కూలిన బతుకులు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీపంలోని ఉప్పరపాళ్యం గ్రామానికి సమీపంలో భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఆంధ్రా రాష్ర్టం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని సత్ర, కొల్లివసల, రాజుపేట తదితర గ్రామాలకు చెందిన 15 మంది, ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీలు చేస్తున్నారు. వీరి కోసం పెప్సె కో ఇండస్ట్రీస్ కంపెనీ ప్రహరీ గోడ పక్కనే తాత్కాలిక గుడిసెలను నిర్మించారు. ఈ ప్రహరీ గోడను మూడేళ్ల క్రితం నాసిరకంగా నిర్మించారు. దీంతో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు ప్రహరీగోడ కుప్పకూలి గుడిసెలపై పడింది. శనివారం అర్ధరాత్రి తరువాత 2.50 గంటలకు జరిగిన సంఘటన ఉదయం 6.30 గంటలకు వెలుగులోకి వచ్చింది.
అది కూడా అటు వైపు వెళుతున్న రైతు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నివారణ సంస్థ, జిల్లా పోలీసుల యంత్రాగం సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అయితే అప్పటికి భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చ ర్యలు కొంత ఆలస్యంగా సాగారుు. జిల్లా యంత్రంగం మొత్తం అక్కడ మోహరించి, సహాయక చర్యలను పూర్తి చేసి మృతి చెందిన 11 మృతదేహాలను తిరువళ్లూరు వైద్యశాలకు,
గాయపడిన నాగరాజను స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. ఉప్పరపాళ్యంలో గోడ కూలి మృతి చెందిన 11 మంది మృతదేహాలను తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శవపరీక్షలను పూర్తి చేశారు. హెల్పెప్ లైన్ ఏర్పాటు: శ్రీకాకుళం జిల్లా వాసుల సౌకర్యం కోసం తిరువళ్లూరు జిల్లా వైద్యకే ంద్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మృతుల వివరాలు, ఇతర వాటి కోసం 09445000494( తిరువళ్లూరు తహశీల్దార్ చిత్రా) సంప్రదించాలని క లెక్టర్ వీరరాఘవరావు ఆదేశించారు. దీంతో పాటు ప్రహరీ గోడ పూర్తిగా కూల్చేయూలని నోటీసులు ఇవ్వాలని చోళవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
మృతదేహాలను తనిఖీ చేసిన సమయంలో మొత్తం రూ.90155 పోలీసులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. దీంతో పాటు మహిళల వద్ద ఐదు సవర్ల బంగారం, తాళిబొట్టు, రెండు సెల్‌ఫోన్‌లు తదితర విలువైన వస్తువులు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లాకు చేరుకున్న ఆంధ్రా అధికారులు : సంఘటనపై సమాచారం అందుకున్న తడ తహశీల్దార్ ఏడుకొండలు, గూడూరు ఆర్డీవో రమణతో పాటు ఇతర ఉన్నత అధికారులు తిరువళ్లూరు వైద్యశాలకు చేరుకుని సమాచారాన్ని ఆంధ్రా ప్రభుత్వానికి చేరవేశారు. ముగ్గురి అరెస్టు: గోడ కూలి మృతి చెందిన సంఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గోడౌన్ యజమాని తుపాకీ బాలన్, భవన నిర్మాణ మేస్త్రీ దేవేంద్రన్, సూపర్‌వైజర్ మురుగేషన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే నూతన భవన నిర్మాణ యజమానిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు.