Shruti Haasan Reacts To Rumours On Her Mental Health Issues, Deets Inside - Sakshi
Sakshi News home page

Shruti Haasan: శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published Fri, Jan 13 2023 12:36 PM | Last Updated on Fri, Jan 13 2023 1:10 PM

Shruti Haasan Respond on Her Mental Health Rumours - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ మెంటల్‌ హెల్త్‌ బాలేదని, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై శృతి స్పందించింది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ‘నా ఫ్లూ సమస్య ఇలా మారిందన్నమాట’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ‘నా వైరల్‌ ఫివర్‌ కాస్తా ఇలా మెంటల్‌ హెల్త్‌గా బయటకు వెళ్లింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇలాంటి వాటి వల్లే వారి మానసిక సమస్యలను బయటకు చెప్పుకునేందుకు భయపడేలా చేస్తున్నారు. నా ఆరోగ్యం, మెంటల్‌ హెల్త్‌ బాగానే ఉన్నాయి. ఓ సారి వైరల్‌ ఫివర్‌ వచ్చింది అంతే. దాన్ని ఇలా చిత్రీకరించారు. బాగా ట్రై చేశారు. మీకూ అలాంటి సమస్యలు ఉంటే గనుక తప్పుకుండ థెరపిస్ట్‌ను కలవండి’ అంటూ శృతి మండిపడింది. కాగా శృతి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తానే స్వయంగా చెప్పినట్లు పలు బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆమె తన మానసిక సమస్యలకు చికిత్స కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement