
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని శనివారం జీవిఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందునే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీవిఎంసీ పరిధిలో జీ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ అందుకు విరుద్దంగా పీలా గోవిందు ఐదు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో దానిని కూల్చివేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment