infrared
-
దర్జాగా పడుకోండి.. ఫోన్ చూస్తూ, పేపర్ చదువుతూ బరువు తగ్గండి! ఎలాగంటారా?
‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి. చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు... ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. -
అదిగదిగో మరో భూమి!
ఉండే ఇల్లు సరిపోకపోతే కొత్త ఇల్లు వెతుకుంటాం! పెరిగిపోతున్న జనాభాను మనం నివసించే ఈభూమి తట్టుకోలేదని భావిస్తున్న సైంటిస్టులు మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. ఇప్పటివరకు సైంటిస్టులు సుదూర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో భూమిలాంటి గ్రహం ఉంటుందని భావించడమే జరిగింది. తాజా పరిశోధనలో సూపర్ ఎర్త్‌ను ఫొటోలు తీయడం కూడా జరిగింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫాసెంచురీ నక్షత్రం చుట్టూ మన కొత్త భూమి తిరుగుతోంది. ఇలాంటి గ్రహాలను ఫొటో తీయడానికి ఇంకా పూర్తిస్థాయి సూపర్ టెలిస్కోపులు రెడీ కాలేదు. కానీ కెవిన్ వాగ్నర్ నేతత్వంలోని బృందం మాత్రం ఒక కొత్త టెక్నిక్‌తో కొత్త భూమిని ఫొటో తీశామని చెబుతోంది. నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదైన ఈ గ్రహాన్ని ఇన్ఫ్రారెడ్ మెథడ్‌లో ఫొటో తీశారు. ఇందుకోసం ఎన్ఈఏఆర్ పరికరాన్ని వాడారు. దాదాపు వంద గంటలు పరిశీలించి, పరిశోధిస్తే చివరకు ఈ గ్రహం ఉనికిని పసిగట్టగలిగారు. దీనికి సీ1 అని పేరుపెట్టారు. నిజానికి పలు నక్షత్రాల చుట్టూ పలు గ్రహాలను మనిషి గుర్తించాడు. కానీ వీటిలో అధిక శాతం గ్రహాలు వాయుగ్రహాలు అంటే మన జూపిటర్, సాటరన్ లాంటివి. మనిషి జీవించాలంటే ఇలాంటి గ్రహాలు పనికి రావు. జీవి మనుగడకు వాయు గ్రహాల(గాసియస్ ప్లానెట్స్) కన్నా మాస్ ప్లానెట్స్ ఉపయుక్తమైనవి. ఇప్పుడు కనుగొన్న సీ1 గ్రహం గురించి మరిన్ని వివరాలకోసం సైంటిస్టులు పరిశోధిస్తున్నారు. వీరి ప్రయోగాలు, పరిశోధనలు నిజమైతే రాబోయే తరాల్లో మనిషి సీ1పై నివాసం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఈ గ్రహంపై జీవం ఉంటే? మనకన్నా బుద్ధిజీవులుంటే? చూద్దాం! -
600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్
న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైలిలో భాగంగా ఒంట్లో రోజు రోజుకు పెరిగి పోతున్న అదనపు క్యాలరీలను తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్లు, జాగింగ్లు చేస్తూ ప్రయాస పడుతుంటే మరికొందరు జిమ్‌లకు వెళుతు కుస్తీలు పడుతుంటారు. ఇవేవీ చేయలేక ఇంకొందరు బొజ్జలకు, తొడలకు ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ బెల్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి శ్రమలేవి అక్కర్లేకుండా, నిద్రపోతూ శరీరంలోని 600 కేలరీలను కరిగించుకునే సరికొత్త బ్లాంకెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఇన్ఫ్రారెడ్ సావున బ్లాంకెట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ హాడ్జ్, వ్యాట్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ వ్యాపారవేత్తలు కలిసి ‘మైహై’ బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. (చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం) బ్యాగ్‌లాగా ఉండే ఈ బ్లాంకెట్‌లో దూరి 45 నిమిషాలపాటు పడుకుంటే శరీరంలోకి దాదాపు 600 క్యాలరీలు కరగిపోతాయట. అంతేకాకుండా శరీరానికి కొత్త మెరపు వస్తుందని, మెదడుకు కూడా మంచి విరామం లభిస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. శరీరంలోని అదనపు క్యాలరీలను కరగించేందుకు, నిద్ర పుచ్చడం కోసం ఇన్ఫ్రారెడ్ సావునాను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంతకుముందే అందుబాటులో ఉందని, దాన్ని తాము బ్లాంకెట్‌లో అమర్చి విక్రయిస్తున్నామని వారు వివరించారు. ఈ బ్లాంకెట్ సత్ఫలితాలనిస్తోందని ‘వెల్నెస్ గ్రూప్’కు చెందిన యాంటీ ఏజింగ్ నిపుణురాలు మెడలిన్ కాల్ఫాస్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలుతో జిమ్ములు, పార్కులు మూతపడిన నేటి పరిస్థితుల్లో ఈ బ్లాంకెట్ మరింత ప్రయోజనకరం. ప్రస్తుతం ఆన్లైన్ 549 డాలర్ల ( దాదాపు 42 వేల రూపాయలు)కు ఈ బ్లాంకెట్ లభిస్తోంది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) -
చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!
వాషింగ్టన్: కంపూటర్లు మన జీవితంలో భాగమైన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు గమనించాం. అంతేకాకుండా కంప్యూటర్ కీబోర్డుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే తాజాగా ఓ కొత్త రకం కీబోర్డులను మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ గ్రూప్ రూపొందించింది. యూజర్ చేతుల ద్వారా చేసే సైగల్ని పసిగట్టి.. దానికి అనుగుణంగా ప్రవర్తించడమే నూతనంగా రూపొందించిన కీబోర్డు ప్రత్యేకత. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లో ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్స్ ను ఎంబెడ్ చేసి కీబోర్డుకు ప్రత్యేకతను చేకూర్చారు. కీ క్యాప్ ద్వారా ప్రతి సెన్సార్ లింక్ ట్రాక్ చేసి యూజర్ చేతి సైగల్ని పసిగడుతుందని మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేతి కదలికలకు అనుగుణంగా స్పందిస్తుందని గిజ్ మ్యాగ్ తెలిపింది. పైకి, కిందకి, కుడి, ఎడమలకు కదిలే విధంగా... ఏదైనా చిత్రాన్ని జూమ్ చేయడం లాంటి కదలికలను పసిగడుతుందని తెలిపారు.