వారాల్లో జరిమానా చెల్లిం చాలని, లేకుంటే మరో నెలపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేసింది. జైలుశిక్ష అనుభవించే సమయంలో ప్రవీణ్ కుమార్‌కు రోజుకు రూ.300 జీవన భృతి కింద చెల్లించాలని అధికారులను ఆదే శించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీ వల తీర్పు చెప్పారు. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్ వార్డు లోని ప్లాట్ నంబరు 44లో భవన నిర్మాణం నిమిత్తం జీవీఎంసీకి 2009లో చేసుకున్న దరఖాస్తును జీవీఎంసీ అధి కారులు తిరస్కరించారు. దీన్ని సవాలు చేస్తూ జుపిటర్ ఆటోమొబైల్స్ హైకోర్టులో వేర్వేరు సంవత్సరాల్లో పలు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు.. భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆదేశిం చినా దరఖాస్తును జీవీఎంసీ అధికారులు తిరస్కరించారు. దీంతో జుపిటర్ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
డర్టీ సిటీ!
ఎన్నిసార్లు చెప్పాలి? ► గ్రేటర్ విశాఖను చూసి నేర్చుకోండి ► కమిషనర్‌కు సీఎం చీవాట్లు ► కార్పొరేషన్లో హాట్ టాపిక్ సిటీ వరస్టుగా ఉంది. బందరురోడ్డు, ఏలూరురోడ్డు మినహా మరెక్కడ చూసినా చెత్తకుప్పలే.. చాలాసార్లు చెప్పా.. మీరు మారడం లేదు.. ఇక నేనే మారుస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరపాలక సంస్థ కమిషనర జి.వీరపాండియన్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కర ఏర్పాట్లకు సంబంధించి గత వారాంతంలో హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి, కలెక్టర్, మేయర్, కమిషనర్, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం అంశం ప్రస్తావనకు రాగా కమిషనర్‌పై సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది. ‘గ్రేటర్ విశాఖపట్నంలో పారిశుద్ధ్యం బాగోలేదని ఒక్కసారి చెబితే అక్కడి కమిషనర్ సెట్‌రైట్ చేశారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో! విజయవాడకు నేనొచ్చి ఎనిమిది నెలలైంది.. శానిటేషన్ బాగోలేదని చాలాసార్లు చెప్పా... ఏం ప్రయోజనం లేదు. ఏం చేస్తున్నట్లు?’ అంటూ చంద్రబాబు కమిషనర్‌ను గట్టిగా నిలదీశారని సమాచారం. పనిలో పనిగా మున్సిపల్ మంత్రి పి.నారాయణకు సైతం సీఎం చురకలు వేశారని తెలిసింది. రాజధాని నగరంలోనే శానిటేషన్ బాగోపోతే ఎలా అంటూ మంత్రికి క్లాస్ తీసినట్లు వినికిడి. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో 22వ స్థానంలో నిలిచామంటూ జబ్బలు చరుచుకున్న అధికారులకు సీఎం వ్యాఖ్యలతో దిమ్మతిరిగినంత పనైంది. అన్నీ మాటలేనా! నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం పనితీరు అధ్వానంగా మారింది. 2,984 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 850 మంది పర్మినెంట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క ఔట్సోర్సింగ్ కార్మికులకే నెలకు రూ.4 కోట్లు జీతాలుగా చెల్లిస్తున్నారు. బందరు, ఏలూరురోడ్లతోపాటు నేషనల్ హైవేలో 24/7 శానిటేషన్ నిర్వహించే బాధ్యతను బీవీజీ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. బందరు, ఏలూరు రోడ్లను లిట్టర్‌ఫ్రీ (చెత్తరహిత) జోన్లుగా ప్రకటించారు. ఇవన్నీ కేవలం మాటలే.. గత నెలలో బందరురోడ్డులోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రాగా ఆ ప్రాంతంలో చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. దీనిపై అప్పట్లోనే సీఎం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కమిషనర్ పనితీరుపై ఇటీవలి కాలంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో కలిసి సమీక్షలు, సదస్సులతో బిజీగా ఉంటున్న కమిషనర్‌కు నగరపాలనపై పట్టు తప్పిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చీవాట్లు పెట్టడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. పాలన గాలికి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజారోగ్య శాఖలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏఎంవోహెచ్‌లు ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా పాతుకుపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్లను (ఎస్.ఐ.లు) ఏడాది క్రితం లాటరీ ద్వారా డివిజన్లు మార్చారు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. కొందరు ఎస్.ఐ.లు ఉన్నతాధికారుల్ని మేనేజ్ చేసుకొని తమకు కావాల్సిన డివిజన్లలో అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యధిక శాతం పర్మినెంట్ ఉద్యోగులు మస్తర్లు పూర్తయ్యాక వెళ్లిపోతున్నారు. ఇందుకుగాను సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లకు నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు ముట్టజెబుతున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో సుమారు 400 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫలితంగా నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. చర్యలేవీ! నగర పర్యటన సందర్భంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషనర్ గుర్తిస్తే కార్మికులపై చర్యలతో సరిపెడుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా రెండు ఏఎంవోహెచ్ పోస్టుల్లో ఇన్చార్జులే ఉన్నారు. వీరికి అదనపు బాధ్యతలు ఉండడంతో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు న్నాయి. ఎస్.ఐ.లపై స్పష్టమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారులు మొహమాటం ప్రదర్శిస్తున్నారు. మలేరియా విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఎస్.ఐ.ల కనుసన్నల్లో ప్రజారోగ్య విభాగం నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ చక్కదిద్దకపోవడం వల్లే కమిషనర్ సీఎం వద్ద మాటపడాల్సి వచ్చిందని ఉద్యోగులు గుసుగుసలాడుకోవడం కొసమెరుపు. -
కిక్కే...కిక్కు
- మద్యం షాపులకు వెల్లువెత్తిన దరఖాస్తులు - చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు - నగర పరిధిలో షాపులకు యమగిరాకీ - ఏజెన్సీ షాపులకు స్పందన శూన్యం సాక్షి, విశాఖపట్నం: ఊహించని రీతిలో మద్యం షాపు లవేలం కాసుల వర్షం కురిపిస్తోంది. దరఖాస్తు చేసేందుకు చివరిరోజు కావడంతో శనివారం వ్యాపారులు క్యూకట్టారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని షాపుల కోసం పోటీపడిన వ్యాపారులు ఏజెన్సీ పరిధిలోని షాపుల వైపు కన్నెత్తి చూసేపరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా, వీటిలో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 367 షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకోసం స్థానిక శివాజీపాలెంలో ఉన్న సవేరా ఫంక్షన్‌హాలులో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభం కాగా, తొలి మూడు రోజులు అంతంతమాత్రంగా ఉన్న స్పందన శుక్రవారం సాయంత్రానికి 134 షాపులకు 404 దరఖాస్తులు వచ్చాయి. 233 షాపులకు శుక్రవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. చివరి రోజైన శనివారం ఊహించని రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మొదలైన తాకిడి అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు సుమారు 315షాపుల కోసం 2,586 దరఖాస్తులు వచ్చాయి. మరో 500 మంది వరకు దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీపరిధిలో 25 షాపులతో పాటు గ్రామీణ జిల్లాలోని మరో 25 షాపులకు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. సిటీ పరిధిలోని 62 షాపులతో పాటు జీవీ ఎంసీ పరిధిలోకి వచ్చిన పెందుర్తి, భీమిలి, గాజువాక, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఈ షాపుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నగర పరిధిలోని జ్ఞానాపురం, ఓల్డ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్టాండ్, ఎన్ఎడీ జంక్షన్ వంటి ప్రాంతాల్లోని మద్యం షాపులకు 50 నుంచి 100 వరకు దరఖాస్తులు పడినట్టు తెలుస్తోంది. ఒక్క జ్ఞానాపురం షాపుకే అత్యధికంగా 110 దరఖాస్తులు దాఖలైనట్టుగా చెబుతున్నారు. లెసైన్సింగ్ ఫీజుల రూపంలోనే సుమారు రూ.పాతికకోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తన్నాయి. ఆదివారం ఉదయానికి గానీ ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి.ఏఏ షాపులకు దరఖాస్తులు పడలేదో చెప్పలేమని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
గ్రేటర్ విశాఖలో జెండా ఎగరేద్దాం
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ చంద్రబాబు సాగించిన ఏడాది నయవంచక పాలనపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోందని విమర్శించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలతో పార్టీ శ్రేణులు మమేకం కావాలని, ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం విశాఖలో గ్రేటర్ విశాఖ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విజయమే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఎన్నికల్లో పార్టీని గెలిపించి విజయమ్మకు కానుకగా ఇద్దామని చెప్పారు. -
స్వైన్‌ఫ్లూ పై కదిలిన జీవీఎంసీ
విశాఖపట్నం సిటీ : స్వైన్ ఫ్లూ నివారణపై జీవీఎంసీ యంత్రాంగం కదిలింది. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు పారామెడికల్ బృందాలను రంగంలోకి దించింది. నగరంలోని వివిధ జోన్లలో వున్న పారామెడికల్ ఉద్యోగులందరికీ ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. జోన్-4 ప్రాంతమంతా మురికివాడలతోనే వుండడంతో ఎక్కువ దృష్టి సారించారు. వైరస్ సోకే అవకాశాలున్న వారి ఆరోగ్యో పరిస్థితిపై సహాయ వైద్యాధికారి డాక్టర్ మురళీ మోహన్ ఆరా తీస్తున్నారు. హుదూద్ తుఫాన్ తర్వాత అర్బన్‌లో పారిశుద్ధ్య సమస్య మరింత పెరిగింది. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ఎక్కడ విజృంభిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. పల్స్‌పోలియో వాలంటీర్లు, పారామెడికల్ ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించే బాధ్యతలను అప్పగించారు. మరుగుదొడ్లు లేని వారు ఎంత మంది వున్నారో గుర్తించే పనిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అర్బన్‌లో 72 వార్డులకూ 86 బృందాలను నియమించారు. 775 మురికివాడల్లో గత వారం రోజులుగా సర్వే చేసి 20 వేల మందికి లెట్రిన్లు లేవని గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో మరో 20 వేలకు పైగా మరుగుదొడ్లు లేని ఇళ్లను సులువుగానే గుర్తించే అవకాశాలున్నాయని వైద్య సిబ్బంది అంటున్నారు. 4.30లక్షల ఇళ్లు వున్నాయని ఇంకా ఇళ్లు లేని వారు, కొండలపై నివాసముంటున్న వారు, పాకల్లో వుంటున్న వారు, టెంట్లలో వుంటున్న వారందరినీ లెక్కలేస్తే లక్షల్లోనే లెట్రిన్లు లేనట్టుగా నమోదయ్యే ఛాన్స్‌లున్నాయి. -
ప్రచారం అంతంతే..
స్వైన్‌ఫ్లూపై కొరవడిన స్పందన కేసు నమోదుతో కదిలిన యంత్రాంగం విస్త్రృత ప్రచారానికి తాజాగా సన్నద్ధం విశాఖ మెడికల్ : జిల్లాలో స్వైన్‌ఫ్లూపై ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. వారం రోజులుగా జిల్లాలో అనుమానిత కేసు లు నమోదవుతున్నా జిల్లా యం త్రాంగం కేవలం మీడియా ప్రచారానికే పరిమితమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీవీఎంసీ ఆరోగ్య విభాగాలు ఇటీవల వ్యాధి అవగాహన ప్రచార పోస్టర్, కరపత్రాన్ని ముద్రించి మంత్రి గంటా చేతుల మీదుగా విడుదల చేసి తమ పనైందనిపించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగర పరి ధిలో పరిశీలించినా స్వైన్‌ఫ్లూ ప్రచారం తూతూ మంత్రంగా సాగుతోందని చె ప్పవచ్చు. ఈ లోగా నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంత్రులు కూడా ఈ వ్యాధి నివారణకు ముందస్తు చర్యలపై గురువారం సమీక్ష నిర్వహించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీవీఎంసీ వైద్యాధికారుల ప్రచార తీరును తప్పుపట్టారు. నిధులు లేకపోతే సమకూరుస్తాం. కానీ స్వైన్‌ఫ్లూ ప్రచారం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు చేరేలా ఆదేశించడంతో వైద్య వర్గాలు మంత్రుల మందలింపుతో మేల్కొన్నాయి. జిల్లా వ్యాపితంగా ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్, ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు సినిమా హాల్స్, లోకల్ టీవీ ఛానల్స్‌లో విస్రృత ప్రచారం గావించడానికి సన్నద్ధమయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి సంయుక్తంగా మాస్ మీడియా ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించేందుకు గురువారం ఉదయం నుంచే నిమగ్నమయ్యారు. పీహెచ్సీ పరిధిలోనూ, నగరంలోని అన్ని వార్డుల పరిధిలోని మురికివాడల సైతం స్వైన్‌ఫ్లూ ప్రచార సామగ్రిని ఇంటింటికి పంపిణీ చేసి వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డాక్టర్ జె.సరోజిని, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, నగర పరిధిలోని అన్ని డిస్పెన్సరీల్లో మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు వారు చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జీవీఎంసీ పరిధిలోని అన్ని స్కూల్స్ విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా గాల్లో తేమ ఎక్కువగా ఉన్న విశాఖ నగరంలో స్వైన్‌ఫ్లూ వైరస్ మరింత శక్తిని పుంజుకుంటోంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు వైరస్ భయం ఎక్కువగా ఉంటుందని కేజీహెచ్ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ పి వేణుగోపాల్ చెప్పారు. పొడి వాతావరణమైన హైదరాబాద్ కంటే ఈ వ్యాధి తీవ్రత విశాఖలోనే ఎక్కువగా ఉంటుంది. అదృష్టవశాత్తూ రథసప్త మి తర్వాత ఎండలు పెరుగుతుండడంతో వారం పది రో జుల్లోనే స్వైన్‌ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు.. మూడు రోజులకు మించిన జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు. వీటితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం. వ్యాధి సోకకుండా చేపట్టాల్సిన చర్యలు.. చేతులు తరచూ శుభ్రపరచుకోవాలి దగ్గినా.. తుమ్మినా నోటికి, ముక్కుకి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో(పుణ్యక్షేత్రాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్)సంచరించకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల కళ్లు, ముక్కు, నోటిని తాకడానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బు, లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి కరచాలనం, ఆలింగనం చేసుకోరాదు వ్యాధి సోకితే..తీసుకోవల్సిన జాగ్రత్తలు.. వ్యాధిగ్రస్తుడు ఎక్కువగా ద్రవపదార్థాలు, పోషకాహారాలు తీసుకోవాలి రోగులు వాడిన వస్తువుల్ని ఇతరులు తాకరాదు రోగులు వాడిన వస్తువులు ఎక్కడబడితే అక్కడ పడేయరాదు వ్యాధిగ్రస్తుడు ఎక్కడిబడితే అక్కడ ఉమ్మి వేయరాదు నిపుణుల పర్యవేక్షణలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందడం మేలు వీరిలో వ్యాధి సోకే అవకాశం అధికం.. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, 65ఏళ్లు పైబడిన వృద్ధులు {బాంకైటీస్, రక్తపోటు, డయాబెటీస్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు, అధిక బరువు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రి, పిల్లలు గర్భిణీలకు చికిత్స అందించే కేజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డుల్లో పూర్తి స్థాయిలో వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చాలి. స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స చేసే సమయంలో సదుపాయాలు లేని కారణంగా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అవసరమైన మందులు వైద్య పరికరాలు కల్పించాలి.చికిత్స చేసే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా రక్షణ పరికరాలు సమకూర్చడంతో పాటు కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ నిర్థారణ వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి. -డాక్టర్ పి.శ్యామ్‌సుందర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లాలో స్వైన్‌ఫ్లూ తనిఖీ కేంద్రాలివే.. ప్రభుత్వ ఛాతి ఆస్పత్రి, కింగ్ జార్జ్ ఆస్పత్రి, పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి, పోర్టు ఏరియా ఆస్పత్రి (సాలిగ్రామపురం), స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రి, నేవీ ఆస్పత్రి, రైల్వే ఆస్పత్రి, ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి(అనకాపల్లి), ఏరియా ఆస్పత్రి(నర్సీపట్నం), పాడేరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, అరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ -
నవ సారథులు
ఎట్టకేలకు కీలక పోస్టుల భర్తీ జేసీగా జె.నివాస్ జీవీఎంసీ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ వుడా వీసీగా బాబూరావు నాయుడు ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా ముత్యాలరాజు విశాఖపట్నం :ఇన్చార్జిల పాలనకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త అధికారులు బుధవారం నియమితులయ్యారు. జిల్లాలోని కొందరు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం మరికొందరిని కొత్తగా కేటాయించింది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు వుడా వైస్ చైర్మన్ పోస్టులు సుమారు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఐఏఎస్‌ల పంపకాలు పూర్తికావడంతో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులతో పాటు కీలకమైన జేసీ, ఐటీడీఏ పీవోలతో పాటు ఏపీఈపీడీసీఎల్ సీఎండీలకు స్థానచలనం కలిగించారు. వారి స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు కూడా బదిలీ తప్పదన్న వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బ్రేకు పడింది. జాయింట్ కలెక్టర్‌గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన జే.నివాస్‌ను నియమించారు. ఆదిలాబాద్ ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న ఈయన్ను ఏపీకి కేటాయించారు. తెలంగాణా ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ఈయన్ని జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక గిరిజన జనాభా ఉన్న విశాఖలో ఐటీడీఏ పీవో పోస్టు కీలకమైంది. ఈ పోస్టులో ఇంతకాలం ఉన్న ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈయన స్థానంలో ఎం.హరినారాయణను నియమించింది. ఈయన్ను కూడా తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించారు. సివిల్స్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన రేవు ముత్యాల రాజును ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న శేషగిరిబాబు కీలకమైన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన టి.బాబూరావు నాయుడును వుడా వైస్ చైర్మన్‌గా నియమించారు. నెగ్గిన ‘గంటా’ పంతం జేసీ ప్రవీణ్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్న జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమించారు. ఈ విషయంలో రాష్ర్టమంత్రి గంటా శ్రీనివాసరావు పంతం నెగ్గించుకున్నారు. హుద్‌హుద్ తుఫాన్ ముందే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయినప్పటికీ ఆ జిల్లా ప్రజాప్రతినిధుల వ్యతిరేకతతో జిల్లాలో కొనసాగుతున్న జేసీని కమిషనర్‌గా నియమించాలని గంటా తన వియ్యంకుడు మున్సిపల్ శాఖామంత్రి నారాయణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఏడాదిగా ఖాళీగా ఉన్న జీవీఎంసీ కమిషనర్, వుడా వైస్ చైర్మన్ పోస్టుల భర్తీతో ఇన్చార్జిల పాలనకు కూడా పూర్తిగా తెర పడినట్టయింది. పోలీస్ కమిషనర్ పోస్టును కూడా భర్తీ చేస్తే జిల్లా పాలన పూర్తి స్థాయిలో గాడిలో పడనుంది. -
విశాఖ మేయర్ మనకే దక్కాలి
* నేతలు సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ పిలుపు * సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని సూచన * క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఇంకా దగ్గర కావాలని సలహా * మేయర్ పీఠం తమదేనన్న గుడివాడ అమరనాథ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను సాధించి మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశాఖపట్టణం జిల్లా నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల తరువాత రానున్న ఎన్నికలు కనుక ప్రతి కార్యకర్త, నాయకుడు తమ దృష్టిని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాలన్నారు. పార్టీ బలాబలాలను ఇప్పటి నుంచే అంచనా వేసుకుంటూ ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఇంచార్జిలు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఇంకా దగ్గర కావాలని చెప్పారు. 40 మందికి పైగా పాల్గొన్న ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటుగా ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను పునరావాస చర్యలపై ప్రభుత్వం తీరు, చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పిలుపునిచ్చిన డిసెంబర్ 5వ తేదీ మహాధర్నా, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలు సుదీర్ఘంగా చర్చించారు. మేయర్ పీఠం మాదే: గుడివాడ అమరనాథ్ గ్రేటర్ విశాఖపట్టణం మేయర్ పదవిని తాము గెలుచుకోగలమని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినందువల్ల తమ పార్టీ శ్రేణులు తొలుత కొంత నిరుత్సాహానికి లోనైనా, ఇపుడు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారని చెప్పారు. మెజారిటీ స్థానాలను గెలిచి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని తాము పార్టీ అధ్యక్షుడు జగన్‌కు చెప్పామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మహాధర్నా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద జగన్ పాల్గొంటారని తెలిపారు. హుద్‌హుద్‌లో సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో 38వేల కుటుంబాలు నష్టపోయాయని సాక్షాత్తూ అధికారులు నిర్ధారిస్తే కేవలం రెండువేల కుటుంబాలకు నష్టపరిహారం అందించారని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతా ల్లో 83 వేల కుటుంబాలు నష్టపోతే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదిరోజులు విశాఖలో ఉండి ప్రచార ఆర్భాటం చేసుకున్నారనీ, వాస్తవానికి ఈనాటికీ విశాఖ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ జరుగలేదని తెలిపారు. సమావేశంలో ముఖ్యనేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు సుజయ్‌కృష్ణ రంగారావు, గొల్ల బాబూరావు, విశాఖ పరిశీలకుడు ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దిడ్డి ఈశ్వరి, కిడారు సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్లా జయప్రసాద్, తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రి బలివాడ సత్యారావు సహా పలువురు పాల్గొన్నారు. పోస్టర్ విడుదల డిసెంబర్ 5న విశాఖలో జరుగనున్న మహాధర్నా కోసం జిల్లా నేత పోతల ప్రసాద్ రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను జగన్మోహన్రెడ్డి సమావేశానంతరం విడుదల చేశారు. విశాఖ ముఖ్య నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ సిద్ధం: జిల్లా అధ్యక్షుడు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని విశాఖపట్నం జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ... గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని 72 డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అందుకోసం రేపటి నుంచి వార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 10వ తేదీలోగా ప్రజాస్వామ్యబద్దంగా కమిటీలను నియమించనున్నట్లు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. -
ఫిఫ్టీ.. ఫిఫ్టీ
విశాఖపై పెత్తనం గంటాకు.. అయ్యన్నకు రూరల్ జిల్లా పోలీస్ శాఖలో బదిలీలకు సర్వాధికారాలు వారికే ఊళ్లు పంచేసిన టీడీపీ అధినేత! కీలక పోస్టింగుల కోసం అధికారుల పైరవీలు తమవారి కోసం మంత్రుల ప్రతిపాదన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు... అయ్యన్నపాత్రుడు... వారిద్దరూ అసలే ఉప్పూనిప్పూ. అందుకే వర్గపోరు ఎందుకని భావించారో ఏమో ఇద్దరికీ ‘ఊళ్లు పంచేశారు’. అందుకు పోలీసు శాఖలో బదిలీలే తొలి మజిలీ కానున్నాయి. కీలక పోస్టింగులపై కన్నేసిన అధికారులు వారిద్దర్నీ ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. వర్గ సమీకరణలే ప్రధాన ప్రాతిపదికగా... అస్మదీయ అధికారులకు అందలమే లక్ష్యంగా ఈ బదిలీల ప్రహసనానికి తెర వెనుక యత్నాల కథ కమామిషు ఇదిగో ఇలా ఉంది. మీ వాళ్లెవరో చెప్పండి గ్రేటర్ విశాఖకు సంబంధించినంతవరకు గంటాయే అంతా చూసుకుంటారు... రూరల్ జిల్లా వ్యవహారాల్లో మాత్రం అయ్యన్న మాటే చెల్లుతుంది అని సీఎం చంద్రబాబు తేల్చేసినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సిటీ వరకు గంటా, రూరల్ జిల్లాకు సంబంధించి అయ్యన్నలు సూచించిన మేరకు చేస్తామని చెప్పేశారుట. వచ్చే నెల మొదటివారం తర్వాత ఏసీపీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐల బదిలీల ప్రక్రియ చేపడతామని కూడా వెల్లడించారు. దాదాపు 70 మందికి స్థాన చలనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటకే పెద్దపీట వేస్తూ ఈ బదిలీల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మీ వాడినే... కీలక పోస్టింగులపై కన్నేసిన పోలీసు అధికారులు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సామాజికవర్గ సమీకరణలను ప్రస్తావిస్తూ పైరవీలు తీవ్రతరం చేశారు. ‘నేను మీ వాడినే’నని బీరకాయ పీచు సంబంధాలను ప్రస్తావిస్తూ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు. వర్గ సమీకరణలకే ప్రా ధాన్యమిచ్చే అధికార పార్టీ నేతలు కూ డా వారివైపే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు కొన్ని మచ్చుతునకలు... విశాఖ సిటీ సౌత్‌లో ఉన్న ఓ ఉన్నతాధికారి మధురవాడలో పోస్టింగ్‌పై కన్నేశారు. భవిష్యత్తులో కీలక వ్యవహారాలకు భీమిలి నియోజకవర్గమే ప్రధాన కేంద్రం కానుందని ఆయన గుర్తించారు. మంత్రి గంటాతో మొదటి నుంచి టచ్‌లో ఉంటూ వచ్చారు. తాజాగా ‘నేను మీ వాడినే... మీ దగ్గరకే తీసుకుపొండి’అని విన్నవించుకోగా ఆయన సరేనన్నారు. పీఎం పాలెం, భీమిలీలలో పోస్టిం గుల కోసం కూడా ఇద్దరు అధికారులకు గంటా మాట ఇచ్చారని తెలుస్తోంది. అనకాపల్లిలో ప్రస్తుతం అంతగా ప్రాధాన్యంలేని స్థానంలో ఉన్న ఓ అధికారి చోడవరంలో పోస్టింగ్ కోరుకోగా అయ్యన్న అభయమిచ్చారు. పరవాడ,పెందుర్తిలలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కూడా అంత కంటే మంచిస్థానాల కోసం మంత్రి అయ్యన్న వర్గీయుల నుంచి హామీ పొందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు జిల్లాకు వచ్చేందుకు పైరవీలు ముమ్మరం చేశారు. నిబద్ధతకు విలువ లేదా! కేవలం వర్గ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ బదిలీలకు రంగం సిద్ధం చేస్తుండడం పట్ల పలువురు పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనితీరు... నిబద్ధత... ట్రాక్ రికార్డు అనేవేవీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. విశాఖ సిటీలో పని చేస్తున్న ఓ అధికారి ఇటీవల అధికార పార్టీ నేతను కలవగా...‘మా వాడికి మాటిచ్చేశాను’అని చెప్పేశారు. తన ట్రాక్ రికార్డును ఆయన చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ నేత వినిపించుకోకుండా వెళ్లిపోయారు. త్వరలో జరగనున్న పోలీసు అధికారుల బదిలీలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ ఉదంతమే సూచిక అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. అందండీ సంగతి!