- నిలిచిన అత్యవసర సేవలు
- కదలని 32 వాహనాలు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
ఆదిలాబాద్ టౌన్ : అపర సంజీవని 108 సేవలపై సమ్మె దెబ్బపడింది. ఈ నెల 7న జీవీకే సంస్థకు ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు విఫలం కావడంతో గురువారం నుంచి ఉద్యోగులు సమ్మె చేపట్టారు. అత్యవసర వైద్య సేవలకు ఉద్యోగులు దూరంగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 32 వాహనాలు రోడ్డెక్కలేదు. జిల్లాలో 155 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఈఎం టీలు 80 మంది, పెలైట్లు 75 మంది సమ్మెలో పాల్గొన్నారు. రోజు కనీసం 160 నుంచి 170 మం దిని ప్రమాదాల్లో గాయపడిన వారిని అత్యవసర వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వీరు సమ్మె చేయడంతో బాధితులకు సమయానికి వైద్యం అందడం లేదు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. వైద్య శాఖ, 108 అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 108 సేవల్లో ఖాళీగా ఉన్న పోస్టులకోసం ఇంట ర్వ్యూలు నిర్వహించారు. వారి ద్వారా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. 54 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇటీవల ఇంటర్వ్యూలు జరిగాయని, వారితో విధు లు నిర్వర్తించేందుకు చర్యలు తీసుకుం టున్నామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.
డిమాండ్లు ఇవీ..
- తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.
- ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కనీస వేతనాలు అమలు చేయాలి.
- పనిగంటలు 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించాలి.
- 108 వాహనాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలి.
- తెలంగాణ ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించాలి.
- ఉద్యోగులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించాలి.
- ఉద్యోగులు ఉన్నచోట మౌలిక సదుపాయాలు కల్పించాలి.
- ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి.
- ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
108 ఉద్యోగుల సమ్మె
Published Fri, May 15 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement
Advertisement