Neptune
-
అక్కడ ఏడాదికి 21 గంటలే
అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి! అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా. తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం. ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
అదిగదిగో మరో భూమి!
ఉండే ఇల్లు సరిపోకపోతే కొత్త ఇల్లు వెతుకుంటాం! పెరిగిపోతున్న జనాభాను మనం నివసించే ఈభూమి తట్టుకోలేదని భావిస్తున్న సైంటిస్టులు మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. ఇప్పటివరకు సైంటిస్టులు సుదూర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో భూమిలాంటి గ్రహం ఉంటుందని భావించడమే జరిగింది. తాజా పరిశోధనలో సూపర్ ఎర్త్‌ను ఫొటోలు తీయడం కూడా జరిగింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫాసెంచురీ నక్షత్రం చుట్టూ మన కొత్త భూమి తిరుగుతోంది. ఇలాంటి గ్రహాలను ఫొటో తీయడానికి ఇంకా పూర్తిస్థాయి సూపర్ టెలిస్కోపులు రెడీ కాలేదు. కానీ కెవిన్ వాగ్నర్ నేతత్వంలోని బృందం మాత్రం ఒక కొత్త టెక్నిక్‌తో కొత్త భూమిని ఫొటో తీశామని చెబుతోంది. నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదైన ఈ గ్రహాన్ని ఇన్ఫ్రారెడ్ మెథడ్‌లో ఫొటో తీశారు. ఇందుకోసం ఎన్ఈఏఆర్ పరికరాన్ని వాడారు. దాదాపు వంద గంటలు పరిశీలించి, పరిశోధిస్తే చివరకు ఈ గ్రహం ఉనికిని పసిగట్టగలిగారు. దీనికి సీ1 అని పేరుపెట్టారు. నిజానికి పలు నక్షత్రాల చుట్టూ పలు గ్రహాలను మనిషి గుర్తించాడు. కానీ వీటిలో అధిక శాతం గ్రహాలు వాయుగ్రహాలు అంటే మన జూపిటర్, సాటరన్ లాంటివి. మనిషి జీవించాలంటే ఇలాంటి గ్రహాలు పనికి రావు. జీవి మనుగడకు వాయు గ్రహాల(గాసియస్ ప్లానెట్స్) కన్నా మాస్ ప్లానెట్స్ ఉపయుక్తమైనవి. ఇప్పుడు కనుగొన్న సీ1 గ్రహం గురించి మరిన్ని వివరాలకోసం సైంటిస్టులు పరిశోధిస్తున్నారు. వీరి ప్రయోగాలు, పరిశోధనలు నిజమైతే రాబోయే తరాల్లో మనిషి సీ1పై నివాసం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఈ గ్రహంపై జీవం ఉంటే? మనకన్నా బుద్ధిజీవులుంటే? చూద్దాం! -
తప్పతాగి... తప్పు చేసి
‘‘తిరిగే కాలు అరిచే నోరూ మాత్రమేనా దొంగిలించే చేయి కూడా ఊరకే ఉండదు’’ అని నిరూపించారా దొంగలు. రోమన్లు భగవంతుడిగా కొలిచే పురాణ పురుషుడైన నెప్ట్యూన్ ఒక చేతిలో త్రిశూలం తరహా ఈటెతో ఫౌంటైన్పైన కూర్చుని ఉన్న అద్భుతమైన శిల్పం ఇంగ్లండ్‌లోని గ్లూసెస్టర్‌షైర్, షెల్తెన్హామ్ సిటీలో ఉంది. 1893లో డిజైన్ చేసిన ఈ స్టాట్యూ ఆఫ్ నెప్ట్యూన్ అక్కడి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి. అంతటి ఘన నేపథ్యం ఉన్న విగ్రహం చేతిలోని త్రిశూలాన్ని డిసెంబరు 21న దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ సుందర శిల్పం అంద విహీనంగా మారింది. దొంగల కోసం గాలింపు కొనసాగుతుండగానే... కొన్ని రోజులకు... పోయిన ఆ త్రిశూలం పెయిన్స్విక్ గార్డెన్లో దొరికింది ‘‘అతిగా మద్యం సేవించి అనుకోకుండా ఈ దొంగతనం చేశాం. మమ్మల్ని క్షమించండి’’అని దానికి అతికించి ఉన్న కాగితం మీద రాసిపెట్టి మరీ చక్కాపోయారట. ‘‘గిల్లి జోలపాడారు సరే ఇప్పుడు మరమ్మతు ఖర్చు ఎవరిస్తారే’’ అంటూ అధికారులు హంకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడా విగ్రహానికి కలిగిన నష్టాన్ని పూడ్చాలంటే 5వేల పౌండ్లు దాకా ఖర్చు అవుతుందంట మరి.