పట్నా: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను చెత్తతో కలిపి అమ్మేశారు కొందరు ఘనులు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ లోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పరిచిన సుమారు 40 వేల జవాబు పత్రాలు కనిపించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల నైట్‌వాచ్‌మన్ పూజన్ సింగ్, ప్యూన్ చిట్టు సింగ్‌లను అరెస్టు చేసి విచారించారు. విచారణలో అవి ఓ చెత్త కొనుగోలు డీలరు పప్పు కుమార్ గుప్తాకు రూ.8,500కు అమ్మేసినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment