తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ | Telangana: Filling more than 16 thousand vacant posts | Sakshi
Sakshi News home page

తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ

Published Tue, Nov 29 2022 9:28 PM | Last Updated on Tue, Nov 29 2022 9:29 PM

Telangana: Filling more than 16 thousand vacant posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. మరో గుడ్‌న్యూస్‌ ప్రకటించింది.

మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే..

ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement