వాకింగ్ లాంజెస్, బర్పీస్, జంప్ స్క్వాట్స్, సైడ్ కిక్స్, హై నీస్, స్టెయిర్స్, జంపింగ్ జాక్స్, మౌంటెయిన్ క్లైంబర్స్... మొత్తం ఎనిమిది ఎక్సర్‌సైజ్‌లు. ఒక్కో ఎక్సర్‌సైజ్‌కి ఒక్క నిమిషం. ‘రోజుకో అరగంట కేటాయించండి చాలు. దేహం ఫిట్‌గా ఉంటుంది’ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాట. ఫిట్‌నెస్ అనేది మగవాళ్లకు మాత్రమే కాదు మహిళలకు కూడా అవసరమే. మచిలీపట్నంలో మహిళలకు ఫిట్‌నెస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు సౌమ్యారావు.
‘‘మహిళ కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమిస్తుంది. కానీ తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనే ధ్యాస ఉండదు. దేహాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రోజుకో అరగంట తన కోసం తాను కేటాయించుకునే వెసులుబాటు కూడా ఉండడం లేదు. ఈ విషయంలో నగరాలు ఒక అడుగు ముందున్నాయి. పట్టణాలు, గ్రామాలు మాత్రం మహిళ ఫిట్‌నెస్ గురించి మాట్లాడడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి. ఆ అయిష్టతను తొలగించానికి సౌమ్యారావు చేస్తున్న ప్రయత్నమిది.
బందరమ్మాయి!
మాది మచిలీపట్నం. పూణేలో ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఏరోబిక్స్ మీద ఆసక్తి కలిగింది. ఇంజినీరింగ్ చేస్తూనే ఏరోబిక్స్‌లో కోర్స్ చేసి, ట్రైనర్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేశాను. అమ్మాయిలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని చెప్పేవారు నాన్న. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని మచిలీపట్నం రావడం, అదే ఏడాది మా ఊరి అబ్బాయితోనే పెళ్లీ జరిగిపోయాయి. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే మన పని ్ర΄ారంభించాలనుకున్నాను. అలా 2007లో మూడు లక్షల పెట్టుబడి తో మచిలీపట్నంలో ఏరోబిక్స్ సెంటర్ పారంభించాను. అప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి ఇద్దరు మాత్రమే పేరు నమోదు చేసుకున్నారు. నెల తిరిగేసరికి యాభై మంది ఎన్‌రోల్ అయ్యారు.
రెండు నుంచి యాభైకి... మధ్య
మచిలీపట్నంలో ఉన్న ప్రతి డాక్టర్‌నీ సంప్రదించాను. ఏరోబిక్స్‌ని ఫిట్‌నెస్ అనే ఒక్కకోణంలో చూడకుండా, దేహం అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్‌కీ అవసరమైనట్లు కస్టమైజ్‌డ్‌గా డిజైన్ చేయాల్సిన అవసరాన్ని సూచించారు. సిజేరియన్ తర్వాత దేహం తిరిగి పటుత్వాన్ని సంతరించుకోవడం, ఒబేసిటీ, పీసీఓడీ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు డిజైన్ చేశాను. మన సమాజం నిర్లక్ష్యం చేసే మరో సమస్య మెనో΄ాజ్. ఈ దశ తర్వాత మహిళల దేహం చాలా వేగంగా శక్తిని కోల్పోతుంది. ఈ దశలో ఫిట్‌నెస్‌ని పరిరక్షించుకోవడం ఎంత అవసరమో తెలియచేస్తున్నాను.
అలాంటి వాళ్లకు సెల్ఫ్‌కేర్ గురించి కౌన్సెలింగ్‌తో΄ాటు ఉచితంగా ఫిట్‌నెస్ శిక్షణనిస్తున్నాను. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే యాభై దాటినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ దశను ఆరోగ్యకరంగా దాటగలిగితే మహిళలు అరవై, డెబ్భైలలో నాణ్యమైన జీవితాన్ని సాగించగలుగుతారు. అలాగే మిడిల్ ఏజ్‌లో మహిళలకు ఎదురయ్యే డిప్రెషన్, మెంటల్ ట్రామాలకు కూడా ఫిట్‌నెస్ యాక్టివిటీ మంచి పరిష్కారం. ఏరోబిక్స్ శిక్షణ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ క్లాసులు తీసుకుంటున్నాను. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియాల్లో ఉన్న మా మచిలీపట్నం వాళ్లే ఎక్కువ మంది.
ఆవేదన తప్పడం లేదు
కొంతమంది భర్తలు ‘నీకిప్పుడు ఫిట్‌నెస్ అవసరమా, డబ్బు తగలేస్తావా’ ఇలా రకరకాలుగా అంటారట. ఆ మాటలకు భయపడి ముందడుగు వేయని వాళ్లు కొందరైతే, రహస్యంగా నేర్చుకోవాలనుకునే వాళ్లు కొందరు. ఇరవై ఒకటో శతాబ్దం కూడా మహిళల విషయంలో ఇలా ఉండడం ఏమిటో అని ఆవేదన కలుగుతుంటుంది. చైతన్యవంతం కావాల్సింది మహిళలు మాత్రమే కాదు మగవాళ్లు కూడా’’ అన్నారు సౌమ్యారావు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
పిల్లల డైలీ రొటీన్
పిల్లలకు బ్రష్ చేయడం దగ్గర్నుంచి తగినన్ని నీళ్లు తాగడం వరకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పిస్తాం. కానీ ఫిట్‌నెస్ కోసం సమయం కేటాయించడం మన ఇండియన్ పేరెంటింగ్ డిక్షనరీలో కనిపించదు. స్కూళ్లలో ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్ లేదా జుంబా డాన్స్ వంటి ఏదో ఒక వ్యాయామ ప్రక్రియ ప్రవేశ పెడితే పిల్లలకు డైలీ రొటీన్‌లో ఎక్సర్‌సైజ్ ఒక భాగంగా మారుతుంది. ఇప్పుడున్న విద్యావిధానం విద్యార్థుల్లో ఒత్తిడిని పెంచుతోంది. ఆ ఒత్తిడిని తొలగించే మార్గం ఫిజికల్ ఎక్సర్‌సైజ్. కనీసం మూడు నిమిషాల ్ర΄ాక్టీస్ చాలు. నేనే స్వయంగా స్కూళ్లకు వెళ్లి ఉచితంగా నేర్పిస్తానని ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ ΄ాఠశాల యాజమాన్యాలకు తెలియచేశాను.
– సౌమ్యారావు, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment