
కేరళకు చెందిన దర్శకురాలిపై చీటింగ్ కేసు నమోదైంది. డర్టీ పిక్చర్‌లో నటించమని తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. లేదంటే తనకు మరణమే శరణ్యమని వాపోయాడు.
'అది నా తొలి షూట్. నేను అగ్రిమెంట్ సరిగా చదవకుండానే సంతకం పెట్టాను. వారితో కలిసి షూటింగ్‌కు వెళ్లాను. చివరకు వాళ్లు నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి.. ఇది అడల్ట్ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్పగా అగ్రిమెంట్ మీద సంతకం చేశావు కాబట్టి చేసి తీరాల్సిందే అన్నారు. అగ్రిమెంట్ బ్రేక్ చేయాలనుకుంటే రూ.5 లక్షలు కట్టమని బెదిరించారు. మేము వెళ్లింది ఒక మారుమూల ప్రాంతానికి, కాబట్టి అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయాను' అని బాధిత నటుడు చెప్పుకొచ్చాడు. ఆ సినిమా రిలీజైతే తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ముఖం చూపించుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి: తాగి బూతులు మాట్లాడాడు, చెంప చెళ్లుమనిపించా: డైరెక్టర్
జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్
Comments
Please login to add a commentAdd a comment