వేలూరు: పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానని.. పోలీసు వేషంలో పలువురి వద్ద రూ. లక్షలు మోసం చేసిన మహిళను వేలూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వేలూరు సేన్‌బాక్కంకు చెందిన రోగిని(32) ప్రస్తుతం కాంచీపురం జిల్లా సుంగాచత్రంలో భర్తతో కలసి ఉంటోంది.
రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన దినేష్‌కుమార్‌కు ఓ స్నేహితుని ద్వారా రోగిని పరిచయం అయ్యింది. ఈక్రమంలో పోలీస్ దుస్తుల్లో ఉన్న ఫొటో, నకిలీ పోలీస్ గుర్తింపు కార్డును దినేష్‌కుమార్‌కు చూపించి తాను ఎస్‌ఐనంటూ నమ్మించింది. పోలీసు కేసుల్లో చిక్కుకున్న వాహనాలు, కార్లును తక్కువ ధరకు ఇప్పిస్తాంటూ అతడి వద్ద నుంచి రూ.14 లక్షలు తీసుకుంది.
అలాగే చెన్నైకి చెందిన సెంథిల్, వేలూరుకు చెందిన కుమార్‌ను కూడా దినేష్ పరిచయం చేయడంతో వారి వద్ద నుంచి కూడా కార్ల పేరుతో రోగిని రూ. 5 లక్షలు కాజేసింది. అయితే ఆ తరువాత మొహం చాటేయడంతో దినేష్‌కుమార్ గత నెల 25వ తేదీన వేలూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితురాలిని వేలూరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రోగినిపై వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 14 కేసులు ఉన్నట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment