కీచక టీచర్ కి రెండేళ్లు జైలు
తిరువళ్లూర్: 2006లో తొమ్మిదో తరగతి చదువుతున్న13 ఏళ్ల బాలికని లైంగికంగా వేధించిన కీచక టీచర్కి తిరువళ్లూర్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. స్కూల్ టీచర్గా ఉన్న జీ. పలనిస్వామీ ల్యాబొరేటరీలో విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొదని బాదితురాలని, ఆమె స్నేహితురాలిని బెదిరించాడు.
టీచర్ వేధింపుల పై ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులని సంప్రదించినా కేసు నమోదు చేయలేదు. బాధితురాలు రోజూవారి పని చేసుకొని బతికే కూలీ కూతురు అయినా స్కూల్లో చదువుతున్ననాటి నుంచే న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది.
'న్యాయం గెలిచింది. లైంగిక వేధింపులకు గురైనా చాలా మంది బాధితులు దైర్యంగా బయటకు వచ్చి చెప్పకోలేక పోతున్నారు. అలాంటి వారు ముందుకు వచ్చి పోరాడేలా ప్రోత్సహిస్తాను' అని ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్న బాధితురాలు అన్నారు.