vacant
-
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
కేకే రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్‌కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్ రోడ్‌లోని 3వ నంబరు ఇల్లును ఖాళీ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని ఇక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది.. రెండు మూడు రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్‌రావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచే హస్తినలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర సాధన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజా ప్రతినిధి అయినా.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఇంటిని రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే రెండు దశాబ్దాలుగా కేసీఆర్‌కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది. -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఖాళీ.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే?
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది. ఇక కీలకమైన ఆపరేషనల్ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: టీడీపీ నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది. మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
దేశంలో పోలీసు పోస్టులు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాలు కొన్నే ళ్లుగా గణనీయ అభివృద్ధి సాధించినా.. ఇప్పటికీ అనేక లోపాలు వెంటాడుతున్నాయని ‘ది ఇండియన్ జస్టిస్ నివేదిక (ఐజేఆర్)’ నివేదిక పేర్కొంది. ‘డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్–2021’ పేరుతో గురువారం దీనిని విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాల్లో సిబ్బంది సంఖ్య 2010–2020 మధ్య 32% పెరిగిందని.. అయితే మహిళా సిబ్బంది, అధికారుల సంఖ్య మాత్రం 10.5 శాతమే పెరి గిందని నివేదిక స్పష్టం చేసింది. పోలీసు ఉద్యో గాల్లో మహిళలకు 33% ఇవ్వాలన్న లక్ష్యానికి ఇది ఆమడ దూరంలో ఉన్నట్టేనని పేర్కొంది. గత ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 20.7 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉండగా.. అందులో 5.62 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. ఐజేఆర్ నివేదికలోని కీలక అంశాలివీ.. ►అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ప్రతి 300 మంది ప్రజలకు ఒక సివిల్ పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలో ప్రతి 841 మందికి ఒక సివిల్ పోలీసు మాత్రమే ఉన్నారు. ►ప్రభుత్వాలు పోలీసు విభాగాల కోసం చేసే ఖర్చులో కేవలం 1.2 శాతమే వారి శిక్షణకు కేటాయిస్తున్నాయి. ►బాధితులుగా మారి, సహాయార్థం పోలీస్స్టేషన్లకు వచ్చే మహిళలకు సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించిన విమెన్ హెల్ప్‌డెస్క్‌లు ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. దేశంలోని 59 శాతం పోలీసుస్టేషన్లలో మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. మిగతా ఠాణాల్లో ఇప్పటికీ బాధిత మహిళలకు పూర్తి భరోసా లభించని పరిస్థితి నెలకొంది. దేశంలో మొత్తంగా 17,233 పోలీస్స్టేషన్లు ఉండగా.. అందులో 10,165 ఠాణాల్లో మాత్రమే విమెన్ హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయి. ►మొత్తంగా పోలీసు ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలవారు 2010లో 12.6% ఉండగా.. 2020 నాటికి ఇది 15.2 శాతానికి చేరింది. అయితే షెడ్యూల్డ్ తెగలవారి శాతం మాత్రం 10.6 శాతం నుంచి 11.7 శాతానికి మాత్రమే చేరింది. ఓబీసీల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగి 20.8% నుంచి 28.8 శాతానికి పెరిగింది. ►2010–20 మధ్య మొత్తంగా పోలీసు బలగాల సంఖ్య 32 శాతం పెరిగి.. 15.6 లక్షల నుంచి 20.7 లక్షలకు చేరింది. కానీ మంజూరు చేసిన పోస్టుల్లో ఇప్పటికీ 5.62 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. బిహార్‌లో అత్యధికంగా 41.8 శాతం, ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా 6.8 శాతం ఖాళీలు ఉన్నాయి. ►కానిస్టేబుల్ స్థాయి పోస్టుల్లో ఖాళీలు 2019లో 18 శాతం ఉండగా.. తర్వాతి ఏడాదికి ఖాళీలు 20 శాతానికి పెరిగాయి. అధికారుల పోస్టులను చూస్తే.. ఖాళీలు 29 శాతం నుంచి 32 శాతానికి పెరిగాయి. కేవలం తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఇటీవల పోలీసు ఉద్యోగ ఖాళీల సంఖ్య తగ్గింది. ►ప్రతి పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాలు తప్పని సరిగా పెట్టాలని సుప్రీంకోర్టు 2020 డిసెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ మూడింట రెండొంతుల ఠాణాల్లోనే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 17,233 పోలీసుస్టేషన్లలో ఇప్పటివరకు 11,837 ఠాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఒడిశా, పుదుచ్చే రిలలో మాత్రం ప్రతి ఠాణాలో కనీసం ఒక సీసీ కెమెరా ఉన్నాయి. రాజస్తాన్‌లోని మొత్తం 894 పోలీసుస్టేషన్లలో కేవలం ఒక్కచోట మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా.. మణిపూర్, లడఖ్, లక్ష ద్వీప్ల్లో ఒక్క ఠాణాలోనూ సీసీ కెమెరాలు లేవు. ►పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి, బాధితులకు న్యాయం చేయడానికి ప్రతి జిల్లాకు ఓ సైబర్ సెల్ ఉండాలని నాలుగేళ్ల క్రితం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని 746 జిల్లాలకుగాను.. 466 జిల్లాల్లో మాత్రమే సైబర్ సెల్స్ ఉన్నాయి. 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఉండగా.. పంజాబ్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లలో ఒక్క జిల్లాలోనూ లేవు. ఏమిటీ ఐజేఆర్? న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలు ఉమ్మడిగా రూపొంది స్తున్న నివేదికే ‘ది ఇండియా జస్టిస్ రిపోర్టు’. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామ న్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, ద„Š , టిస్– ప్రయాస్, విధిసెంటర్ ఫర్ లీగల్ పాల సీ, హౌ ఇండియా లీవ్స్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎన్సీఆర్బీ, బీపీఆర్ అండ్ డీ కేంద్ర సంస్థల నివేదికలు, గణాంకాల ఆధారంగా 2019నుంచి ఐజేఆర్ను రూపొందిస్తున్నారు. తెలంగాణలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 8%కాగా.. సిబ్బంది, అధికా రుల హోదా రెండింటిలోనూ 8 శాతమే ఉన్నారు. ∙ఏపీలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 6.3%ఉన్నారు. అధికారి స్థాయిలోని పోస్టుల్లో 5.4% ఉన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు!
హోసూరు(బెంగళూరు): క్రిష్ణగిరి జిల్లాలో అడవుల విస్తీర్ణం అధికం. కొన్ని గ్రామాల్లో అడవుల్లో విసిరేసినట్లుగా ఉంటాయి. అక్కడికి రోడ్లు ఉండవు. కాలిబాటల్లోనే వెళ్లాలి. మధ్యలో అడవి ఏనుగులు, వన్యమృగాల దాడులు జరుగుతూ ఉండవచ్చు. వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఒక గ్రామాన్నే ఖాళీ చేశారు. డెంకణీకోట సమీపంలోని క్రిష్ణగిరి– ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో దట్టమైన అడవిలో ఉండే పుల్లహళ్లి గ్రామం కథ ఇది. ఈ ఊరు పాడుబడిన నివాసాలతో ఖాళీగా దర్శనమిస్తుంది. మొండిగోడలే మిగిలాయి ఒకప్పుడు కళకళ ఒకప్పుడు ఈ పల్లెలో వందకుపైగా కుటుంబాలు ఉండేవి. గ్రామస్థులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే ధర్మపురి జిల్లా పంజపల్లి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగులు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడేవారు. రోజూ బడికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి పోవాలన్నా అన్ని కిలోమీటర్లు నడవలేక అలసిపోయేవారు. దీంతో ఈ ఊరివారితో పెళ్లి సంబంధాలు కలుపుకోవాలన్నా వేరేఊరివారు భయపడేవారు. తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రజలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గత్యంతరం లేక గ్రామస్థులు సుమారు ఐదారేళ్ల కిందట ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడా గ్రామంలో ఒక్క మనిషి కూడా లేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇళ్లు శిథిలావస్థకు చేరుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి రోడ్లు, ఆస్పత్రి, బడి వంటి వసతులను కల్పించి నివాసయోగం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చదవండి: Job Opportunities: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్‌టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు! -
ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో ఇదీ పరిస్థితి: 155 పోస్టులు .. 102 ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, డాక్యుమెంట్ల ఫోర్జరీ.. ఇలా ఏవిధమై న నేరాల్లోనైనా నిందితుల గుర్తింపునకు తొలి ఆయుధంగా ఉపకరించేది వేలిముద్రలే. ఆయా కేసుల్లో దర్యాప్తు అధికారులు ముందుకు సాగేందుకు నేరం జరిగిన ప్రదేశం (సీన్ ఆఫ్ అఫెన్స్) లో, ఇతర చోట్ల వేలిముద్రల (ఫింగర్ ప్రింట్స్) సేకరణే కీలకం. ఇంత ప్రాధాన్యత ఉన్న ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఒక్క ఇన్స్పెక్టర్ కూడా లేరు రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో పనిచేసే స్టేట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (ఎస్‌ఎఫ్‌పీబీ)లో మొత్తం మంజూరు పోస్టులు 155 కాగా, ఇందులో 102 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (సీఎఫ్‌పీబీ) తాజాగా వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సంస్థ డైరెక్టర్ పోస్టుతో పాటు ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుల్లో మూడు, 39 ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను 39 ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా మంజూరైన 77 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 26 భర్తీ కాగా, 51 ఖాళీగా ఉండగా, 33 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 8 ఖాళీగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ పేర్కొంది. భర్తీ చేస్తే మరింత జోష్‌తో... తక్కువ సిబ్బందితో ఒత్తిడికి గురవుతూ ఎలాగో నెట్టుకొస్తున్న రాష్ట్ర సంస్థ.. 2020 ఏడాదికి పెం డింగ్ కేసులు లేకుండా చేయడంతో పాటు అనేక కేసుల్లో సేకరించిన వేలిముద్రలను భద్రపరిచే పని కూడా చేస్తోంది. కేంద్ర బ్యూరో కలిసి డేటా అప్డేట్ నిర్వహిస్తోంది. ఇంతటి కీలకమైన సంస్థ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే నిందితుల గుర్తింపు మరింత త్వరగా జరుగుతుందని, కేసులను మరింత త్వరగా పరిష్కరించవచ్చని సంస్థ ఉన్నతాధికారులు అంటున్నారు. వరుసగా జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. అద్భుత పనితీరుతో కేసుల పరిష్కారం సిబ్బంది తక్కువగా ఉన్నా వేలిముద్రల సేకరణ, వాటి విశ్లేషణలో మాత్రం తెలంగాణ ఎస్‌ఎఫ్‌పీబీ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ రిపోర్టు స్పష్టం చేస్తోంది. గత 2020 ఏడాదికి సంబంధించి అద్బుతమైన రీతిలో కేసులు పరిష్కరించేందుకు దోహదపడినట్లు పేర్కొంది. నల్లగొండ జిల్లా రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును నాలుగు రోజుల్లోనే ఎస్‌ఎఫ్‌పీబీ సహాయంతో పోలీసులు ఛేదించినట్లు తెలిపింది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచలో జరిగిన ఓ దొంగతనం కేసులో కూడా రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర బ్యూరో దోహదపడింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఇంటి దొంతనం కేసులోనూ ప్రతిభ చూపి వారంలోనే నిందితులను అరెస్ట్ చేసేలా తోడ్పాటు అందించింది. ఇలా ఎన్నో కేసులు ఛేదించడంలో ఎస్‌ఎఫ్‌పీబీ చురుకైన పాత్ర పోషించింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ కమిషన్ ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ఏడాదిన్నరకు పైగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్‌తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్‌ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్‌కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. – బీఎస్ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ విప్లవాత్మక మార్పులు తెచ్చాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం. – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ -
జిల్లా రిజిస్ట్రార్లు లేరు
సాక్షి, హైదరాబాద్: కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచాయి. తిరిగి ప్రారంభమైనా... హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల విధానం పలు మార్పులకు లోనవుతోంది. కొత్త, పాత పద్ధతుల కలబోతతో పలు సమస్యలు, సందేహాలు. కిందిస్థాయి సిబ్బందికి సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం అవసరం. ఇలాంటి కీలక తరుణంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణకు ఉన్నతాధికారుల కొరత కనిపిస్తోంది. శాఖాపరమైన కేటాయింపుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 మంది జిల్లా రిజిస్ట్రార్ల (పాత జిల్లాల వారీగా) పోస్టులు ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చదవండి: (తెలంగాణ: డ్రై రన్ సక్సెస్) వీరిలో ముగ్గురు సెలవుపై వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఐదుగురు జిల్లా రిజిస్ట్రార్లు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో ఒక్కో అధికారి మూడు, నాలుగు జిల్లాలకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణ, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, చిట్ ఆర్బిట్రేషన్, ఆడిట్ లాంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఆ శాఖ అధికారులే చెపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై జోరుగా సాగుతున్న సమయంలో కీలకమైన ఈ అధికారులు లేకపోవడం క్షేత్రస్థాయిలో సమస్యగా మారుతోందని, జిల్లా రిజిస్ట్రార్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే అభిప్రాయం ఈ శాఖలో వ్యక్తమవుతోంది. పదోన్నతి ఇచ్చారు... పోస్టింగులు మరిచారు మరో విచిత్రమేమిటంటే... ఏ శాఖలో అయినా ఉద్యోగులు లేక పోస్టులు ఖాళీగా ఉంటాయి. కానీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అర్హత కలిగిన ఉద్యోగులు ఉండి కూడా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. గ్రేడ్–1 సబ్రిజిస్ట్రార్లుగా ఉన్న ఆరుగురు అధికారులకు 2019 జనవరిలో జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చారు. కానీ, 24 నెలలుగా వారికి పోస్టింగులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్ హోదాలో తమ పాత స్థానాల్లోనే సబ్‌రిజిస్ట్రార్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు పొందిన వారిని పాత పోస్టుల్లోనే కొనసాగించడం రిజిస్ట్రేషన్ల శాఖలో విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత కీలక సమయంలోనైనా పదోన్నతులు, పోస్టింగుల విషయాన్ని నాన్చకుండా వెంటనే ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. -
అది అబద్ధం: ప్రియాంక గాంధీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని ప్రభుత్వ బంగళాను ఆగస్టు లోపు ఖాళీ చేయాలని జూలై1న పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం ప్రియాంక గాంధీ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసత్యపు వార్త. బంగళాలో ఉండేందుకు కాల పరిమితి పెంచాలని నేను ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన పెట్టుకోలేదు. నేను జూలై 1న పొందిన లేఖ ప్రకారం ఆగస్టు 1లోగా లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేస్తాను’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. (ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి కేటాయింపు) ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా స్పందిస్తూ.. ‘మాపై వస్తున్న వార్తలు నిజం కాదు. బంగళాలో ఉండేందుకు మేము ఎటువంటి పొడగింపు అడగలేదు. నెల రోజుల్లో బంగ్లాను ఖాళీ చేయాలని లేఖ వచ్చింది. ఆ మేరకు మేము ఇంటి సామాన్లను ప్యాక్ చేశాము. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే వారం రోజుల ముందుగానే ఖాళీ చేస్తాము’ అని ఆయన ట్విటర్లో తెలిపారు. (‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’) దీనిపై పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ‘నిజాలు ఎప్పుడూ వాటంతట అవే బయటకు వస్తాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత జూలై 4న నాకు ఫోన్‌చేసి 35, లోడీ ఎస్టేట్స్‌లోని బంగళాను మరో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించాలని కోరారు. దాంతో ప్రియాంక గాంధీ అక్కడే కొనసాగడానికి వీలుంటుందని తెలిపారు. ప్రతి విషయాన్ని సంచలనం చేయొద్దు’ అని ఆయన ట్విటర్లో అన్నారు. ప్రియాంక తనపై వస్తున్న వార్తలను అసత్యమని ఖండించిన తర్వాత మంత్రి స్పందించటం గమనార్హం. -
‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం ప్రియాంక గాంధీకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కాంగ్రెస్ విరుచుకుపడింది. మోదీ ద్వేష, ప్రతీకార రాజకీయాలకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ‘ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు. మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత ద్వేషం, పగ ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు. వారు ఇప్పుడు అని హద్దులు దాటారు. ప్రియాంక గాంధీని బంగళా ఖాళీ చేయమంటూ నోటీసులు పంపి ప్రధాని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ ఆందోళనను వెల్లడించారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు’ అంటూ ఆయన ఓ వీడియో మెసేజ్‌ను షేర్ చేశారు. (షాకింగ్ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..) ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. -
బెజవాడలో లాక్డౌన్ ప్రభావం..
అద్దెలకు దిగేవారు లేక బెజవాడలో ఇళ్లు, అపార్ట్మెంట్లు బోసిపోతున్నాయి. మూడు నెలల కిత్రం వరకు ఇక్కడ చిన్నపాటి ఇల్లు దొరకడం సైతం గగనమై పోయేది. రోజులు, వారాలకు తరబడి వెతికినా ఫలితం ఉండేది కాదు.. వేల రూపాయలు ఇస్తామన్నా అద్దె ఇల్లు దొరకడం అతికష్టంగా ఉండేది. కానీ నేడు పరిస్థితి తల్లకిందులయింది. రోజుల తరబడి ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి వచ్చేవారే కరువయ్యారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగులు, కారి్మకులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోవడం, మరలా వచ్చేవారు లేకపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో చూసినా టూలెట్ బోర్డులు కట్టిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అయితే మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నా.. అద్దె తగ్గించుకునేందుకు యజమానులు ముందుకురాకపోవడం ఇక్కడ కొసమెరుపు.. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి దిగే వారే కరువయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్చి మూడో వారం నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. పరిశ్రమలు, షాపులు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఉపాధినిచ్చే అనేక రంగాలు మూతపడ్డాయి. దీంతో వాటిలో ఉపాధి పొందుతున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన అనేకమంది తాము ఉంటున్న అద్దె ఇళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో బ్యాచిలర్లుగా ఉంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ల ఇళ్లు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దాదాపు మూడు నెలల నుంచి నగరంలోని అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం సడలింపులతో పరిశ్రమలు, షాపులు, హోటళ్లు వంటి వివిధ సంస్థలు తెరచుకోవడానికి అనుమతినిచ్చినా అవి పూర్వ స్థితికి చేరుకోలేదు. స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు అరకొరగా తప్ప పూర్తిస్థాయిలో వెనక్కి రాలేదు. అడిగేవారే కరువయ్యారు.. మరోవైపు విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. దాదాపు అన్ని డివిజన్లనూ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో బెజవాడలో ఎటు చూసినా టు–లెట్ బోర్డులు వేలాడదీసిన అద్దె ఇళ్లు అనేకం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అద్దె ఇళ్ల కోసం గాలించడం ప్రహసనంగా మారేది. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన కొంతమంది రెంటల్ ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలోని ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ టు–లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇల్లు కావాలని అడిగే వారే కరువయ్యారని ఇంటి యజమానులు ఆవేదన చెందుతున్నారు. ‘నేను టు–లెట్ బోర్డు పెట్టి రెండు నెలలయింది. ఇప్పటివరకు అద్దెకు దిగుతామని ఒక్కరూ వాకబు చేయలేదు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు’ అని సత్యనారాయణపురానికి చెందిన దుర్గా భవానీ అనే ఇంటి యజమానురాలు ‘సాక్షి’తో చెప్పారు. మొగల్రాజపురానికి చెందిన ప్రసాదరావు కూడా మూడు నెలల నుంచి ఖాళీగా ఉన్న తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి బోర్డు పెట్టారు. కానీ ఆయనదీ అదే పరిస్థితి. ఇలా నగరంలో అనేకమంది ఇంటి యజమానులు అద్దెలకు ఎవరొస్తారా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇంటి అద్దెల సొమ్ముతోనే జీవనం సాగించే వారూ ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందోనని వీరు ఆవేదన చెందుతున్నారు. అద్దెల తగ్గింపుపై ససేమిరా.. నగరంలో ఇంటి అద్దెలు కనీసం రూ.3 వేల నుంచి గరిష్టంగా 20 వేల వరకు ఉన్నాయి. ఇతర పట్టణాలు, నగరాలతో పోల్చుకుంటే విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగానే ఉంటున్నాయి. రేకుల షెడ్లకు కూడా రూ.3–4 వేలు వసూలు చేస్తున్నారు. సాదాసీదా డబుల్ బెడ్రూమ్కు కనీసం రూ.10 వేలు అద్దె తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్నా అద్దెలను తగ్గించడానికి మాత్రం చాలామంది యజమానులు ముందుకు రావడం లేదు. -
ప్రియాంక వాద్రాకు కేంద్రం షాక్
-
ప్రియాంక వాద్రాకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలని ఆమెను కోరింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : నేను ఇందిరా గాంధీ మనువరాలిని.. -
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట!
న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్ ఆఫీసర్ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. ఈ పోస్టులకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు-4 సార్లు ఒబిసి అభ్యర్థులు-7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో సమస్యలకు కారణాలివే
న్యూఢిల్లీ: నాణ్యమైన విద్య అందకపోవడం వల్లనే ఇంజనీరింగ్ కాలేజీల్లో అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏఐసీటీఈ దరఖాస్తు చేసుకున్న వారికల్లా అనుమతి ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. గత నాలుగేళ్లలో ఇలా అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోయిన 100కు పైగా కాలేజీలను మూసివేశామన్నారు. కాలేజీల్లో సీట్లు మిగిలిపోవడం వల్ల దేశానికి ఎలాంటి సమస్య లేదన్నారు. విద్యార్థులంతా కాలేజీల్లో నాణ్యమైన విద్య, వసతులను బట్టి కాలేజీలను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా రాష్ట్రాలతో సమన్వయమై సరైన ప్రణాళికలతోనే కొత్త కాలేజీలకు అనుమతిస్తున్నామని జవదేకర్ స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ లేకనే విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మొగ్గుచూపడం లేదన్న కాలేజీల వాదనను జవదేకర్ తప్పుబట్టారు. ఐఐటీల్లో చాలా ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయని, చాలా ఉద్యోగ అవకాశాలున్నాయి, కానీ నాణ్యమైన విద్యావంతులు అందుబాటులో ఉండటం లేదన్నారు. మార్కెట్ తగ్గట్టుగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోలేకపోతున్నారని చెప్పారు. దీనికి యూనివర్సిటీలు కూడా కారణమని, పాత సిలబస్‌తోనే కోర్సులను కొనసాగించడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం కోసమే ప్రభుత్వం మెక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇన్క్యూబేషన్ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిస్తున్నారని జవదేకర్ పేర్కొన్నారు. -
ఏఈలు కావలెను!
కార్పొరేషన్లో 16 మంది ఏఈలకు గాను ఉండేది ఆరుగురే ఇంజనీరింగ్ విభాగంలో నిలిచిపోయిన సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక నిధుల ప్రతిపాదనలు మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరేనా? నెల్లూరు, సిటీ : రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ సొంత జిల్లా అయిన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ) కొరత తీవ్రంగా ఉంది. 16 మంది ఏఈలకు గాను కేవలం 6 మంది మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. ఇటీవల ఆరుగురు తాత్కాలిక జూనియర్ ఏఈలు పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లారు. దీంతో నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14 ఆర్థిక సంఘం నిధులతో టెండర్లకు ప్రతిపాదనల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాక ఇప్పటికే టెండర్లు పిలిచి, జరుగుతున్న పనుల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఏఈల కొరత నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 54 డివిజన్లకు గాను కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ముజాహిద్దీన్, పద్మజ, నాగేంద్రకుమార్, మూర్తి, సుదేష్ణ, రాజు ఉన్నారు. గత నెల వరకు జూనియర్ తాత్కాలిక ఏఈలు ఆరుగురి సహకారం ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వారి సహకారం ఉండడంతో కొంతవరకు నిర్మాణం చేయగలిగారు. ఇటీవల పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లిన తాత్కాలిక ఏఈలు ఆరుగురు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఈలపైనే అధిక పని భారం పడుతోంది. ప్రస్తుతం ఉన్న ఏఈల్లో కూడా ఒకరు అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. కేవలం 5 మంది విధుల్లో ఉన్నారు. అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఇంజనీరింగ్ విభాగంలో ఏఈల కొరత కారణంగా అధికార పార్టీ నాయకులకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు ఆలస్యమవడంతో అధికారులపై మేయర్ వర్గం, అధికార పార్టీ నాయకులు తమ బిల్లులు మంజూరు చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇతర కాంట్రాక్ట్ర్ల పనులకు సంబంధించి ఫైళ్లను పక్కన పెట్టి కేవలం మేయర్ వర్గం చెప్పిన వారి పనులు చేయడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతోంది. చోద్యం చూస్తున్న మేయర్, కమిషనర్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈల కొరతతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంటే మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఈ నెల 15వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో టెండర్లు పిలవకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అన్ని ప్రతిపక్ష పార్టీలు మేయర్, కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అవసరమైన మేర ఏఈల నియామకం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. -
దేశంలో ఐపీఎస్‌ల కొరత
లక్నో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెలువడిన మూడురోజులకే దేశంలో ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 906 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. లక్నోకు చెందిన సమాజిక కర్యకర్త సంజయ్ శర్మ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు హోం శాఖ జవాబులు చెప్పింది. దేశవ్యాప్తంగా 4,754 ఐపీఎస్ పోస్టులు ఉండగా, కేవలం 3,848 మాత్రమే కొలువు చేస్తున్నారని నియామకాలు లేకపోవడంతో 906 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఐపీఎస్‌ల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉండగా, తెలంగాణ, ఏపీల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. రాష్ట్రం పేరు మెత్తం పోస్టులు ఖాళీగా ఉన్నవి తెలంగాణ 112 21 ఆంధ్రప్రదేశ్ 144 26 ఉత్తరప్రదేశ్ 517 129 పశ్చిమబెంగాల్ 347 98 ఇవికాకకుండా ఒడిశాలో 79, మహారాష్ట్రలో 62, కర్ణాటకలో 59 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి జేబీ యాదవ్ తెలిపారు. -
ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటుకు 21ఎన్నిక