చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్! | New keyboard recognises hand gestures | Sakshi
Sakshi News home page

చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!

Published Tue, Apr 29 2014 5:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!

చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!

వాషింగ్టన్: కంపూటర్లు మన జీవితంలో భాగమైన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు గమనించాం. అంతేకాకుండా కంప్యూటర్ కీబోర్డుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే తాజాగా ఓ కొత్త రకం కీబోర్డులను మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ గ్రూప్ రూపొందించింది.
 
యూజర్ చేతుల ద్వారా చేసే సైగల్ని పసిగట్టి.. దానికి అనుగుణంగా ప్రవర్తించడమే నూతనంగా రూపొందించిన కీబోర్డు ప్రత్యేకత. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లో ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్స్ ను ఎంబెడ్ చేసి కీబోర్డుకు ప్రత్యేకతను చేకూర్చారు.
 
కీ క్యాప్ ద్వారా ప్రతి సెన్సార్ లింక్ ట్రాక్ చేసి యూజర్ చేతి సైగల్ని పసిగడుతుందని మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేతి కదలికలకు అనుగుణంగా స్పందిస్తుందని గిజ్ మ్యాగ్ తెలిపింది.
 
పైకి, కిందకి, కుడి, ఎడమలకు కదిలే విధంగా... ఏదైనా చిత్రాన్ని జూమ్ చేయడం లాంటి కదలికలను పసిగడుతుందని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement