మద్రసాలలో పాఠ్యాంశాల బోధనకు కృషి
-
ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి
నెల్లూరు (టౌన్) మద్రసాలల్లో ఖురాన్ ఇతర మత గ్రంథాలతో పాటు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్ తదితర సాధారణ పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మద్రసాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్రసాలలో 2016–17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నుంచి సాధారణ విద్యను బోధించేందుకు ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మండలాల వారిగా మద్రాసాలను తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. ఆ సమయంలో ఎలాంటి లోపాలు కనిపించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ మేరీరాణి మాట్లాడుతూ శుక్రవారం నుంచి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులో అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూర్తిచేసి ఈనెల 30వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలు కోసం 9440373616, 7093900557లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఏఏఎంఓ ఖాదర్‌బాషా, ఏఎంఓ హమీద్, సీఎంఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.