జాతీయ ఓపెన్ స్కూల్(ఎన్‌ఐఓఎస్) ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సును దూరవిద్య ద్వారా పొందే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు శిక్షణ పొందని వారుంటే 31 మార్చి, 2019లోగా శిక్షణ పొందాలన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దూరవిద్య ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టిందని, ఆసక్తి గలవారు ఈనెల 15లోగా www.nios.ac.in లేదా dled@nios.ac.in ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.