IPS posts
-
నాలుగో సింహం.. విమెన్ ఇన్ ఖాకీ
ఎన్ని ప్రయత్నాలు చేశామన్నది కాదు... లక్ష్యం చేరామా? లేదా? అన్నదే ముఖ్యం’ అన్నట్లుగా పట్టుదలతో ఐపీఎస్ సాధించారు ఈ ఆఫీసర్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం అయినా అందరి టార్గెట్ విమెన్ ఇన్ ఖాకీనే. హైదరాబాద్‌లో జరిగిన 76వ బ్యాచ్ రెగ్యులర్ రిక్రూట్స్ ΄ాసింగ్ ఔట్ పరేడ్‌లో ఈ ఐపీఎస్ ్ర΄÷బేషనరీ అధికారులు ‘సాక్షి ఫ్యామిలీ’తో మాట్లాడిన విశేషాలు...సైబర్ నేరాలునియంత్రిస్తానునేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. మా అమ్మ ప్రభుత్వ కళాశాలలో ్ర΄÷ఫెసర్‌గా పని చేస్తున్నారు. నాన్న ఢిల్లీలో జిల్లా విద్యాశాఖ అధికారి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. జేఎన్‌యూలో మాస్టర్స్ చేశాను. తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ కావాలని కలలు కన్నాను. సమాజ సేవలో విమెన్ ఇన్ ఖాకీగా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నా భర్త, మా అత్తమామలు, నా కుటుంబ సహకారంతోనే ఐదో ప్రయత్నంలో నా లక్ష్యాన్ని ఛేదించాను. ఐపీఎస్‌గా సెలెక్ట్ కాకముందు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో నాలుగేళ్లు ఢిల్లీలో పని చేశాను. 2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త ఐఆర్ఎస్ అధికారి. ఐపీఎస్ కావాలన్నది నా కల. నా భర్త సహకారంతో నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. ఐదో ప్రయత్నంలో సాధించాను. నాలుగు ప్రయత్నాల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను క్లియర్ చేసినా నేను అనుకున్న ఐపీఎస్ రాలేదు. అందుకే ప్రయత్నం కొనసాగించాను. ఐపీఎస్ శిక్షణ అనేది నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చింది. ఏపీ కేడర్‌కు వెళుతున్నాను. మహిళల భద్రతకు, సైబర్ నేరాల నియంత్రణకు ్ర΄ాధాన్యత ఇస్తాను. – దీక్ష, ఢిల్లీకిరణ్ బేడి స్ఫూర్తి.నేను పెద్ద ΄ోలీస్ ఆఫీసర్ కావాలన్నది మా అమ్మానాన్నల కల. అది నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నాన్న వ్యా΄ారం చేస్తుంటారు. మా కుటుంబం నుంచి మొదటి ΄ోలీస్ అధికారిని నేనే. మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్ సాధించాను. సివిల్స్ క్లియర్ చేయాలంటే ఒక మెంటార్ తప్పనిసరి అని నా అభి్ర΄ాయం. లేదంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుకుంటూ కూర్చుంటే మన శక్తి, సమయం సరి΄ోదు. అది వృథా ప్రయత్నమే అవుతుంది. ఇప్పటికే సివిల్స్ క్లియర్ చేసిన వారి సూచనలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ఐదుసార్లు విఫలం అయినా కూడా నా ప్రయత్నాన్ని వదలలేదు. కిరణ్‌బేడీ నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడు తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యాను. – వసుంధర యాదవ్, ఉత్తరప్రదేశ్నా శక్తిని తెలుసుకున్నానుచదువుకునే సమయంలో మా నాన్నే నీకో లక్ష్యం ఉండాలమ్మా అన్నారు. ΄ోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. మాది నంద్యాల. వ్యవసాయ కుటుంబం. అమ్మా నాన్నలు పెద్దగా చదవక΄ోయినా మా చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కెరీర్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సమాజ సేవలో ప్రజలకు దగ్గరగా ఉండాలని నా లక్ష్యం. 2020లో మొదటి అటెంప్ట్ చేశాను. 2022 రెండో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ మెరుగు పర్చుకోవాలన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. సీనియర్ల సూచనలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. మొదటిసారి నేషనల్ ΄ోలీస్ అకాడమీలో అడుగుపెట్టినప్పుడు ఇంత కఠినమైన శిక్షణ చేయగలనా అనుకున్నాను. కానీ అకాడెమీ ట్రైనింగ్ నాలో శక్తిని తెలుసుకునేలా చేసింది. క్రమంగా మనల్ని శిక్షణలో భాగం చేస్తారు. ఏపీ కేడర్‌కు అలాట్ కావడం సంతోషంగా ఉంది. మహిళా భద్రత అనేది నా ప్రధాన లక్ష్యం. – మనీశా రెడ్డి, నంద్యాలఆత్మవిశ్వాసం పెరిగిందినీపై నీకు విశ్వాసం ఉంటే ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే కాలం కూడా కలిసి వస్తుందని నమ్ముతాను. అపజయాలనేవి మనల్ని నిర్వచించలేవు. కొన్నిసార్లు మీ ప్రయత్నంలో లోపం లేకున్నా ఏదో ఒక చిన్న తప్పుతో విజయం రాక΄ోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదు. మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా. నా విజయంలో కుటుంబ సహకారం ఉంది. నేను రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో 2019లో సెలక్ట్ అయ్యాను. కానీ నా లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. ఐదోసారి ఐపీఎస్ సాధించాను. నా కుటుంబంలో నేనే మొదటి ఐపీఎస్ అధికారిని. ఔట్‌డోర్ శిక్షణలో 15 కిలోల బరువుతో 40 కిలోమీటర్లు నడవడం వంటి ఎన్నో కఠిన శిక్షణల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను యూపీ కేడర్‌కు అలాట్ అయ్యాను. – సోనాలి మిశ్రాఉత్తరప్రదేశ్ం -
ఐపీఎస్ కేడర్ పోస్టులు పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జిల్లాలకు తగ్గట్టుగా ఐపీఎస్ కేడర్ పోస్టులు పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రాష్ట్ర విభజనలో భాగంగా ఐపీఎస్ పోస్టుల పంపకాల్లో తెలంగాణకు 112 పోస్టులు కేటాయించారు. అయితే ఈ పోస్టులు సరిపోవని, అధికారులు ఎక్కువగా ఉండటం వల్ల తమకు మరిన్ని పోస్టులు అవసరం ఉందని 2015లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరో 27 కేడర్ పోస్టులు పెంచింది. మొత్తంగా 139 కేడర్ పోస్టులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. అయితే కొత్త జిల్లాలతోపాటు కొత్త జోనల్ వ్యవస్థ రావడంతో మరో 26 పోస్టులు మంజూరు చేయాలని కోరింది. కేడర్ మార్పుతో... ప్రస్తుతం ఏపీలో ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులు తమను తెలంగాణ కేడర్‌కు పంపాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ముగ్గురు ఐపీఎస్‌లకు కేడర్ మార్పు జరిగినట్టు తెలిసింది. అందులోభాగంగానే ఎస్పీ హోదాలో ఉన్న అభిషేక్ మహంతి తెలంగాణ పోలీస్ శాఖకు వచ్చి రిపోర్ట్ చేశారు. అలాగే, మరో ఇద్దరు సీని యర్ ఐపీఎస్‌లకు సైతం కేడర్ మార్పుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ పోలీస్‌శాఖ ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. వీరేకాకుండా మరో ముగ్గురు అధికారులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. కేడర్ పోస్టులు తక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అధికారులకు ఎలా వెసులుబాటు చేయాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారని తెలిసింది. పదోన్నతితో అవి కూడా ఖాళీ... రాష్ట్ర ఐపీఎస్ కేడర్ పోస్టులు మొత్తం 139 కాగా, ప్రస్తుతం 106 మంది పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న 33లో 26 పోస్టులు రాష్ట్ర కేడర్ అధికారులకు ఐపీఎస్‌గా పదోన్నతి కల్పించి భర్తీ చేయనున్నారు. ఇక మిగిలింది 7 పోస్టులు మాత్రమే కాగా కేడర్ మార్పుతో వస్తున్న అధికారులను ఈ పోస్టుల్లో నియమిస్తే కొత్తగా ఏర్పాటు కానున్న ఏడు రేంజుల్లో ఎలా నియమించాలన్న దానిపై సంశయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రమోటీ అధికారులు పదవీ విరమణ పొందితేనే వారి స్థానంలో స్టేట్ కేడర్ అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అయితే మరిన్ని కేడర్ పోస్టుల మంజూరు జరిగితేనే ప్రమోటీ అధికారులకు ఐపీఎస్ పదోన్నతులు కల్పించే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ కేడర్ మార్చుకుంటున్న అధికారులతోపాటు రాష్ట్ర సర్వీస్ అధికారులకు న్యాయం చేయాలంటే కేడర్ పోస్టుల పెంపు ఒక్కటే మార్గమని సీనియర్ ఐపీఎస్‌లు అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని చెప్పారు. -
ఐపీఎస్ కేడర్ సమీక్షించండి: అమిత్‌షాతో సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందున ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారుల కొరతను అధిగమించేందుకు వీలుగా ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించి పోస్టుల సం ఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఐపీఎస్ కేడర్ సమీక్షతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను నివేదిం చారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్ ఉన్నారు. కొత్త పోస్టులు అవసరం.. ‘ఆర్టికల్ 371–డీ లక్ష్యానికి అనుగుణంగా ఉద్యో గులు, ఉద్యోగార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరించాల్సి వచ్చింది. పునర్వ్యవస్థీకరించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లో పోలీసు పరిపాలనకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉంది. అప్పటి వరకు ఉనికిలో ఉన్న 9 పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లతో ఈ నోటిఫికేషన్ ఉంది. పోలీసు పాలనకు సంబంధించి కొత్త వ్యవస్థలో భాగంగా పోలీసు యూనిట్లు ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను అనుసరించి కొత్తగా పలు ప్రాదేశిక పోస్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది’ అని కేసీఆర్ తన వినతిపత్రంలో నివేదించారు. 40% అదనపు కేడర్ కేటాయించాలి.. ‘రాష్ట్రానికి సంబంధించి కేంద్ర హోంశాఖ 2016లో ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించింది. తెలంగాణకు మొత్తంగా 139 అధీకృత పోస్టులను ఆమోదించింది. ప్రస్తుతం పునర్ వ్యవస్థీకరణ అనంతరం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లకు పోలీసు ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల కనీసం 29 సీనియర్ డ్యూటీ పోస్టులిస్తూ ప్రస్తుతమున్న 76 సీనియర్ డ్యూటీ పోస్టులను 105కు పెంచాలి. మొత్తంగా 139 మంది ఉన్న ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్యను 195కి పెంచాలి. ఈ కేటాయింపుల వల్ల ఐపీఎస్‌లను విభిన్న ప్రాదేశిక యూనిట్లలో కమిషనర్లుగా, ఎస్పీలుగా, జోనల్ డీఐజీలుగా, మల్టీజోనల్ ఐజీలుగా నియమించే వీలుంటుంది. అందువల్ల ప్రస్తుత ఐపీఎస్ కేడర్ సమీక్షను అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి’ అని సీఎం కేసీఆర్ వినతిపత్రంలో కోరారు. సాధారణంగా 5% అదనపు కేడర్ కేటాయింపునకు అనుమతి ఉంటుందని, ప్రస్తుత ప్రతిపాదన 40% అదనపు కేడర్ కేటాయింపులను అభ్యర్థిస్తోందని నివేదించారు. తెలంగాణతో పోల్చితే అదే స్థాయిలో జనాభా ఉన్న కేరళలో అధీకృత పోస్టుల సంఖ్య 172గా ఉందని, ఒడిశాలో 188గా ఉందని, కానీ తెలంగాణలో ప్రస్తుతం 139 పోస్టులు మాత్రమే ఉన్నాయని నివేదించారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట!
న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్ ఆఫీసర్ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. ఈ పోస్టులకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు-4 సార్లు ఒబిసి అభ్యర్థులు-7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
దేశంలో ఐపీఎస్‌ల కొరత
లక్నో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెలువడిన మూడురోజులకే దేశంలో ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 906 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. లక్నోకు చెందిన సమాజిక కర్యకర్త సంజయ్ శర్మ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు హోం శాఖ జవాబులు చెప్పింది. దేశవ్యాప్తంగా 4,754 ఐపీఎస్ పోస్టులు ఉండగా, కేవలం 3,848 మాత్రమే కొలువు చేస్తున్నారని నియామకాలు లేకపోవడంతో 906 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఐపీఎస్‌ల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉండగా, తెలంగాణ, ఏపీల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. రాష్ట్రం పేరు మెత్తం పోస్టులు ఖాళీగా ఉన్నవి తెలంగాణ 112 21 ఆంధ్రప్రదేశ్ 144 26 ఉత్తరప్రదేశ్ 517 129 పశ్చిమబెంగాల్ 347 98 ఇవికాకకుండా ఒడిశాలో 79, మహారాష్ట్రలో 62, కర్ణాటకలో 59 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి జేబీ యాదవ్ తెలిపారు. -
ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ విభాగంలో 1,457 పోస్టులు, 1,042 ఐపీఎస్ పోస్టులు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.