సైకాలజిస్టు దారుణ హత్య | psychologist murdered in Tamilnadu | Sakshi
Sakshi News home page

సైకాలజిస్టు దారుణ హత్య

Published Tue, Nov 26 2013 9:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

సైకాలజిస్టు దారుణ హత్య

సైకాలజిస్టు దారుణ హత్య

తిరువళ్లూరు: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పరాంగుశపురంలో ఉన్న ఆశ్రమంలో మద్యం బానిసలకు కౌన్సెలింగ్ చేసే సైకాలజిస్టును డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. తర్వాత బీరువాలో ఉంచిన రూ.18 వేలు తీసుకుని వాహనంతో పాటు పరారయ్యాడు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని తోడుగాడు పంచాయతీ పరాంగుశపురంలో చెన్నై కు చెందిన వారు ఆశ్రమ పౌండేషన్ పేరిట మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాన్ని నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పళని నిర్వహిస్తున్నారు. మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి సైకాలజిస్టు పాండియరాజన్(35) పని చేస్తున్నారు.

ఇదే కేంద్రంలో జాకబ్ అనే వ్యక్తి గతంలో కౌన్సెలింగ్ తీసుకుని ప్రస్తుతం అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేంద్రంలో 30 మంది కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైకాలజిస్టు పాండియరాజన్, డ్రైవర్ జాకబ్ ఒక గదిలో ఉంటున్నారు. మిగిలిన వారు పక్కనే  ఉన్న పెద్ద హాలులో రాత్రి నిద్రించారు. యధావిధిగా ఆశ్రమాన్ని ఉదయం ఆరు గంటలకు తెరవా ల్సి ఉండగా, సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్ ఉంటున్న గది 7 గంటల వరకు తెరుచుకోలేదు.

ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కేంద్రంలో ఉంటున్న కొందరు పాండియరాజ న్ గది తలుపులు తట్టారు. పాండియరాజన్ నుంచి సమాధానం రాకపోగా, గది నుంచి రక్తం బయటకు రావడం గ్రహించిన ఆశ్రమం నిర్వాహకులు మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిని తెరిచి చూడగా కాలిన స్థితిలో ఉన్న పాండియరాజన్ మృతదేహాన్ని గుర్తించారు.

తలపై బలంగా కొట్టి...ఆపై సజీవ దహనం
విషయం తెలుసుకున్న తిరువళ్లూరు డీఎస్పీ పన్నీర్‌సెల్వం, ఎస్పీ శరవనన్, ఇన్‌స్పెక్టర్ ఏకాంబరం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట తలపై బలంగా కత్తితో నరికి ఆ తర్వాత బెడ్‌పైనే పాండియరాజన్‌కు నిప్పుపెట్టినట్టు గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని  పోలీసులు వివరించారు. అతన్ని జాకబ్ హత్య చేసి ఉంటాడని తెలిపారు. బీరువాలోని రూ.18 వేల నగదు మాయమైనట్టు గుర్తించారు. అలాగే ఆశ్రమానికి చెందిన ఆమ్నీ వ్యాన్ కనిపించకపోవడంతో జాకబ్ దాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని నిర్ధారించారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
సంఘటన స్థలానికి వచ్చిన ఎస్పీ శరవనన్‌కు ఆశ్రమంలో ఉన్న బాధితులు తమను ఆశ్రమం నుండి విడిపించాలని వేడుకున్నారు. తమకు కొంత మందికి మద్యం సేవించే అలవాటు లేకున్నా తమ పిల్లలు తమను భారంగా భావించి ఇక్కడ వదిలేశారని, ఇక్కడ ఉండలేకపోతున్నట్టు వాపోయారు.

జిల్లాలోని పరాంగుశపురంలో ఉన్న ఆశ్రమంలో మద్యం బానిసలకు కౌన్సెలింగ్ చేసే సైకాలజిస్టును డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. తర్వాత బీరువాలో ఉంచిన రూ. 18 వేలు తీసుకుని వాహనంతో పాటు పరారయ్యాడు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని తోడుగాడు పంచాయతీ పరాంగుశపురంలో చెన్నై కు చెందిన వారు ఆశ్రమ పౌండేషన్ పేరిట మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాన్ని నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పళని నిర్వహిస్తున్నారు. మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి సైకాలజిస్టు పాండియరాజన్(35) పని చేస్తున్నారు. ఇదే కేంద్రంలో జాకబ్ అనే వ్యక్తి గతంలో కౌన్సెలింగ్ తీసుకుని ప్రస్తుతం అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేంద్రంలో 30 మంది కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైకాలజిస్టు పాండియరాజన్, డ్రైవర్ జాకబ్ ఒక గదిలో ఉంటున్నారు. మిగిలిన వారు పక్కనే  ఉన్న పెద్ద హాలులో రాత్రి నిద్రించారు. యధావిధిగా ఆశ్రమాన్ని ఉదయం ఆరు గంటలకు తెరవా ల్సి ఉండగా, సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్ ఉంటు న్న గది 7 గంటల వరకు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కేంద్రంలో ఉంటున్న కొందరు పాండియరాజ న్ గది తలుపులు తట్టారు. పాండియరాజన్ నుంచి సమాధానం రాకపోగా, గది నుంచి రక్తం బయటకు రావడం గ్రహించిన ఆశ్రమం నిర్వాహకులు మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిని తెరిచి చూడగా కాలిన స్థితిలో ఉన్న పాండియరాజన్ మృతదేహాన్ని గుర్తించారు.

తలపై బలంగా కొట్టి...ఆపై సజీవ దహనం:
విషయం తెలుసుకున్న తిరువళ్లూరు డీఎస్పీ పన్నీర్‌సెల్వం, ఎస్పీ శరవనన్, ఇన్‌స్పెక్టర్ ఏకాంబరం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట తలపై బలంగా కత్తితో నరికి ఆ తర్వాత బెడ్‌పైనే పాండియరాజన్‌కు నిప్పుపెట్టినట్టు గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని  పోలీసులు వివరించారు. అతన్ని జాకబ్ హత్య చేసి ఉంటాడని తెలిపారు. బీరువాలోని రూ.18 వేల నగదు మాయమైనట్టు గుర్తించారు. అలాగే ఆశ్రమానికి చెందిన ఆమ్నీ వ్యాన్ కనిపించకపోవడంతో జాకబ్ దాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని నిర్ధారించారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
సంఘటన స్థలానికి వచ్చిన ఎస్పీ శరవనన్‌కు ఆశ్రమంలో ఉన్న బాధితులు తమను ఆశ్రమం నుండి విడిపించాలని వేడుకున్నారు. తమకు కొంత మందికి మద్యం సేవించే అలవాటు లేకున్నా తమ పిల్లలు తమను భారంగా భావించి ఇక్కడ వదిలేశారని, ఇక్కడ ఉండలేకపోతున్నట్టు వాపోయారు.
 
Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement