ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పీ శిబిచక్రవర్తి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు నెలల్లో వంద మంది యువతులు అదృశ్యమైనట్టు కొన్ని చానల్స్‌లో జరుగుతున్న ప్రచారం అబద్ధమేనని ఎస్పీ శిబిచక్రవర్తి అన్నారు. తిరువల్లూరులో ట్రాఫిక్ నిబందనలు పాటించడంపై వాహనచోదలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మొదట ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల పేరిట నిర్వహించిన బైక్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న పలువురికి ప్రమాద రహిత ప్రయాణంపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. కిలోమీటరు దాకా సాగిన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
40 మంది యువతులు మాత్రమే..
తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 40 మంది యువతులు మాత్రమే అదృశ్యమైయ్యారని వీరిలో 36 మంది ఆచూకీ ఛేదించమన్నారు. కొన్ని చానల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు బాలికలు మాత్రమే మిస్ అయ్యారని వీరి ఆచూకీ కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహన చోదకుల గురించి ఎస్పీ మాట్లాడుతూ వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని ఎస్పీ తెలిపారు.డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment