- ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం
- సీఐడీ ప్రతిపాదనలకు విద్యాశాఖ పచ్చజెండా
సాక్షి,హైదరాబాద్: చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రిం చేందుకు బాల్యం నుంచే అవగాహన కల్పించేందుకు సీఐడీ కార్యాచరణ రూపొందించింది. మహి ళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, విద్యా శాఖతో సంయుక్తంగా పలు అంశాలపై విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాలను పాఠ్యాం శాల రూపంలో అందుబాటులోకి తీసుకురా బోతోంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యా ర్థులకు తప్పుడు మార్గాల్లో నడవకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పాఠాలు బోధించనున్నారు.
ఇందుకు సీఐడీ–విద్యాశాఖ కసరత్తు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్‌లో, 3,4,5వ తరగతిలోని ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, 6 నుంచి 10వ తరగతిలోని హిందీ సబ్జెక్టులో ఒక పాఠ్యాం శంగా లైంగిక వేధింపుల నియంత్రణపై బోధించనున్నారు. ఉమ్మడి ప్రణాళికతో సమగ్రంగా అధ్యయనం చేసిన ఒక మాడ్యుల్‌ను అన్ని తరగతుల్లోని విద్యార్థులకు బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కార్య క్రమాలు ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.
ప్రజాప్రతినిధులకు శిక్షణ..
చిన్నారులపై జరుగుతున్న 80% లైంగిక దాడుల కేసుల్లో తెలిసిన వాళ్లే నిందితులని పోలీస్ శాఖ గుర్తించింది. దీంతో సమాజం లోని అన్ని వర్గాలకు, అన్ని వయసుల వారికి అవగాహన కల్పించేందుకు సిపార్డ్ (రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు కూడా లైంగిక వేధింపుల నియంత్రణపై 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక నుంచి ట్రాఫిక్ సబ్జెక్ట్...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రోడ్‌సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ అంశంపై ప్రత్యేక సబ్జెక్టును వచ్చే విద్యా ఏడా ది ఒకటినుంచి పదోతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.