ఉండే ఇల్లు సరిపోకపోతే కొత్త ఇల్లు వెతుకుంటాం! పెరిగిపోతున్న జనాభాను మనం నివసించే ఈభూమి తట్టుకోలేదని భావిస్తున్న సైంటిస్టులు మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. ఇప్పటివరకు సైంటిస్టులు సుదూర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో భూమిలాంటి గ్రహం ఉంటుందని భావించడమే జరిగింది. తాజా పరిశోధనలో సూపర్ ఎర్త్‌ను ఫొటోలు తీయడం కూడా జరిగింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫాసెంచురీ నక్షత్రం చుట్టూ మన కొత్త భూమి తిరుగుతోంది. ఇలాంటి గ్రహాలను ఫొటో తీయడానికి ఇంకా పూర్తిస్థాయి సూపర్ టెలిస్కోపులు రెడీ కాలేదు. కానీ కెవిన్ వాగ్నర్ నేతత్వంలోని బృందం మాత్రం ఒక కొత్త టెక్నిక్‌తో కొత్త భూమిని ఫొటో తీశామని చెబుతోంది.
నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదైన ఈ గ్రహాన్ని ఇన్‌ఫ్రారెడ్ మెథడ్‌లో ఫొటో తీశారు. ఇందుకోసం ఎన్‌ఈఏఆర్ పరికరాన్ని వాడారు. దాదాపు వంద గంటలు పరిశీలించి, పరిశోధిస్తే చివరకు ఈ గ్రహం ఉనికిని పసిగట్టగలిగారు. దీనికి సీ1 అని పేరుపెట్టారు. నిజానికి పలు నక్షత్రాల చుట్టూ పలు గ్రహాలను మనిషి గుర్తించాడు. కానీ వీటిలో అధిక శాతం గ్రహాలు వాయుగ్రహాలు అంటే మన జూపిటర్, సాటరన్ లాంటివి. మనిషి జీవించాలంటే ఇలాంటి గ్రహాలు పనికి రావు. జీవి మనుగడకు వాయు గ్రహాల(గాసియస్ ప్లానెట్స్) కన్నా మాస్ ప్లానెట్స్ ఉపయుక్తమైనవి. ఇప్పుడు కనుగొన్న సీ1 గ్రహం గురించి మరిన్ని వివరాలకోసం సైంటిస్టులు పరిశోధిస్తున్నారు. వీరి ప్రయోగాలు, పరిశోధనలు నిజమైతే రాబోయే తరాల్లో మనిషి సీ1పై నివాసం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఈ గ్రహంపై జీవం ఉంటే? మనకన్నా బుద్ధిజీవులుంటే? చూద్దాం!
Comments
Please login to add a commentAdd a comment