
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ ఇండియా మరో కొత్త యాప్‌ను విడుదల చేసింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది. 'బోలో' పేరుతో రిలీజ్ చేసిన ఈ యాప్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీ సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్టు గూగుల్ వెల్లడించింది. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది. గూగుల్ ప్లే ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ బోలో యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం. ఇది యాడ్ ఫ్రీ కూడా.
యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు ఈ యాప్‌ను గూగుల్ పరీక్షించింది. కేవలం మూడు నెలల్లో 64 శాతం మంది పిల్లల్లో చదివే నైపుణ్యం పెరిగినట్టు గుర్తించినట్టు తెలిపింది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందనే ధీమాను వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment