దర్శకురాలు విజయపద్మ
చెన్నై, పెరంబూరు: మహిళాదర్శకురాలు విజయపద్మపై రూ.30 లక్షల మోసం కేసు నమోదైంది. వివరాలు.. నర్తకి అనే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు విజయపద్మ. ఈమెపై స్థానికి తిరువాన్మయూర్‌కు చెందిన సుమతి తిరువాన్మయూర్ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో తాను రాయల్ కేన్ పేరుతో గృహ సంబంధిత పర్నీచర్ దుకాణాన్ని నడుపుతున్నానని పేర్కొంది. కాగా తాను లీజ్ కోసం ఒక ఇల్లు కోసం వెతుకుతున్నానని చెప్పింది. కాగా దర్శకురాలు విజయపద్మ, భర్త ముత్తు కృష్ణన్‌లు తన షాపుకు వచ్చే వాళ్లని తెలిపింది. అలా పరిచయం అయిన వాళ్లు తాము చాలా ధనవంతులు అనే విధంగా ప్రవర్తించారని తెలిపింది. తాను లీజ్‌కు ఇల్లు వెతుకుతున్న విషయాన్ని తెలుసుకుని తమ ప్లాట్‌ను లీజుకు ఇస్తామని చెప్పారన్నారు. అలా కొట్టివాక్కం వేంకటేశ్వరనగర్ 39వ వీధిలోని ఒక అపార్ట్‌మెంట్‌ను చూపించి అందులోని ఫస్ట్‌ప్లోర్‌లో ఉన్న ఫ్లాట్ తమదేనని నకిలీ డాక్కుమెంట్స్ చూపి నమ్మబలికారంది.
రూ.30 లక్షలు ఇస్తే ఆ ఫ్లాట్‌ను లీజ్‌కు ఇస్తామని చెప్పారంది. దీంతో తాను తన వద్ద ఉన్న బంగారు నగలను కుదవపెట్టి రూ.30 లక్షలు దర్శకురాలు విజయపద్మకు చెల్లించానని చెప్పింది. అందుకు అగ్నిమెంట్ రాసిచ్చారని తెలిపింది. దీంతో తాను ఆ ఫ్లాట్‌లో నివాసం ఉండడానికి ప్రయత్నించగా అది దర్శకురాలు విజయపద్మకు చెందినది కాదని తెలిసిందని చెప్పింది.దీంతో తాను ఆమెను నిలదీసినట్లు, అందుకామె తాను ఇచ్చిన డబ్బుకు రెండు చెక్కులను ఇచ్చిందని చెప్పింది. అయితే ఈ చెక్కులు బ్యాంకులో డబ్బు లేనందున భౌన్స్ అయ్యాయని పేర్కొంది. తనను మోసం చేసిన దర్శకురాలు విజయపద్మ,ఆమె భర్త ముత్తు కృష్ణన్, ఆమె తల్లిలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సుమతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment