elementary education
-
ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో ’మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలు’ అందించేందుకు సిద్ధమైంది. రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్‌ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు, ఎదుటి పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలుండేలా రూపొందించారు. ►రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు–ఇంగ్లిష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ►ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు,ఇంగ్లీష్, గణితం సిలబస్‌లో మార్పులు చేశారు. ►ఈవీఎస్ (ఎన్విరాన్ మెంటల్ సైన్స్) ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన. ►ఆరో తరగతిలో సోషల్, హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ►ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. ►గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు. ►రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా.. ‘రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది. నూతన పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 116 మంది కవుల రచనల నుంచి అంశాలను చేర్చాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆలోచనలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్ బుక్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్ హ్యాండ్‌బుక్ కూడా ఇస్తున్నాం. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం’ – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ -
ఓపెన్ స్కూల్ ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ స్కూల్(ఎన్ఐఓఎస్) ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సును దూరవిద్య ద్వారా పొందే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీ.ఈఎల్.ఈడీ) శిక్షణ పొంది ఉండాలన్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందని వారుంటే 31 మార్చి, 2019లోగా శిక్షణ పొందాలన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దూరవిద్య ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టిందని, ఆసక్తి గలవారు ఈనెల 15లోగా www.nios.ac.in లేదా dled@nios.ac.in ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. -
సాక్షర భారత్‌కు గొడ్డలిపెట్టు!
సందర్భం ప్రస్తుతం ప్రాథమిక విద్యా వ్యవస్థలో అమల్లో ఉన్న నాన్ డిటెన్షన్ విధానం (అదే తరగతిలో విద్యార్థుల్ని కొనసాగిం చకూడదనే విధానం) వల్ల పరీక్షల్లో తప్పుతామనే భయం లేక పిల్లలు చద వడం లేదని, క్రమశిక్షణా రాహిత్యం పెరిగిందని దాంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని అందుకు నాన్ డిటె న్షన్ విధానాన్ని సమీక్షించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009లోని 16వ సెక్ష న్లోని ‘‘బడిలో ప్రవేశం పొందిన బాలలను ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్లీ కొనసాగించకూడదు, బడినుంచి తీసివెయ్యకూడదు (అదే తరగతిలో మళ్లీ కొనసాగిం చడం, బడి నుంచి తీసివేయడం నిషేధం) అనే నిబంధనను సవ రించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సమ్మతిస్తూ ఐదవ తరగతి నుంచి 8వ తరగతి వరకు డిటెన్షన్ విధానం అమలు పర్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. భారత రాజ్యాంగంలోని అధిక రణం 45 ప్రకారం 14 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే తాజా ప్రతిపాదనవల్ల పరీక్షల్లో తప్పిన పిల్లలు మళ్లీ అదే తరగతి కొనసాగించలేక పాఠశాలను వది లివేయడం ఖాయం. అంటే డిటెన్షన్ విధానం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైన చర్యగా పేర్కొనవచ్చు. అంతేకాదు ఇది దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య పెంపొందించడానికి తోడ్పడుతుంది. పేద విద్యార్థుల పాలిట పెను శాపంగా పరిణమిస్తుంది. మన దేశంలో 2009లో విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ వందశాతం అక్షరాస్యత సాధించడంలో విఫలమయ్యాం. హంగెరి, రుస్తోనియా, ఆర్మీనియా, సెర్బియా వంటి అతి చిన్న దేశాలు నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించినా భారత్ 74 శాతం అక్షరాస్యత వద్దనే మిగిలి పోయింది. సర్వశిక్ష అభియాన్ లాంటి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, విద్యా హక్కు అమలుపర్చినా, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయలేకపోయాం. ఇప్పుడు 5 నుంచి 8 తరగతులకు డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే ఇంకా నిరక్ష రాస్యుల సంఖ్య పెరిగిపోయే ప్రమాదముంది. మన పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షా విధానమే లోపభూ యిష్టమైనదని, ఆ విధానాన్ని సమూలంగా సంస్కరించాలని విద్యా కమిషన్లు సిఫారసు చేసినందునే నాటి రాష్ట్ర ప్రభుత్వం 1971లో 7, 10 మినహా మిగతా అన్ని తరగతులకు పరీక్షలు రద్దు పరుస్తూ నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఎంతో ఆదర్శప్రాయమైన విధానంగా పలువురు కొనియాడారు. దీనివల్ల పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి మధ్యాహ్నభోజన పథకం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మళ్లీ బడికి, ప్రాథమిక విద్యా పథకం, సర్వ శిక్ష అభియాన్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ కారణంగా యునెస్కో గణాంకాల ప్రకారం మన దేశంలో 1981లో 29.3 కోట్ల మంది అక్షరాస్యులుండగా 2015 నాటికి వీరి సంఖ్య 93.1 కోట్లకు చేరింది. ప్రాథమిక విద్యా స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంపొందిం చాలనే ఉద్దేశంతో 5 నుంచి 8 తరగతులకు పరీక్షలు నిర్వహించా లని యోచించడమే కాదు... ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పై తరగతికి పోయే (నాన్ డిటెన్షన్) విధానాన్ని 8వ తరగతి వరకు రద్దు చేయాలని ఆగస్టు 2న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వార్షిక పరీ క్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్ని 5, 8 తరగతుల్లో నిలిపివేయడా నికి రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ బాలల ఉచిత నిర్బంధ హక్కు సవరణ బిల్లులో తగిన మార్పులు కూడా చేయనున్నారు. అయితే దీనితో పరీక్షలతో విద్యా ప్రమాణాలు పెంపొందకపోగా మధ్యలో బడి మానివేసేవారి సంఖ్య పెరిగి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా రూపొందుతుంది. పరీక్షలు అనేవి కాలం చెల్లిన మందలాంటిది. అది వ్యాధి నివారణకు బదులు కొత్త జబ్బులొచ్చే ప్రమాద ముంది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా పరీక్ష విధానం ప్రాథమిక స్థాయిలో లేదనేది గుర్తించాలి. అమెరికా 8, 9 గ్రేడులలో పరీక్ష కార్యక్రమం ప్రారంభం, రష్యాలో 8వ తరగతి దాకా.. స్వీడన్, ఫ్రాన్స్‌లో అసలు పరీక్షలే లేవు, జపాన్ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ఇరాన్లో సామాన్య పరీక్ష మాత్రమే, మారుతున్న విధానాలకు అనుగుణంగా మన విద్యావిధానమూ మారాలి. విద్యా ప్రమాణాల పెంపుదలకు బాహ్య పరీక్షలే ప్రధానమని భావించడం సరికాదు. ప్రాథమిక విద్యాస్థాయిలో ఇవి వాంఛ నీయం కాదు. విద్యార్థుల హాజరు, సక్రమమైన బోధన, అభ్యాసనే అతి ముఖ్యమని గుర్తించాలి. సంవత్సరం పొడవునా మూల్యాం కనం నిర్వహిస్తే విద్యా ప్రమాణాలు పెంపొందడం ఖాయం. ఈ పరిస్థితిలో మన దేశంలో తిరిగి డిటెన్షన్ విధానాన్ని అమ లుపరిస్తే ఎన్నటికి, ఎప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించలేని దేశంగా మిగిలి విద్యా రంగంలో వెనుకబడిన దేశంగా భారత్ రూపొందుతుంది. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రాథమిక విద్యా స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న 5 నుంచి 8 తరగతుల వరకు డిటెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొని, ప్రాథ మిక విద్యా వ్యవస్థను పరిరక్షించాలని కోరుకుందాం. కొల్లు మధుసూదనరావు వ్యాసకర్త జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మొబైల్ : 98484 20070 -
లైంగిక వేధింపుల నియంత్రణపై పాఠాలు
- ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం - సీఐడీ ప్రతిపాదనలకు విద్యాశాఖ పచ్చజెండా సాక్షి,హైదరాబాద్: చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రిం చేందుకు బాల్యం నుంచే అవగాహన కల్పించేందుకు సీఐడీ కార్యాచరణ రూపొందించింది. మహి ళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, విద్యా శాఖతో సంయుక్తంగా పలు అంశాలపై విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాలను పాఠ్యాం శాల రూపంలో అందుబాటులోకి తీసుకురా బోతోంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యా ర్థులకు తప్పుడు మార్గాల్లో నడవకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పాఠాలు బోధించనున్నారు. ఇందుకు సీఐడీ–విద్యాశాఖ కసరత్తు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్లో, 3,4,5వ తరగతిలోని ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 6 నుంచి 10వ తరగతిలోని హిందీ సబ్జెక్టులో ఒక పాఠ్యాం శంగా లైంగిక వేధింపుల నియంత్రణపై బోధించనున్నారు. ఉమ్మడి ప్రణాళికతో సమగ్రంగా అధ్యయనం చేసిన ఒక మాడ్యుల్‌ను అన్ని తరగతుల్లోని విద్యార్థులకు బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కార్య క్రమాలు ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజాప్రతినిధులకు శిక్షణ.. చిన్నారులపై జరుగుతున్న 80% లైంగిక దాడుల కేసుల్లో తెలిసిన వాళ్లే నిందితులని పోలీస్ శాఖ గుర్తించింది. దీంతో సమాజం లోని అన్ని వర్గాలకు, అన్ని వయసుల వారికి అవగాహన కల్పించేందుకు సిపార్డ్ (రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు కూడా లైంగిక వేధింపుల నియంత్రణపై 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక నుంచి ట్రాఫిక్ సబ్జెక్ట్... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రోడ్‌సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ అంశంపై ప్రత్యేక సబ్జెక్టును వచ్చే విద్యా ఏడా ది ఒకటినుంచి పదోతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.