ఐసీసీలో మహిళా డైరెక్టర్ పదవి ఖాళీ..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్‌లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్‌లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.
ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment