tiruvallur District
-
ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని..
సాక్షి, చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని ఊత్తుకోటలో అర్థరాత్రి యువకుడి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకార హత్యలో భాగంగా రౌడీషీటర్‌ను హత్య చేయడానికి ప్రణాళిక రచించి అతడి స్నేహితుడిని హత్య చేసినట్టు నిందితులు వాగ్మూలం ఇవ్వడంతో ఊత్తుకోట పోలీసులు షాక్ గురైయ్యారు. కాగా ఆగస్టు 31న ఊత్తుకోటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాబిన్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. హత్యలో నలుగురు యువకులు పాల్గొన్నట్టు నిర్ధారించిన తిరువళ్లూరు డీఎస్పీ చంద్రహాసన్ నేతృత్వంలో ఆరు విచారణ బృందాలతో గాలింపు చేపట్టి చోళవరానికి చెందిన కార్తీక్(26), శరవణన్(25), రాహుల్(25) ముగ్గరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైక్‌పై రావడంతో.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ ముమ్మరం చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన రాబిన్ స్నేహితుడు మోహన్. ఇతనితో ప్రధాన నిందితుడిగా ఉన్న కార్తీక్ స్నేహితులు రెండు గ్రూపులుగా ఏర్పడి తరచూ ఘర్షణలకు దిగేవారు. గత రెండు నెలల క్రితం నాగపట్నం జిల్లా వేలాంగన్నికి చెందిన కార్తీక్ అనుచరుడు అభిషేక్‌ను మోహన్ వర్గీయులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగానే మోహన్‌ను హత్య చేయడానికి నిర్ణయించి ప్రణాళిక రచించినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. చదవండి: బెడిసికొట్టిన ‘మద్యం చోరీ’ స్కెచ్.. పోలీసులకు చిక్కిన మందుబాబులు సంఘటన జరిగిన రోజు మోహన్‌తో పాటు హత్యకు గురైన రాబిన్, కమల్‌తో సహా ఆరు మంది ఊత్తుకోటలో జరిగిన వివాహానికి హాజరైయ్యారు. వీరిలో కమల్, రాబిన్ రిషెప్షన్ ముగించుకుని ముందుగా బయలుదేరగా, మోహన్ మండపంలోని ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంలో బయలుదేరిన వ్యక్తి రౌడీషీటర్ మోహన్‌గా భావించిన ప్రత్యర్తులు వెంబడించి రాబిన్‌ను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గరిని అరెస్టు చేసిన పోలీసులు ఊత్తుకోట కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
తమిళనాడులో ఘోరం.. విద్యార్థిని ఆత్మహత్య.. 10 రోజుల్లో రెండో ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు సేలం జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఘోరం వెలుగు చూసింది. తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 12 వతరగతి చదవుతున్న మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 10 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. టెక్కులూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 12 వతరగతి చదవుతోంది. సోమవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్ గదిలోలో పడుకుంది. సోమవారం ఉదయం మిగతా బాలికలు పాఠశాలకు వెళ్లగా.. తాను ఆలస్యంగా వస్తానని స్నేహితులకు చెప్పింది. అయితే విద్యార్థిని ఎంతకు పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది హాస్టల్ గదికి వెళ్లి చూడగా విద్యార్థిని సీలింగ్‌కు ఉరివేసుకొని శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకొని స్టూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సరైన సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని, తమ కూతురు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ తిరుత్తణి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యలు ఆందోళనలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. ఘటనపై మప్పేడు పోలీస్ స్టేషన్లోకేసు నమోదు చేయగా.. కేసును సెంట్రల్ బ్రాంచ్-సీఐడీ అధికారులకు బదిలీ చేశారు. అధికారులు విచారణ నిమిత్తం పాఠశాలకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. చదవండి: కి‘లేడీ’లు!.. ఏసీబీ అధికారులంటూ జ్యువెలరీ షాప్‌లోకెళ్లి.. -
చిన్నారిపై లైంగికదాడి కేసు: 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు(తమిళనాడు): చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ శతాధిక వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పూందమల్లికి చెందిన పరశురామన్ (103) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతని ఇంట్లో ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవారు. ఈ నేపథ్యంలో 2018లో ఇంట్లో ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన పరశురామన్ ఒంటరిగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు చదవండి: Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే? అయితే బాలికకు రెండు రోజుల తరువాత ఆరోగ్య సమస్యలు రావడంతో అనుమానం వచి్చన తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం బాధితులు ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరశురామన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. బాలికపై లైంగిక దాడికి దిగిన పరశురామన్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు
సాక్షి,తిరువళ్లూరు(చెన్నై): ఆస్తులను లాగేసుకుని కుమారులు ఇంటి నుంచి బయటకు గెంటేశారని.. తనకు న్యాయం చేయాలని విశ్రాంత హెచ్ఎం కలెక్టర్ ఎదుట విలపించాడు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి తాలుకా చెన్నీర్‌కుప్పం గ్రామానికి చెందిన పరశురామన్‌కు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రెండేళ్ల క్రితం మృతి చెందారు. పరశురామన్‌కు చెన్నీర్‌కుప్పంలో సుమారు రూ.6 కోట్ల విలువైన 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కొడుకులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని తండ్రిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో పరశురామన్ సోమవారం కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్ పూర్తి విచారణకు ఆదేశించారు. -
కామాంధుడిని పొడిచి చంపేసింది.. ఆపై
చెన్నై: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని ధీటుగా ఎదుర్కొంది ఓ యువతి. తనను కాపాడుకునే క్రమంలో అతడిని కత్తితో పొడిచింది. దీంతో అతడు మరణించాడు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారమిచ్చిన సదరు యువతి తన నేరాన్ని అంగీకరించింది. వారం రోజుల క్రితం తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. తిరువల్లూర్ జిల్లాలోని శోలవరం ప్రాంతానికి చెందిన పందొమిదేళ్ల యువతిని ఆమె కజిన్(24) గత కొన్నిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. (చదవండి: ప్రేమ వ్యవహారం: చెరువు గట్టు వద్ద కత్తిపోట్లతో..) ఈ క్రమంలో ఆదివారం ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లగా, మాటువేసిన మృగాడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో యువకుడు వెంట తెచ్చుకున్న కత్తి కిందపడగా, వెంటనే దానిని తీసుకున్న యువతి అతడి మెడ, ముఖంపై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు మృతి చెందాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘అక్కడ ఏం జరిగిందో ఆమె కళ్లకుగట్టినట్లుగా వివరించింది. తను ఎందుకు అలా చేసిందో స్పష్టంగా చెప్పింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నిజాయితీపరురాలు కూడా. వాంగ్మూలం ఇచ్చేటపుడు ఏమాత్రం భయపడలేదు. నిజానికి తను ఫోన్ చేయగానే మావాళ్లు షాకయ్యారు. మృతుడు ప్రవర్తనతో విసుగెత్తిన ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే అతడిని హెచ్చరించారు. అయినా తన తీరు మార్చుకోలేదు. సెక్షన్ 100 కింద కేసు నమోదు చేశాం. ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య కాబట్టి ఆమెకు కొన్ని మినహాయింపులు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు. -
మొదటి రాత్రే భార్యను హత్య చేసి..
కలిసిన మనసులతో.. కలకాలం సుఖసంతోషాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేశాడు. భార్య బానిస కాదని, ఆజన్మాంతం ప్రేమిస్తానని నమ్మించాడు. ఓ శుభముహూర్తంలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఏడడుగులు వేయించాడు. ఇక జీవితం సుఖమయం అవుతుందని ఊహించిన యువతికి తొలిరేయే.. మృత్యు రాత్రిగా మారింది. మొగుడి రూపంలో మృత్యువు ఆమె నూరేళ్ల జీవితాన్ని చీకట్లో బలితీసుకుంది. తొలిరాత్రి రోజే భార్యను హతమార్చిన ఆ మానవ మృగం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువళ్లూరు(తమిళనాడు): పెళ్లి చేసుకున్న గంటల్లోనే భార్యను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో సోమంజేరి గ్రామానికి చెందిన క్రేన్ ఆపరేటర్ నిధివాసన్ (27). ఇతనికి సమీప బంధువు సడయన్‌కుప్పం గ్రామానికి చెందిన సంధ్య(22)తో జనవరిలో వివాహం నిశ్చమైంది. జూన్ 10న వివాహం వైభవంగా నిర్వహించాలని అనుకున్నా.. లాక్డౌన్ నేపథ్యంలో కొద్ది మంది బంధువుల సమక్షంలో అదే రోజు సమీపంలోని ఆలయంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారు నగలు ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రి అంటూ భారీగానే కట్నకానుకలు ఇచ్చారు. అర్ధరాత్రి కేకలు వేస్తూ.. బుధవారం వివాహం పూర్తయిన తరువాత తొలిరాత్రికి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి రాత్రి 12 గంటల సమయంలో యువతి గట్టిగా కేకలు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బంధువులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మూడు గంటలకు యువకుడు నీధివాసన్ తలుపులు తెరుచుకుని, గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా యువతి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో కాట్టూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని పరిశీలించగా, గడ్డపారతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిధివాసన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. వివాహమై 24 గంటలూ గడవక ముందే యువతి దారుణ హత్యకు గురి కావడం, యువకుడు సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: అతడు.. ఆమె.. ఓ అన్న! గంజాయి మత్తే కారణమా? నిధివాసన్ గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వివాహం నిశ్చయానికి ముందే మద్యానికి బానిసైన నీధివాసన్, మానసికరోగిగా మారిపోయాడని, సాధారణ స్థితికి రావడానికి మూడు నెలల పాటు మానసిక వైద్యశాలలో చిక్సిత కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిధివాసన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో పెళ్లి దాదాపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందని, అయితే యువతిని బాగా చూసుకుంటామని, మద్యం వైపు వెళ్లడని యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతోనే వివాహం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. యువతిని హత్య చేసే సమయంలో మద్యం, గంజాయి మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరువళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం
-
భారీ అగ్ని ప్రమాదం..రూ.100 కోట్ల నష్టం
చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఎల్ఎస్ ఆటో మొబైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ ఆటో మొబైల్ కంపెనీలో కారు స్పేర్ పార్ట్స్ తయారీ చేస్తారు. సుమారు 1500 కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం వేకువజామున 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు 50 మంది కార్మికులు మాత్రమే పనిలో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. కంపెనీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అని కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతుల అదృశ్యం అసత్య ప్రచారమే
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు నెలల్లో వంద మంది యువతులు అదృశ్యమైనట్టు కొన్ని చానల్స్‌లో జరుగుతున్న ప్రచారం అబద్ధమేనని ఎస్పీ శిబిచక్రవర్తి అన్నారు. తిరువల్లూరులో ట్రాఫిక్ నిబందనలు పాటించడంపై వాహనచోదలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మొదట ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల పేరిట నిర్వహించిన బైక్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న పలువురికి ప్రమాద రహిత ప్రయాణంపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. కిలోమీటరు దాకా సాగిన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 40 మంది యువతులు మాత్రమే.. తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 40 మంది యువతులు మాత్రమే అదృశ్యమైయ్యారని వీరిలో 36 మంది ఆచూకీ ఛేదించమన్నారు. కొన్ని చానల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు బాలికలు మాత్రమే మిస్ అయ్యారని వీరి ఆచూకీ కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహన చోదకుల గురించి ఎస్పీ మాట్లాడుతూ వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని ఎస్పీ తెలిపారు.డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కీచక టీచర్ కి రెండేళ్లు జైలు
తిరువళ్లూర్: 2006లో తొమ్మిదో తరగతి చదువుతున్న13 ఏళ్ల బాలికని లైంగికంగా వేధించిన కీచక టీచర్‌కి తిరువళ్లూర్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. స్కూల్ టీచర్‌గా ఉన్న జీ. పలనిస్వామీ ల్యాబొరేటరీలో విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొదని బాదితురాలని, ఆమె స్నేహితురాలిని బెదిరించాడు. టీచర్ వేధింపుల పై ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులని సంప్రదించినా కేసు నమోదు చేయలేదు. బాధితురాలు రోజూవారి పని చేసుకొని బతికే కూలీ కూతురు అయినా స్కూల్లో చదువుతున్ననాటి నుంచే న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. 'న్యాయం గెలిచింది. లైంగిక వేధింపులకు గురైనా చాలా మంది బాధితులు దైర్యంగా బయటకు వచ్చి చెప్పకోలేక పోతున్నారు. అలాంటి వారు ముందుకు వచ్చి పోరాడేలా ప్రోత్సహిస్తాను' అని ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్న బాధితురాలు అన్నారు. -
అసలేం జరిగిందంటే..
సాక్షి, చెన్నె : తిరువళ్లూరు జిల్లా ఉప్పర పాళయం ఘటనలో మృత్యుంజయుడిగా మిగిలిన శెనగల నాగరాజు ప్రమాద విషయాన్ని ‘సాక్షి’కి వివరిం చాడు. మేస్త్రి సింహాచలంతో కలసి తండ్రి పెంట య్యతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం కొల్లు వలస, మోదుగువలస, కరవంజి గ్రామం, రాజుల పేట గ్రామాల నుంచి పది మంది రెండు వారాల క్రితం ఇక్కడికి వచ్చాం. తమకు ఇక్కడ గుడిసెలు వేయించి ఇచ్చారు. మా సారు(పేరు తెలియదు) శనివారం వచ్చి వేతనం ఇచ్చారు. మాలాగే, పది మంది చొప్పున మరి కొన్ని బృందాలు అక్కడ ఉన్నాయి. మాకు జీతాలు ఇచ్చే సరికి ఏడు గంటలైంది. కొన్ని బృందాల వాళ్లు వారి ఊళ్లకో, లేదా మరెక్కడికో వెళ్లారు. మేము అన్నం తిని మా గుడిసె బయట నిద్రించాం. పది గంటల సమయంలో ఈదురు గాలులతో వర్షం ఆరంభం అయింది. దీంతో లోపలికి వెళ్లి పడుకున్నాం. వర్షం ఎక్కువ అయింది. పన్నెండు గంటల సమయం లో బయటకు వచ్చి కాలకృత్యం తీర్చుకున్నాను. అప్పటికే వర్షం భారీగా పడుతోంది. తలుపు దగ్గరగా పడుకున్నా, ఆ తర్వాత రెండు గంటలై ఉంటుందేమో, చిమ్మ చీకటి, ఏమి తెలియడం లేదు. నా మీద బరువుగా ఏదో పడ్డట్టుంది. పక్కనే నిద్రిస్తున్న నాన్న పెంటయ్య కాళ్లు ఈడ్చుకుంటూ, కాసేపటికి జీవచ్చవంలా మారాడు. కాసేపు అరిచాను, ఎవరూ రాలేదు..అరచి..అరచి స్పృహ తప్పాను. ఉదయం 8 గంటలకు జేసీబీ రావడం కనిపించి అతి కష్టం మీద చేతులు ఊ పాను. అక్కడున్న సిబ్బంది వచ్చి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు. మా మేస్త్రి చచ్చిపోయాడు...నాన్నను కాపా డ లేకపోయాను. అమ్మ, అన్న ఊర్లో ఉన్నారు... తల తిరుగుతోన్నట్టుంది.... నన్ను మా ఊరికి పంపించండి.. అంటూ నాగరాజు బరువెక్కిన హృదయంతో తన వద్దకు వస్తున్న అధికారుల వద్ద వాపోతున్నాడు. తమకు ఎకరం పొలం ఉందని, వర్షాలు లేక, ఇక్కడ కూలి పనులకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జేబులో ఉండాల్సిన నా కూలి, నాన్న కూలి డబ్బులు కన్పిం చడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆర్డీవో పరామర్శ : సంఘటనలో శ్రీకాకుళం జిల్లావాసులు ఉన్నారన్న సమాచారంతో నాయుడు పేట ఆర్డీవో ఎంవీ రమణ రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి నుంచి స్టాన్లీ ఆస్పత్రికి చేరుకున్న రమణ, గాయపడ్డ నాగరాజును పరామర్శించారు. జ్యూస్, వాటర్ బాటిల్‌తో పాటుగా రూ.వెయ్యి ఖర్చులకు అందజేశారు. నాగరాజు ఇచ్చిన వివరాలతో తిరువళ్లూరుకు బయలుదేరి వెళ్లారు. తమ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్టు, తిరువళ్లూరు జీహెచ్‌లో ఉన్న మృతదేహాల్ని వారి వారి స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. పెను ప్రమాదం తప్పినట్టే ఈ సంఘటనా స్థలంలో పెను ప్రమా దం తప్పినట్టు కన్పిస్తున్నది. నాగరాజు చెబుతున్న వివరాల్ని బట్టి చూస్తే, ఈ గోడ పక్కనే ఉన్న మరికొన్ని గుడిసెల్లో తలా పది మంది చొప్పున బృందాలు ఉన్నాయి. అరుుతే కూలి డబ్బులు తీసుకున్న దృష్ట్యా, ఈ బృం దాలు బయటకు వెళ్లిపోయూరుు. దీంతో ఈ ప్రమాదం బారి నుంచి వా రు బయట పడ్డారు. అయితే, వారంతా తమ స్వగ్రామాలకు వెళ్లి ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిలో మరెంత మంది శ్రీకాకుళం వాసులు ఉన్నారో, మరెం దరు ఒడిశా వాసులోనన్నది విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే, వేతనాలు తీసుకున్న పుణ్యమాని వర్షం వచ్చే ముందే, అక్కడి నుంచి జారుకుని ప్రమాదం నుంచి మరి కొందరు బయట పడగలిగారు. రూ. 90 వేలు లభ్యం : సంఘటనా స్థలంలో బాధితుల వస్తువులను ఒక చోట చేర్చి అధికారులు తనిఖీలు చేశా రు. వారి బ్యాగుల్లో, దుస్తుల్లో ఏదేని చిరునామాలు, వివరాలు ఉంటాయని ఆరా తీశారు. ఈ సమయంలో అనేక మంది బ్యాగుల్లో, మృతుల జేబుల్లో డబ్బులు బయట పడ్డాయి. శనివారం వేతన దినం కావడంతో, వాటిని తీసుకుని భద్రత పరచుకున్నారని అధికారులు నిర్ధారించారు. మొత్తంగా రూ.90 వేలు ఉంటుందని భావిస్తున్నారు. వేతనాలు తీసుకున్న కూలీలను మృత్యువు కబళించడం ఆ పరిసర వాసులను శోక సంద్రంలో ముంచేసింది. -
ఉలిక్కిపడిన జిల్లా
విజయనగరం కంటోన్మెంట్ : తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఉపరపలయం వద్ద ఆదివారం ప్రహరీ కూలి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 11 మంది మృతి చెందారని ప్రసారమాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన వారిలో జిల్లా వారెవరయినా ఉన్నారా? అని ఆరా తీశారు. చెన్నైలో ఇటీవల నిర్మాణ భవనం కూలిన సంఘటనలో మృతదేహాల ను ఇప్పుడిప్పుడే జిల్లాకు తీసుకువచ్చిన వెంటనే ఈ వార్త రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో జిల్లా వాసులెవరూ మృతి చెంద లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం కూడా స్థిమిత పడిం ది. దీనిపై డీఆర్వో హేమసుందర్‌ను సాక్షి విలేకరి ప్రశ్నించగా జిల్లాకు సంబంధిం చిన వారెవరూ మృతిచెందలేదని ధ్రువీకరించారు. -
కూలిన బతుకులు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీపంలోని ఉప్పరపాళ్యం గ్రామానికి సమీపంలో భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఆంధ్రా రాష్ర్టం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని సత్ర, కొల్లివసల, రాజుపేట తదితర గ్రామాలకు చెందిన 15 మంది, ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీలు చేస్తున్నారు. వీరి కోసం పెప్సె కో ఇండస్ట్రీస్ కంపెనీ ప్రహరీ గోడ పక్కనే తాత్కాలిక గుడిసెలను నిర్మించారు. ఈ ప్రహరీ గోడను మూడేళ్ల క్రితం నాసిరకంగా నిర్మించారు. దీంతో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు ప్రహరీగోడ కుప్పకూలి గుడిసెలపై పడింది. శనివారం అర్ధరాత్రి తరువాత 2.50 గంటలకు జరిగిన సంఘటన ఉదయం 6.30 గంటలకు వెలుగులోకి వచ్చింది. అది కూడా అటు వైపు వెళుతున్న రైతు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నివారణ సంస్థ, జిల్లా పోలీసుల యంత్రాగం సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అయితే అప్పటికి భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చ ర్యలు కొంత ఆలస్యంగా సాగారుు. జిల్లా యంత్రంగం మొత్తం అక్కడ మోహరించి, సహాయక చర్యలను పూర్తి చేసి మృతి చెందిన 11 మృతదేహాలను తిరువళ్లూరు వైద్యశాలకు, గాయపడిన నాగరాజను స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. ఉప్పరపాళ్యంలో గోడ కూలి మృతి చెందిన 11 మంది మృతదేహాలను తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శవపరీక్షలను పూర్తి చేశారు. హెల్పెప్ లైన్ ఏర్పాటు: శ్రీకాకుళం జిల్లా వాసుల సౌకర్యం కోసం తిరువళ్లూరు జిల్లా వైద్యకే ంద్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మృతుల వివరాలు, ఇతర వాటి కోసం 09445000494( తిరువళ్లూరు తహశీల్దార్ చిత్రా) సంప్రదించాలని క లెక్టర్ వీరరాఘవరావు ఆదేశించారు. దీంతో పాటు ప్రహరీ గోడ పూర్తిగా కూల్చేయూలని నోటీసులు ఇవ్వాలని చోళవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను తనిఖీ చేసిన సమయంలో మొత్తం రూ.90155 పోలీసులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. దీంతో పాటు మహిళల వద్ద ఐదు సవర్ల బంగారం, తాళిబొట్టు, రెండు సెల్ఫోన్లు తదితర విలువైన వస్తువులు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లాకు చేరుకున్న ఆంధ్రా అధికారులు : సంఘటనపై సమాచారం అందుకున్న తడ తహశీల్దార్ ఏడుకొండలు, గూడూరు ఆర్డీవో రమణతో పాటు ఇతర ఉన్నత అధికారులు తిరువళ్లూరు వైద్యశాలకు చేరుకుని సమాచారాన్ని ఆంధ్రా ప్రభుత్వానికి చేరవేశారు. ముగ్గురి అరెస్టు: గోడ కూలి మృతి చెందిన సంఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గోడౌన్ యజమాని తుపాకీ బాలన్, భవన నిర్మాణ మేస్త్రీ దేవేంద్రన్, సూపర్వైజర్ మురుగేషన్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే నూతన భవన నిర్మాణ యజమానిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. -
సైకాలజిస్టు దారుణ హత్య
తిరువళ్లూరు: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పరాంగుశపురంలో ఉన్న ఆశ్రమంలో మద్యం బానిసలకు కౌన్సెలింగ్ చేసే సైకాలజిస్టును డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. తర్వాత బీరువాలో ఉంచిన రూ.18 వేలు తీసుకుని వాహనంతో పాటు పరారయ్యాడు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని తోడుగాడు పంచాయతీ పరాంగుశపురంలో చెన్నై కు చెందిన వారు ఆశ్రమ పౌండేషన్ పేరిట మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాన్ని నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పళని నిర్వహిస్తున్నారు. మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి సైకాలజిస్టు పాండియరాజన్(35) పని చేస్తున్నారు. ఇదే కేంద్రంలో జాకబ్ అనే వ్యక్తి గతంలో కౌన్సెలింగ్ తీసుకుని ప్రస్తుతం అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేంద్రంలో 30 మంది కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైకాలజిస్టు పాండియరాజన్, డ్రైవర్ జాకబ్ ఒక గదిలో ఉంటున్నారు. మిగిలిన వారు పక్కనే ఉన్న పెద్ద హాలులో రాత్రి నిద్రించారు. యధావిధిగా ఆశ్రమాన్ని ఉదయం ఆరు గంటలకు తెరవా ల్సి ఉండగా, సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్ ఉంటున్న గది 7 గంటల వరకు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కేంద్రంలో ఉంటున్న కొందరు పాండియరాజ న్ గది తలుపులు తట్టారు. పాండియరాజన్ నుంచి సమాధానం రాకపోగా, గది నుంచి రక్తం బయటకు రావడం గ్రహించిన ఆశ్రమం నిర్వాహకులు మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిని తెరిచి చూడగా కాలిన స్థితిలో ఉన్న పాండియరాజన్ మృతదేహాన్ని గుర్తించారు. తలపై బలంగా కొట్టి...ఆపై సజీవ దహనం విషయం తెలుసుకున్న తిరువళ్లూరు డీఎస్పీ పన్నీర్‌సెల్వం, ఎస్పీ శరవనన్, ఇన్స్పెక్టర్ ఏకాంబరం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట తలపై బలంగా కత్తితో నరికి ఆ తర్వాత బెడ్‌పైనే పాండియరాజన్‌కు నిప్పుపెట్టినట్టు గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని పోలీసులు వివరించారు. అతన్ని జాకబ్ హత్య చేసి ఉంటాడని తెలిపారు. బీరువాలోని రూ.18 వేల నగదు మాయమైనట్టు గుర్తించారు. అలాగే ఆశ్రమానికి చెందిన ఆమ్నీ వ్యాన్ కనిపించకపోవడంతో జాకబ్ దాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని నిర్ధారించారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీకి బాధితుల ఫిర్యాదు సంఘటన స్థలానికి వచ్చిన ఎస్పీ శరవనన్కు ఆశ్రమంలో ఉన్న బాధితులు తమను ఆశ్రమం నుండి విడిపించాలని వేడుకున్నారు. తమకు కొంత మందికి మద్యం సేవించే అలవాటు లేకున్నా తమ పిల్లలు తమను భారంగా భావించి ఇక్కడ వదిలేశారని, ఇక్కడ ఉండలేకపోతున్నట్టు వాపోయారు. జిల్లాలోని పరాంగుశపురంలో ఉన్న ఆశ్రమంలో మద్యం బానిసలకు కౌన్సెలింగ్ చేసే సైకాలజిస్టును డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. తర్వాత బీరువాలో ఉంచిన రూ. 18 వేలు తీసుకుని వాహనంతో పాటు పరారయ్యాడు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని తోడుగాడు పంచాయతీ పరాంగుశపురంలో చెన్నై కు చెందిన వారు ఆశ్రమ పౌండేషన్ పేరిట మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాన్ని నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పళని నిర్వహిస్తున్నారు. మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి సైకాలజిస్టు పాండియరాజన్(35) పని చేస్తున్నారు. ఇదే కేంద్రంలో జాకబ్ అనే వ్యక్తి గతంలో కౌన్సెలింగ్ తీసుకుని ప్రస్తుతం అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేంద్రంలో 30 మంది కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైకాలజిస్టు పాండియరాజన్, డ్రైవర్ జాకబ్ ఒక గదిలో ఉంటున్నారు. మిగిలిన వారు పక్కనే ఉన్న పెద్ద హాలులో రాత్రి నిద్రించారు. యధావిధిగా ఆశ్రమాన్ని ఉదయం ఆరు గంటలకు తెరవా ల్సి ఉండగా, సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్ ఉంటు న్న గది 7 గంటల వరకు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కేంద్రంలో ఉంటున్న కొందరు పాండియరాజ న్ గది తలుపులు తట్టారు. పాండియరాజన్ నుంచి సమాధానం రాకపోగా, గది నుంచి రక్తం బయటకు రావడం గ్రహించిన ఆశ్రమం నిర్వాహకులు మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిని తెరిచి చూడగా కాలిన స్థితిలో ఉన్న పాండియరాజన్ మృతదేహాన్ని గుర్తించారు. తలపై బలంగా కొట్టి...ఆపై సజీవ దహనం: విషయం తెలుసుకున్న తిరువళ్లూరు డీఎస్పీ పన్నీర్‌సెల్వం, ఎస్పీ శరవనన్, ఇన్స్పెక్టర్ ఏకాంబరం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట తలపై బలంగా కత్తితో నరికి ఆ తర్వాత బెడ్‌పైనే పాండియరాజన్‌కు నిప్పుపెట్టినట్టు గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని పోలీసులు వివరించారు. అతన్ని జాకబ్ హత్య చేసి ఉంటాడని తెలిపారు. బీరువాలోని రూ.18 వేల నగదు మాయమైనట్టు గుర్తించారు. అలాగే ఆశ్రమానికి చెందిన ఆమ్నీ వ్యాన్ కనిపించకపోవడంతో జాకబ్ దాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని నిర్ధారించారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీకి బాధితుల ఫిర్యాదు సంఘటన స్థలానికి వచ్చిన ఎస్పీ శరవనన్కు ఆశ్రమంలో ఉన్న బాధితులు తమను ఆశ్రమం నుండి విడిపించాలని వేడుకున్నారు. తమకు కొంత మందికి మద్యం సేవించే అలవాటు లేకున్నా తమ పిల్లలు తమను భారంగా భావించి ఇక్కడ వదిలేశారని, ఇక్కడ ఉండలేకపోతున్నట్టు వాపోయారు.