దేశంలో ఐపీఎస్ల కొరత
లక్నో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెలువడిన మూడురోజులకే దేశంలో ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 906 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. లక్నోకు చెందిన సమాజిక కర్యకర్త సంజయ్ శర్మ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు హోం శాఖ జవాబులు చెప్పింది.
దేశవ్యాప్తంగా 4,754 ఐపీఎస్ పోస్టులు ఉండగా, కేవలం 3,848 మాత్రమే కొలువు చేస్తున్నారని నియామకాలు లేకపోవడంతో 906 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఐపీఎస్ల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉండగా, తెలంగాణ, ఏపీల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది.
రాష్ట్రం పేరు మెత్తం పోస్టులు ఖాళీగా ఉన్నవి
తెలంగాణ 112 21
ఆంధ్రప్రదేశ్ 144 26
ఉత్తరప్రదేశ్ 517 129
పశ్చిమబెంగాల్ 347 98
ఇవికాకకుండా ఒడిశాలో 79, మహారాష్ట్రలో 62, కర్ణాటకలో 59 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి జేబీ యాదవ్ తెలిపారు.