బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్‌నెస్‌తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..
ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్ చేస్తుంది. అలియా తన ఫిట్‌నెస్ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్‌తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్‌గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్‌లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్‌బెల్‌తో బరువున్న హిప్ థ్రస్ట్‌లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.
అలాగే ఆలియా ఫిట్‌నెస్‌లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.
మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్ టెక్నీక్‌లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.
ఇవన్నీ పాటించాలంటే..
ఆలియా భట్ మాదిరిగానే ఫిట్‌నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం.
మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేయాలి.
అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం.
అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.
శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి.
(చదవండి: అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment