విజయనగరం కంటోన్మెంట్ : తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఉపరపలయం వద్ద ఆదివారం ప్రహరీ కూలి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 11 మంది మృతి చెందారని ప్రసారమాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన వారిలో జిల్లా వారెవరయినా ఉన్నారా? అని ఆరా తీశారు. చెన్నైలో ఇటీవల నిర్మాణ భవనం కూలిన సంఘటనలో మృతదేహాల ను ఇప్పుడిప్పుడే జిల్లాకు తీసుకువచ్చిన వెంటనే ఈ వార్త రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో జిల్లా వాసులెవరూ మృతి చెంద లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం కూడా స్థిమిత పడిం ది. దీనిపై డీఆర్వో హేమసుందర్‌ను సాక్షి విలేకరి ప్రశ్నించగా జిల్లాకు సంబంధిం చిన వారెవరూ మృతిచెందలేదని ధ్రువీకరించారు.
ఉలిక్కిపడిన జిల్లా
Published Mon, Jul 7 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement