Pepsi Co Industries Company
-
ఇటు వర్క్‌ని.. అటు కుటుంబాన్ని.. బ్యాలెన్స్ చేశారిలా.. !
పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త. భారత తొలి మహిళా సీఈవో కూడా ఆమె. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళా జాబితాలో కూడా స్థానం దక్కించుకుంది. ఎన్నో అత్యత్తమమైన అవార్డులను సొంతం చేసుకుని వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని విజయాలను అందుకుంది. అలాగే ఇద్దరు పిల్లల తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించి కుటుంబ జీవితాన్ని పూర్తి న్యాయం చేసింది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా..! మరీ నూయికీ ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందామా..!ఆమె రాసిని 'మై లైఫ్ ఇన్ ఫుల్' అనే పుస్తకంలో కుటుంబాన్ని, వర్క్‌ని ఎలా బ్యాలెన్సు చేసుకోవాలో క్లియర్‌గా వివరించింది. ఆ పుస్తకంలో ఓ పెద్ద కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తూ..కుటుంబ బాధ్యతలను ఎలా తాను బాల్యెన్సు చేసిందో వివరిస్తూ.. తన అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!ఇంద్ర నూయి పేరెంటింగ్ చిట్కాలు..కుటుంబం ప్రాముఖ్యత..తన తొలి సంతానం ప్రీత పుట్టినప్పుడూ యూఎస్‌లో ఆమెకు తన కూతుర్ని పర్యవేక్షించే పిల్లల సంరక్షణ ఏది కనిపించలేదు. ఆ సమయంలో ఆమె తల్లి, అత్తగారు ఆమెకు సహాయ సహకారాలు అందించారు. వారివురు తన పిల్లల బాధ్యతను తీసుకోవడంతో తాను కెరీర్లో దూసుకుపోగలిగానని అన్నారు. అదే సమయంలో వారేమీ నా పిల్లలను చూసుకున్నందుకు తన నుంచి ఎలాంటి డబ్బులు ఆశించలేదు. తరతరాలుగా వస్తున్న బాధ్యతగా వారు తీసుకున్నారు. ఇదే కుటుంబం అంటే అని చెబుతుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలాంటి విజయాలను అందుకోలేవని అంటోంది నూయి. పిల్లలను మంచిగా పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరూ సమిష్టగా చేయాల్సిన పని అని నొక్కి చెబుతోంది. అలాగే తన రెండో కూతురు తార వచ్చేటప్పటికీ పిల్లల సంరక్షణను అందుబాటులో ఉంది. అయినప్పటికీ తన కుటుంబమే వారి బాధ్యతను తీసుకుందని చెప్పుకొచ్చింది నూయి.ఒంటరిగా ఉండిపోవద్దు..మాతృత్వం అనేది ఓ గొప్ప అనుభూతి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల సాయంతో ధైర్యంగా లీడ్ చేయాలి. తాను కష్టంతో కాకుండా ఆనందంతో ఆ బాధ్యతలను నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఉద్యోగ జీవితానికి దూరమవుతున్నానే బాధ అనిపించదు. మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే కెరీర్‌ని ఎలా తిరిగి పునర్నిర్మించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. అందుకు మీ కుటుంబ సహకారం కూడా తీసుకోవాలి అని చెబుతోంది.సమయం కేటాయించటం..కొన్ని సార్లు తల్లిగా పిల్లలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు సమయం కేటాయించుకోవడం కష్టమే అయినా వాళ్లతో ఆడుతూ పాడుతూ మీ పనిచేసుకునే మార్గాన్ని అన్వేషించాలి. చేయాలనే తపన, ఉత్సాహం ఉంటే ఎలాగైన తగిన సమయం దొరుకుతుందని చెబుతోంది నూయి. కష్టపడక తప్పని స్థితి..ఒక్కోసారి రెండు పనులు నిర్వర్తిస్తున్నప్పుడూ ఓ యుద్ధమే చేస్తున్నట్లు ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడూ కుటుంబ సహకారం లేదా జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి. తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి సహకారం అత్యంత ముఖ్యం.సెలవుల సాకు వద్దు..సెలవులు దొరకడం లేదు అందుకే కుటుంబంతో గడపలేకపోతున్నా అని చెబుతుంటారు. ఇదస్సలు సరైనది కాదు. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడూ సెలవు అనే సాకు కోసం చూడొద్దు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలపై దృష్టిసారించండి. వారితో గడిపే సమయాన్ని విరామ సమయంగా లేదా రిఫ్రెష్ అయ్యే సమయంగా ఫీలయ్యేతే సెలవుతో సంబంధం ఉండదంటోంది నూయి. జీవిత భాగస్వామి సపోర్టు..పిల్లల పెంపకం అనేది తల్లి బాధ్యతనే భావనలో ఉండొద్దు. ఇది ఇరువురి బాధ్యత అని అర్థం చేసుకోవాలి. అప్పడే ఓ కుటుంబం ఆనందమయంగా ఉండగలదు. పైగా మంచిగా పిల్లలు ఎదిగే వాతావరణం అందుతుంది. అందుకు జీవిత భాగస్వామి పూర్తి సహకారం చాలా కీలకం. కాబోయే తల్లిదండ్రులిద్దరూ ఈ చిట్కాలను అనుసరిస్తే వర్క్‌ని కుటుంబ జీవితాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకుపోగలరు. ఇక్కడ ఇంద్రా నూయి సమిష్టి కృషికి పెద్దపీట వేసింది. బహుశా ఈ ఆటిట్యూడ్ ఇంద్రనూయిని అంత పెద్ద కంపెనీకి నాయకురాలిగా చేసి, బాధ్యతలను కట్టబెట్టిందేమో కదూ..!.(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు!
అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్పికో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పదించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దయచేసి యూఎస్‌కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ పది నిమిషాల నిడివిగల వీడియోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇంద్రనూయి.."అక్కడ దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియోని రికార్డు చేశాను. అమెరికాలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చట్ట పరిధికి లోబడి ఉండండి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి, అతిగా మద్యపానం సేవించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ఇవన్నీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టెవే. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే విద్యార్థులు తగిన యూనివర్సిటీని, కోర్సును ఎంపిక చేసుకోండి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్‌కి రావడం చాలా మంచిది. ఇది గొప్ప సాంస్కృతిక మార్పు కూడా. పైగా వారు తమ కుటుంబాలు, బంధువులు, పర్యావరణ పరిస్థితులకు చాలా దూరంగా చదువు కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించాలి. అమెరికాలో దిగిన క్షణం నుంచే తగిన స్నేహితులను ఎంచుకోండి. కొత్తగా రావడంతో మీకు ఇక్కడి అలవాట్లు, జీవనశైలి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీటి వ్యామోహంలో పడి చెడు స్నేహాల్లో చిక్కుకోవద్దు. కొంతమంది విద్యార్థులు సరదాగా మాదక ద్రవ్యాలకు ట్రై చేయాలని చూస్తున్నారు. ఇలాంటివి అస్సలు వద్దు ప్రాణంతకం, పైగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదీగాక ఇందులో చిక్కకుంటే మీ కెరీర్ నాశనం అవుతుంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనవద్దు. మీ చర్యల వల్ల జరిగే పరిణామలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఈ ఆతిథ్య దేశం చట్టాలు, నిబంధనలు అస్సలు తెలియవు. అంతేగాదు మీ వీసా స్థితి, పార్ట్ టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్ట బద్ధత అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించవద్దు. యూఎస్‌లో ఉన్నప్పుడూ విదేశీ విద్యార్థిగా హద్దుల్లోనే ఉండాలనే విషయం మరిచిపోవద్దు. అలాగే మీరు నివశించే ప్రాంతాల గురించి పూర్తిగి తెలుసకోవాలి. సమూహంగా లేదా స్నేహితులతోనే తప్పక వెళ్లండి." అని సూచించారు ఇంద్రానూయి. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు, స్థానిక కమ్యూనిటీల గురించి అవగాహన ఉండాలన్నారు. ఇక్కడ ఉండే స్థానిక భారతీయ అమెరికన్లతోనూ, భారతీయ కాన్సులేట్తోనూ టచ్‌లో ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలతో సహా వివిధ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఇటీవలే అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం. అలాగే అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఫిబ్రవరి నెలలో పర్డ్యూ యూనివర్శిటీకి చెందిన భారతీయ-అమెరికన్ సమీర్ కామత్ (23) అనే విద్యార్థి తలపై తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు. ఇవేగాక మరి కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలు దిగ్బ్రాంతికర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg — India in New York (@IndiainNewYork) March 22, 2024 (చదవండి: US: అమెరికాలో ఇంత భక్తి ఉందా?) -
కూలిన బతుకులు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీపంలోని ఉప్పరపాళ్యం గ్రామానికి సమీపంలో భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఆంధ్రా రాష్ర్టం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని సత్ర, కొల్లివసల, రాజుపేట తదితర గ్రామాలకు చెందిన 15 మంది, ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీలు చేస్తున్నారు. వీరి కోసం పెప్సె కో ఇండస్ట్రీస్ కంపెనీ ప్రహరీ గోడ పక్కనే తాత్కాలిక గుడిసెలను నిర్మించారు. ఈ ప్రహరీ గోడను మూడేళ్ల క్రితం నాసిరకంగా నిర్మించారు. దీంతో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు ప్రహరీగోడ కుప్పకూలి గుడిసెలపై పడింది. శనివారం అర్ధరాత్రి తరువాత 2.50 గంటలకు జరిగిన సంఘటన ఉదయం 6.30 గంటలకు వెలుగులోకి వచ్చింది. అది కూడా అటు వైపు వెళుతున్న రైతు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నివారణ సంస్థ, జిల్లా పోలీసుల యంత్రాగం సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అయితే అప్పటికి భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చ ర్యలు కొంత ఆలస్యంగా సాగారుు. జిల్లా యంత్రంగం మొత్తం అక్కడ మోహరించి, సహాయక చర్యలను పూర్తి చేసి మృతి చెందిన 11 మృతదేహాలను తిరువళ్లూరు వైద్యశాలకు, గాయపడిన నాగరాజను స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. ఉప్పరపాళ్యంలో గోడ కూలి మృతి చెందిన 11 మంది మృతదేహాలను తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శవపరీక్షలను పూర్తి చేశారు. హెల్పెప్ లైన్ ఏర్పాటు: శ్రీకాకుళం జిల్లా వాసుల సౌకర్యం కోసం తిరువళ్లూరు జిల్లా వైద్యకే ంద్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మృతుల వివరాలు, ఇతర వాటి కోసం 09445000494( తిరువళ్లూరు తహశీల్దార్ చిత్రా) సంప్రదించాలని క లెక్టర్ వీరరాఘవరావు ఆదేశించారు. దీంతో పాటు ప్రహరీ గోడ పూర్తిగా కూల్చేయూలని నోటీసులు ఇవ్వాలని చోళవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను తనిఖీ చేసిన సమయంలో మొత్తం రూ.90155 పోలీసులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. దీంతో పాటు మహిళల వద్ద ఐదు సవర్ల బంగారం, తాళిబొట్టు, రెండు సెల్ఫోన్లు తదితర విలువైన వస్తువులు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లాకు చేరుకున్న ఆంధ్రా అధికారులు : సంఘటనపై సమాచారం అందుకున్న తడ తహశీల్దార్ ఏడుకొండలు, గూడూరు ఆర్డీవో రమణతో పాటు ఇతర ఉన్నత అధికారులు తిరువళ్లూరు వైద్యశాలకు చేరుకుని సమాచారాన్ని ఆంధ్రా ప్రభుత్వానికి చేరవేశారు. ముగ్గురి అరెస్టు: గోడ కూలి మృతి చెందిన సంఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గోడౌన్ యజమాని తుపాకీ బాలన్, భవన నిర్మాణ మేస్త్రీ దేవేంద్రన్, సూపర్వైజర్ మురుగేషన్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే నూతన భవన నిర్మాణ యజమానిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు.