women director
-
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
Neena Singh: చారిత్రక అడుగు అంకితభావమే ఆభరణమై...
అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ ఇల్లు నీనా రాకతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయేది. ఆ ఇంట్లోని పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుని పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించేవారు. పెద్ద అక్క అంటే మాటలా మరి! అక్కయ్య అంటే ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణే ఆమెను పోలీస్‌శాఖలోకి అడుగు పెట్టేలా చేసింది. వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకునేలా చేసింది. తాజాగా... సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా చరిత్ర సృష్టించింది నీనా సింగ్... నీనా సింగ్‌ది బిహార్ రాష్ట్రం. కుటుంబ సభ్యుల్లో తనే పెద్ద. తమ్ముళ్లు, చెల్లెళ్లకు అమ్మ తరువాత అమ్మ. నీనా తండ్రి బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉండేవారు. తల్లి గృహిణి. పట్నా ఉమెన్స్ కాలేజీ, దిల్లీలోని జేఎన్‌యూలో చదివిన నీనా సింగ్ ‘దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. కోసం చేరింది. హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. రాజస్థాన్ క్యాడర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నీనా సింగ్ పోలీస్‌శాఖలో అడుగు పెట్టిన తొలిరోజు నుంచి పాదరసంలా చురుగ్గా ఉండేది. సివిల్ రైట్స్ అండ్ యాంటి–హ్యూమన్ ట్రాఫికింగ్ ఏడీజీ(ట్రైనింగ్), డీజీగా పని చేసింది. రాజస్థాన్‌లోని డీజీ ర్యాంక్ పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్‌లో పనిచేసింది. కమీషన్ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించింది. పాండమిక్ కాలంలో రాజస్థాన్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ(హెల్త్)గా బాధ్యతలు నిర్వహించింది. జాయింట్–డైరెక్టర్ ఆఫ్ సీబీఐగా పీఎన్బీ స్కామ్, నీరవ్ మోదీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లలో కీలకపాత్ర పోషించింది. ‘సివిల్ సర్వీస్‌లో ఉన్న మా నాన్నను చూస్తూ పెరిగాను. నేను ఐపీఎస్ చేయాలనుకోవడానికి నాన్న స్ఫూర్తిగా నిలిచారు. చదువుకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు. మమ్మల్ని దగ్గర ఉండి చదివించేవారు. ఇంట్లో ఇతరత్రా విషయాల కంటే చదువుకు సంబంధించిన విషయాలే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అంటుంది నీనా సింగ్. తన ఉద్యోగప్రస్థానంలో మహిళా సాధికారత భావన కలిగించే ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదులుకోలేదు నీనా సింగ్. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నీనా సింగ్‌ను భారతప్రభుత్వం 2015లో ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్’ 2020లో ‘విశిష్ఠసేవా పురస్కారం’తో సత్కరిం చింది. నాన్న స్ఫూర్తితో... ఇంటి వాతావరణం మన కలలకు ఊపిరిపోస్తుంది. నాన్న సివిల్ సర్వీస్‌లో ఉండడం వలన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన ద్వారా ఎంతోమంది ఐకానిక్ ఆఫీసర్ల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్‌లో చేరాలనే లక్ష్యం ఏర్పడింది. కెరీర్‌కు సంబంధించి వేరే ఆలోచనలు ఏవీ ఉండేవి కాదు. నా ఏకైక లక్ష్యం సివిల్ సర్వీస్ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీస్‌లో విస్తృతంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఖాకీ యూనిఫాం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఖాకీ యూనిఫాంలోఉన్న వారిని చూస్తే అపురూపంగా అనిపించేది. యూనిఫాం ఎప్పుడూ ఇతరులను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ...నేను సిరోహి ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు మీలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పోలీస్ ఉద్యోగం అంటే శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే కాదు రకరకాల సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ధైర్యాన్నీ, భరోసానూ ఇవ్వడం కూడా. – నీనా సింగ్ నోబెల్ విజేతలతో కలిసి పరిశోధన పోలీసుల పనితీరులో రావాల్సిన మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాల గురించి ‘మసాచుసెట్సు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో నీనా సింగ్ భాగం అయింది. తన పరిశోధన తాలూకు అంశాల ఆధారంగా ఎన్నో పోలీస్స్టేషన్లలో మార్పు తీసుకువచ్చింది. నోటెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డప్లోతో కలిసి ‘ది ఎఫీసియెంట్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పోలీస్ రిసోర్సెస్’ అంశంపై పరిశోధన పత్రాలు రాసింది. హార్వర్డ్‌లో చదివే రోజుల నుంచి వారితో నీనా సింగ్‌కు పరిచయం ఉంది. -
Indhu Rubasingham: రంగస్థల సింగం
‘అమ్మాయిలు నటించడం ఏమిటి?’ అనే ఆశ్చర్యం నుంచి రంగస్థలానికి వెలుగులు అద్దిన ప్రసిద్ధ నటీమణుల వరకు ఎంతో చరిత్ర ఉంది. రంగస్థలానికి సంబంధించిన చరిత్రలో మరో విశిష్టమైన పేరు ఇందు. లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ నేషనల్ థియేటర్‌కు ఇందు రుబసింగంను ఆర్టిస్టిక్ డైరెక్టర్, జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. 60 సంవత్సరాల చరిత్ర ఉన్న నేషనల్ థియేటర్‌కు మహిళా దర్శకురాలిని ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియమించడం ఇదే తొలిసారి.... ఇందు తల్లిదండ్రులు ఇంగ్లాండ్‌లో సిర్థపడిన శ్రీలంక తమిళులు. నాటింగ్హమ్ సిటీలోని నాటింగ్హమ్ గర్ల్స్ హైస్కూల్ లో విద్యాభ్యాసం చేసింది ఇందు. హల్ యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో డాక్టరేట్ చేసింది. థియేటర్ రాయల్, స్ట్రాట్ఫర్డ్ ఈస్ట్‌లో ట్రైనీ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఫ్రీలాన్స్ థియేటర్ డైరెక్టర్ గా పది సంవత్సరాలకు పైగా పనిచేసింది. ఫ్రీలాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలోనే లండన్‌లోని ‘గేట్ థియేటర్’లో అసోసియేట్ డైరెక్టర్‌గా నియామకం అయింది. లండన్‌లోని కిల్న్ థియేటర్‌కు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఇందు. గతంలో ఈ థియేటర్ శ్వేతజాతీయుల ఆధ్వర్యంలోనే నడిచేది. శ్వేతజాతేతర మహిళా దర్శకురాలు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ఇదే తొలిసారి. కిల్న్ థియేటర్ నిర్వహణలో ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’ గా తనదైన ముద్ర వేసింది ఇందు. ఆడిటోరియంను ఆధునీకరించి సీట్ల సంఖ్యను పెంచింది. కొత్త సౌకర్యాలు మాత్రమే కాదు కొత్త నాటకాన్ని థియేటర్‌కు పరిచయం చేసింది. ‘రెడ్ వెల్వెట్’‘హ్యాండ్ బ్యాగ్డ్’ ‘వెన్ ది క్రౌస్ విజిట్’ ‘ఏ వోల్ఫ్ ఇన్ స్నేక్స్కిన్ షూస్’...మొదలైన నాటకాలు డైరెక్టర్‌గా ఇందుకు మంచి పేరు తెచ్చాయి. ది ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్, ఏషియన్ ఉమెన్ ఆఫ్ ఎచీవ్మెంట్ అవార్డ్, లిబర్టీ హ్యుమన్ రైట్స్ అవార్డ్... మొదలైన ఎన్నో అవార్డ్లు అందుకుంది. ‘నాటకరంగాన్ని వినోద మాధ్యమానికి పరిమితం చేయకూడదు. మార్పు తెచ్చే శక్తి నాటకానికి ఉంది. ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చి అభిప్రాయాలు పంచుకునేలా, ఆలోచించేలా చేస్తుంది’ అంటుంది ఇందు. కొత్తదనం నిండిన నాటకాలకు ఇందు ప్రాధాన్యత ఇస్తుంది. మానవ సంబంధాలను విభిన్న కోణాల నుంచి విశ్లేషించే నాటకాలను ఎంపిక చేసుకుంటుంది. బీబీసీ రేడియో 4, బీబీసీ రేడియో 3, బీబీసి వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి రేడియో నాటికలకు కూడా దర్శకత్వం వహించింది. నేషనల్ థియేటర్ లో ‘ది వెయిటింగ్ రూమ్’ ‘ది రామాయణ’ అనుపమ చంద్రశేఖర్ ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’ నాటకాలకు దర్శకత్వం వహించింది. ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకుంది. కొత్త రచయితలను, నటులను ప్రోత్సహించడంలో ప్రపంచ రంగస్థలానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది ఇందు. ‘ఇందు నేషనల్ డైరెక్టర్‌గా నియామకం కావడం సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌గా, లీడర్‌గా ఆమె అంటే అపారమైన అభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే నాటకాలు రావడానికి, నాటకరంగాన్ని స్ఫూర్తిదాయక శక్తిగా మలిచే విషయంలో ఆమె కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారని ఆశిస్తున్నాను’ అంటుంది నేషనల్ థియేటర్ డైరెక్టర్ కేట్ వరహ్. ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా తన నియామకంపై స్పందిస్తూ... ‘నేషనల్ థియేటర్ నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇదొక అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను. నాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యున్నత బాధ్యత’ అంటుంది ఇందూ రుబసింగం. కొత్త రెక్కలతో... రంగస్థలం అనేది ఒకచోట, ఒకేకాలంలో ఉండిపోదు. కాలంతో పాటు కదులుతుంది. కాలాన్ని ప్రతిబింబిస్తుంది. రంగస్థలానికి ఆలోచనాపరులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చే శక్తి ఉంది. మానవసంబంధాల నుంచి అస్తిత్వ పోరాటాల వరకు ఎన్నో అంశాలకు నాటకం అద్దం పడుతుంది. సాంకేతిక పరంగానే కాదు ఇతివృత్త పరంగా కూడా నాటక రంగం కొత్త దారిలో వెళుతుంది. రంగçస్థల ప్రపంచంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆలోచలకు రెక్కలు వస్తున్నాయి. – ఇందు రుబసింగం, రంగస్థల దర్శకురాలు -
అశ్లీల చిత్రంలో నటించాలంటూ బలవంతం, దర్శకురాలిపై కేసు
కేరళకు చెందిన దర్శకురాలిపై చీటింగ్ కేసు నమోదైంది. డర్టీ పిక్చర్లో నటించమని తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. లేదంటే తనకు మరణమే శరణ్యమని వాపోయాడు. 'అది నా తొలి షూట్. నేను అగ్రిమెంట్ సరిగా చదవకుండానే సంతకం పెట్టాను. వారితో కలిసి షూటింగ్‌కు వెళ్లాను. చివరకు వాళ్లు నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి.. ఇది అడల్ట్ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్పగా అగ్రిమెంట్ మీద సంతకం చేశావు కాబట్టి చేసి తీరాల్సిందే అన్నారు. అగ్రిమెంట్ బ్రేక్ చేయాలనుకుంటే రూ.5 లక్షలు కట్టమని బెదిరించారు. మేము వెళ్లింది ఒక మారుమూల ప్రాంతానికి, కాబట్టి అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయాను' అని బాధిత నటుడు చెప్పుకొచ్చాడు. ఆ సినిమా రిలీజైతే తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ముఖం చూపించుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: తాగి బూతులు మాట్లాడాడు, చెంప చెళ్లుమనిపించా: డైరెక్టర్ జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్ -
ఉండనివ్వరేల ఘనాఘనులు
అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్ ఆమె. అంజూ సేథ్ వెళ్లిపోతుంటే చైర్మన్ ముఖం చాటేశారు. బోర్డ్ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్మెంట్ రంగంలో అంజూ సేథ్ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్ రెస్పెక్ట్ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్ సీలింగ్ ని బ్రేక్ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?! అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్’లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి. అంజు సేథ్ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. 2008లో వర్జీనియా టెక్ (పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు. -
మహిళా దర్శకురాలిపై కేసు..
చెన్నై, పెరంబూరు: మహిళాదర్శకురాలు విజయపద్మపై రూ.30 లక్షల మోసం కేసు నమోదైంది. వివరాలు.. నర్తకి అనే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు విజయపద్మ. ఈమెపై స్థానికి తిరువాన్మయూర్‌కు చెందిన సుమతి తిరువాన్మయూర్ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో తాను రాయల్ కేన్ పేరుతో గృహ సంబంధిత పర్నీచర్ దుకాణాన్ని నడుపుతున్నానని పేర్కొంది. కాగా తాను లీజ్ కోసం ఒక ఇల్లు కోసం వెతుకుతున్నానని చెప్పింది. కాగా దర్శకురాలు విజయపద్మ, భర్త ముత్తు కృష్ణన్లు తన షాపుకు వచ్చే వాళ్లని తెలిపింది. అలా పరిచయం అయిన వాళ్లు తాము చాలా ధనవంతులు అనే విధంగా ప్రవర్తించారని తెలిపింది. తాను లీజ్‌కు ఇల్లు వెతుకుతున్న విషయాన్ని తెలుసుకుని తమ ప్లాట్‌ను లీజుకు ఇస్తామని చెప్పారన్నారు. అలా కొట్టివాక్కం వేంకటేశ్వరనగర్ 39వ వీధిలోని ఒక అపార్ట్‌మెంట్‌ను చూపించి అందులోని ఫస్ట్‌ప్లోర్‌లో ఉన్న ఫ్లాట్ తమదేనని నకిలీ డాక్కుమెంట్స్ చూపి నమ్మబలికారంది. రూ.30 లక్షలు ఇస్తే ఆ ఫ్లాట్‌ను లీజ్‌కు ఇస్తామని చెప్పారంది. దీంతో తాను తన వద్ద ఉన్న బంగారు నగలను కుదవపెట్టి రూ.30 లక్షలు దర్శకురాలు విజయపద్మకు చెల్లించానని చెప్పింది. అందుకు అగ్నిమెంట్ రాసిచ్చారని తెలిపింది. దీంతో తాను ఆ ఫ్లాట్‌లో నివాసం ఉండడానికి ప్రయత్నించగా అది దర్శకురాలు విజయపద్మకు చెందినది కాదని తెలిసిందని చెప్పింది.దీంతో తాను ఆమెను నిలదీసినట్లు, అందుకామె తాను ఇచ్చిన డబ్బుకు రెండు చెక్కులను ఇచ్చిందని చెప్పింది. అయితే ఈ చెక్కులు బ్యాంకులో డబ్బు లేనందున భౌన్స్ అయ్యాయని పేర్కొంది. తనను మోసం చేసిన దర్శకురాలు విజయపద్మ,ఆమె భర్త ముత్తు కృష్ణన్, ఆమె తల్లిలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సుమతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
గిన్నిస్ రికార్డ్‌కు తొలి అడుగు ‘నంద్యాల’ నుంచే
సాక్షి, నంద్యాల : ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మలకు తొలిసారిగా తెలుగులో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఘనత నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి దివంగత గాజుల పెద్ద మల్లయ్య. వెంకటకృష్ణ పతాకంపై హీరో కృష్ణ, హీరోయిన్ విజయనిర్మలను ఆయన మీన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమె.. ఆ తర్వాత తన ప్రతిభతో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్‌గా స్థానం సంపాదించారు. గాజుల మల్లయ్య వ్యాపారం రీత్యా 1965లో మద్రాస్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతో ఆయన 1970లో ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనరాణి రాసిన మీనా నవల ఆధారంగా అదే పేరుతో మిత్రుడు టీవీ రమణ సహకారంతో వెంకటకృష్ణ బ్యానర్‌పై చిత్రనిర్మాణం చేపట్టారు. కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్గా పెద్ద మల్లయ్య దర్శకత్వం బాధ్యతలను విజయనిర్మలకు అప్పగించారు. అలా ఆమె తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహించారు. సినిమా హిట్ కావడంతో విజయ నిర్మలకు మంచిపేరుతో పాటు అవకాశాలు కూడా దక్కాయి. తర్వాత 1974లో పెద్దమల్లయ్య ఇదే పతాకంపై దేవదాసు చిత్రాన్ని కృష్ణ, విజయనిర్మలతో ఆమె దర్శకత్వంలో నిర్మించారు. కాని ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోక పోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో పెద్ద మల్లయ్య చిత్రపరిశ్రమను వదిలేసి నంద్యాలకు వచ్చి వ్యాపారాన్ని కొనసాగించారు. పదేళ్ల క్రితం పెద్ద మల్లయ్య ఎస్బీఐ కాలనీలోని తన కుమారుడి ఇంట్లో ఉంటూ మృతి చెందారు. దర్శకురాలిగా విజయనిర్మల సాధించిన ఘనత వెనుక పెద్దమల్లయ్య ఇచ్చిన అవకాశం, ప్రోత్సాహం మరువలేనిది అని నంద్యాల సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒందిపోటు భీమన్న చిత్రం షూటింగ్ నంద్యాలలో.. మల్లికార్జున రావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, ఎస్వీ రంగారావు నటించిన చిత్రం బందిపోటు భీమన్న షూటింగ్ 1968లో నంద్యాల, ఆళ్లగడ్డ, అహోబిలంలో దాదాపు పది రోజుల పాటు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల నంద్యాలలో బస చేశారు. 1969 డిసెంబర్13న ఈ సినిమా విడుదలయ్యింది. -
మహిళా డైరెక్టర్‌కు బెయిల్..హైకోర్టు నో
సాక్షి,న్యూఢిల్లీః అగస్టా కేసులో అరెస్ట్ అయిన దుబాయికి చెందిన వ్యాపారవేత్త శివానీ సక్సేనా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శివానీ సక్సేనా బెయిల్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన జస్టిస్ ఏకే పాథక్ ఆమె బెయిల్ వినతిని తోసిపుచ్చినట్టు వెల్లడించారు. దుబాయ్‌కు చెందిన యూహెచ్వై సక్సేనా, మ్యాట్రిక్స్ హోల్డింగ్స్ కంపెనీలకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం( పీఎంఎల్ఏ) కింద శివానీ సక్సేనాను జులై 17న చెన్నైలో ఈడీ అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ కింద ఆమెపై, దుబాయ్ కంపెనీలపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది.