Techonology
-
రష్యా యాంటీవైరస్పై అమెరికా సంచలన నిర్ణయం
రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తులను తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది."కాస్పర్ స్కై సాధారణంగా ఇతర కార్యకలాపాలతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోపల తన సాఫ్ట్ వేర్ ను విక్రయించడానికి లేదా ఇప్పటికే ఉపయోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ కు నవీకరణలను అందించడానికి వీలుండదు" అని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సున్నితమైన అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్ స్కై ల్యాబ్ వంటి రష్యన్ కంపెనీలను ఉపయోగించుకునే సామర్థ్యం, ఉద్దేశం తమకు ఉన్నాయని రష్యా పదేపదే నిరూపించిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ఒక ప్రకటనలో తెలిపారు. వారి సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు, తమ పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వాణిజ్య శాఖ చర్యలు అమెరికా ప్రత్యర్థులకు తెలియజేస్తున్నాయన్నారు.కాస్పర్‌స్కై యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ అమ్మకాలను నిషేధించడంతో పాటు, ఈ సంస్థతో సంబంధం ఉన్న మూడు సంస్థలను జాతీయ భద్రతా ఆందోళనగా భావించే కంపెనీల జాబితాలో అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు అమెరికాలో యాంటీవైరస్ అప్డేట్లను అందించడం సహా కొన్ని కార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రం కాస్పర్స్కైని అనుమతించారు.మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న కాస్పర్‌స్కై సంస్థ ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో కార్యాలయాలను కలిగి ఉంది. 200కి పైగా దేశాలలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు, 270,000 కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. -
10 నిమిషాల వీడియో కాల్.. 400 మంది ఉద్యోగాలు ఊడాయ్
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్లో 400 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్ధిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్‌లో భాగంగా చోటామోటా కంపెనీల నుంచి దిగ్గజ టెక్నాలజీ సంస్థలకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, ఇటీవల జరిగిన బెల్ వర్చువల్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ వందల మందికి లేఫ్స్ నోటీస్ చదివి వినిపించారు. ఈ లేఆఫ్స్‌పై ఆ సంస్థ సీఈఓ స్పందించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలో మార్పులు చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో 4,800 మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తొలగింపుల అంశం జాబ్ మార్కెట్లో చర్చాంశనీయంగా మారింది. -
తిరుపతిలో కొత్త టెక్నాలజీతో రోడ్డు
-
ఐటీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? కొత్త ఉద్యోగాలపై కీలక రిపోర్ట్!
కొత్త ఏడాదిలో ఐటీ రంగంలో నియామకాలు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మంది ఫ్రెషర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంచనా నెలకొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్ నియమించుకోగా.. ఆ సంఖ్య మరింత తగ్గిపోవడం జాబ్ మార్కెట్లో ఆందోళన కనపిస్తుంది. ప్రస్తుత జాబ్ మార్కెట్లో 1.5 మిలియన్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా అభ్యర్ధుల్లో స్కిల్స్ లేని కారణంగా నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగం మినహాయిస్తే ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 40శాతం మందిలో స్కిల్స్ టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్నీ అర్హతలు కేవలం 45 శాతం మంది దగ్గర ఉండటం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ), కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ, రిటైల్ కన్స్యూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎనర్జీ వంటి నాన్-టెక్ సెక్టార్లతో గణనీయంగా నియామకాలు పెరగే అవకాశం ఉండగా.. వాటిల్లో అధిక శాతం ఫ్రెషర్లనే ఎంపిక చేసుకోనున్నాయి. సీనియర్లు, ఫ్రెషర్స్ అయినా.. ఈ స్కిల్ ఉంటే ఈ సందర్భంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులు ఆయా టెక్నాలజీలలో నిష్ణాతులైతే చాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో టెక్నికల్ నైపుణ్యం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి హార్డ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్, సమస్యకు పరిష్కారం, టీమ్‌వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాఫ్ట్ స్కిల్స్ ఉన్న సీనియర్లు, ఫ్రెషర్స్ కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్స్లున్నాయా? టీమ్‌లీజ్ డిజిటల్సైతం అభ్యర్ధులు జాబ్ సంపాదించుకునేందుకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలనే అంశంపై కొన్ని సలహాలు ఇచ్చింది. కంపెనీలకు తగ్గట్లు కావాల్సిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందాలని సూచించింది. వాటిల్లో ప్రధానంగా ఆర్ సర్టిఫికేషన్‌తో కూడిన డేటా సైన్స్, ఎస్‌క్యూఎల్, సర్టిఫికేషన్ ట్రైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే బ్లాక్‌చెయిన్ వెబ్ డిజైన్ సర్టిఫికేషన్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ తో పాటు కావాల్సిన అన్నీ అర్హతలు ఉంటే కోరుకున్న ఉద్యోగం మీదేనని టీమ్ లీజ్ తెలిపింది. -
అమెజాన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేసేందుకు సిద్ధంగా లేని సిబ్బంది ప్రమోషన్లను నిలిపి వేస్తామని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని ప్రోత్సహించేలా అమెజాన్ యాజమాన్యం మేనేజర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థానాల్లో ఉండాలనుకునే ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ తప్పని సరి చేసింది. కాదు కూడదు అంటే గల కారణాల్ని వివరిస్తూ వైస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రమోషన్ కావాలా? అయితే ఆఫీస్‌కి రండి అంతేకాదు, ఉద్యోగుల ప్రమోషన్ల బాధ్యతలను ఆయా విభాగాల మేనేజర్లకు అప్పగించింది. ఉద్యోగులతో చేయించే రోజూవారీ ఆఫీస్ పనులతో పాటు, ప్రమోషన్లకు తగిన అర్హతల్ని గుర్తించాలని చెప్పింది. కార్యాలయాల్లో పని చేసేందుకు మొగ్గు చూపే ఉద్యోగులు ప్రమోషన్లు, ఇతర అంశాలపై వైస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదని, ఆ బాధ్యతల్ని సైతం మేనేజర్లే చేస్తారని అమెజాన్ ఉద్యోగులకు ఓ ఇంటర్నల్ ఇ-మెయిల్ పంపింది. ఈ ఏడాదిలో కొత్త వర్క్ పాలసీ అమెజాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలంటూ కొత్త వర్క్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పని విధానం మే నెల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యోగుల నిరసన అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 30 వేల మంది ఉద్యోగులు గత మే నెలలో సియోటెల్‌లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సంస్థ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. మీ అంగీకారంతో పనిలేదు ఆగస్ట్ నెలలో ఉద్యోగుల ఆందోళనపై సీఈవో ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గతంలో ‘ మీరు కొత్త వర్క్ నిబంధనల్ని అంగీకరించలేదు. అలా అని కట్టుబడీ లేరు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వారానికి మూడు రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కు తప్పని సరిగా రావాల్సిందే’నని హెచ్చరించారు. తాజాగా, సిబ్బంది ఆఫీస్‌కు రావాలని, లేదంటే వారి ప్రమోషన్లను నిలిపివేస్తామని మరోసారి మెయిల్స్ పంపడంతో అమెజాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇతర సంస్థలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
పండగ సీజన్లో దినదిన గండం..టెక్కీల నెత్తిపై మరో పిడుగు!
మరికొన్ని రోజుల్లో ఏడాది ముగుస్తుంది. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కానీ టెక్ కంపెనీలు మాత్రం ఉద్యోగుల తొలగింపుల్ని ఆపడం లేదు. ఈ ఏడాదితో ప్రారంభమైన లేఆఫ్స్ కారణంగా ఇప్పటి వరకు 244,342 మంది ఉపాధి కోల్పోయారు. 2022 నుంచి ఇప్పటి వరకు 50 శాతం పెరుగుదలతో ఆయా కంపెనీలు సిబ్బందిని ఇంటికి సాగనంపాయి. వాటిల్లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పాటు చిన్న చిన్న ఫిన్ టెక్ కంపెనీలు, యాప్స్ నిర్వహణ సంస్థలున్నాయి. అయితే వీటిల్లో కొన్ని సంస్థలు ఉద్యోగుల తొలగింపుల్లో కాస్త వెనక్కి తగ్గడంతో.. ఇక లేఆఫ్స్ ఉండవనే అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో తాజాగా, ఐటీ ఉద్యోగులపై మరో పిడుగు పడేలా ఉందనే అంశం తెరపైకి వచ్చింది. గూగుల్, అమెజాన్, స్నాప్ వంటి సంస్థలు ఫెస్టివల్ సీజన్లో సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు మొగ్గు చూపాయి. ఫలితంగా మరోసారి ప్రొడక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్, ఇంజినీరింగ్ విభాగాల ఉద్యోగుల్ని ఫైర్ చేసేందుకు సిద్ధపడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలు అదే బాటులో ఉన్నట్లు సమాచారం. గూగుల్‌లో తొలగింపులు టెక్ దిగ్గజం గూగుల్ కొనుగోలు దారుల నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించే యూజర్ అండ్ ప్రొడక్ట్ విభాగాల ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన గూగుల్.. తొలగింపులు తక్కువేనని సెలవిచ్చింది. అయినా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆల్ఫబెట్ అనుంబంధ సంస్థల్లో వెరిలి, వేమూ, గూగుల్ న్యూస్ విభాగాల్లో పనిచేసే సిబ్బందిపై ప్రభావం పడనుంది. భవిష్యత్‌లో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉన్న రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్‌లో లేఆఫ్స్ గూగుల్ బాటలో ఈకామర్స్ జెయింట్ అమెజాన్ మ్యూజిక్ విభాగం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్‌లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఈ కోతలు కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యతనివ్వడం, దీర్ఘకాలిక వ్యాపార అవకాశాల్ని గుర్తించడంలో భాగమేనని అమెజాన్ నొక్కి చెప్పింది. గూగుల్, అమెజాన్ బాటలో స్నాప్ ఇప్పటికీ ఉద్యోగాలను తగ్గించుకుంటున్న కంపెనీల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్ కూడా చేరింది. స్నాప్ తన ప్రొడక్ట్ బృందంలో పనిచేస్తున్న దాదాపు 20 మందిని తొలగించింది. ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్నాప్‌లో తొలగించనున్న వారిలో ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సహా ఇతర విభాగాల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. కారణాలు ఇవే ఉద్యోగుల తొలగింపులకు ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయం తగ్గడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగులు తొలగింపులు వారి వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌లు,ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో ఓ భాగమేనని తెలిపాయి. దీంతో పాటు పుట్టుకొస్తున్న కొత్త టెక్నాలజీలు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు టెక్నాలజీ రంగంపై పడుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి👉 ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్ ఇచ్చిన అమెజాన్, రిజెక్ట్ చేసిన ఉద్యోగి! -
ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. నాన్ టెక్నాలజీ రంగాలు నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది. ఐటీ రంగంలో క్షీణత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి. -
ప్రపంచాన్ని ఊపేస్తున్న మెటావర్స్ ఫీవర్..వినియోగంలోకి వచ్చేది అప్పుడే!
న్యూఢిల్లీ : మెటావర్స్కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వినియోగంలోకి రావడానికి మరో 8–10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్, తయారీ, మీడియా, హెల్త్‌కేర్, టెలికం, ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర రంగాలు దీనిపై గణనీయంగా వెచ్చించనున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మెటావర్స్ సాధనాల వినియోగం తీరుతెన్నులను వివరించారు. దీని ప్రకారం 2017లో కృత్రిమ మేథ (ఏఐ) విషయంలో ఎలాంటి ధోరణులు కనిపించాయో ఇప్పుటు మెటావర్స్‌ను కంపెనీలు వినియోగించడంపైనా అలాంటి ధోరణులే కనిపిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలికంగా మెటావర్స్ సొల్యూషన్స్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు గతేడాది 57 శాతం మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ తెలిపినట్లు సర్వేలో తేలింది. ఇటీవలి సాంకేతికత పురోగతి కారణంగా ఇంటర్నెట్లో తదుపరి విప్లవంగా మెటావర్స్ ముందు వరుసలో ఉండనుందని నివేదిక పేర్కొంది. భారీగా పెట్టుబడులు .. మెటావర్స్ విభాగంలోకి ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. గతేడాది ప్రథమార్ధంలో 120 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్‌కు సర్వీసులు అందించడం, రియల్ టైమ్‌లో ఉత్పత్తుల డిజైనింగ్‌ను పరీక్షించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడగలదని వివరించింది. 3డీ/టెక్నికల్ ఆర్టిస్ట్‌లు, మోషన్ డిజైనర్లు, గ్రాఫిక్స్ ఇంజినీర్లు మొదలైన వారు ఈ టెక్నాలజీ విస్తరణలో కీలకపాత్ర పోషిస్తారని నివేదిక తెలిపింది. అయితే, దీన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే .. పెట్టుబడులపై రాబడులు, టెక్నాలజీ, టాలెంట్ సంసిద్ధత వంటి అంశాలపై స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది. -
ఈపీఎఫ్ పోర్టల్‌లో సమస్యలు.. వినియోగదారులకు చుక్కలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వెబ్ సైట్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది 2021-2022 కాలానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.1శాతానికి పెరిగాయి. అయితే పెంచిన ఆ వడ్డీ రేట్లు ఈపీఎఫ్ పోర్టల్‌లో మాయమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పాస్‌బుక్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తు ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. అయినా పోర్టల్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. జనవరి 14 సాయంత్రం 5గంటలకు అప్డేట్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ తరహా మెసేజ్‌లు గతకొన్ని రోజులుగా అలాగే చూపిస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై వినియోగదారులు ట్విటర్లో ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఈపాస్ బుక్ కనిపించడం లేదంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫిర్యాదులపై ఈపీఎఫ్‌వో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని, యూజర్ల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రిప్లయి ఇచ్చారు. For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 -
మీలో ఈ స్కిల్స్ ఉన్నాయా?, 3.64 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్లు (జీసీసీ) వచ్చే 12 నెలల్లో సుమారు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోనున్నాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో సేవలకు డిమాండ్ నేపథ్యంలో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది. సర్వేలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, ఫార్మా, ఇంటర్నెట్, టెలికం, ఐటీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, తయారీ, చమురు, సహజ వాయువు, రిటైల్ రంగంలో ఉన్న 211 జీసీసీ కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌సహా ఎనమిది నగరాల్లో ఇవి విస్తరించాయి. ‘గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల పరిశ్రమ ప్రస్తుత రూ.2.95 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ.4.94–7 లక్షల కోట్లకు చేరుతుంది. సర్వేలో పాలుపంచుకున్న ఐటీ, సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ రంగ కంపెనీల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు 33 శాతం తెలిపాయి. నియామకాలకు బీఎఫ్ఎస్ఐలో 21 శాతం, ఇంటర్నెట్, టెలికంలో 16 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించాయి. ప్రస్తుతం కార్యకలాపాలలో ఉన్న ప్రపంచ జీసీసీల్లో భారత్ దాదాపు 45 శాతం వాటా కలిగి ఉంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఉపాధిలో ఈ రంగం 2023లో 10.8 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి డిజిటల్, మెషీన్ లెర్నింగ్ స్కిల్స్‌కు ప్రస్తుతం డిమాండ్ ఉంది’ అని నివేదిక వివరించింది. క్లయింట్లు సొంతంగా నిర్వహిస్తున్న డెలివరీ సెంటర్లే జీసీసీలు. -
ఈ గాడ్జెట్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే
ఆకట్టుకునే ప్రతీది అందమే. అందులో కాళ్లూ.. చేతులూ భాగమే. కాలి గోళ్లు, చేతి వేళ్లు.. నాజూగ్గా మారడానికి క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి.. పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటూంటారు. అయితే ఆ శ్రమను తప్పిస్తుంది ఈ రీచార్జబుల్ ట్రిమ్మర్. పెద్దలకే కాదు అప్పుడే పుట్టిన పిల్లలక్కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. నొప్పి తెలియకుండా.. శ్రమ లేకుండా ఈజీగా కాలి, చేతి గోళ్లను చక్కగా శుభ్రపరచుకోవచ్చు. అందుకు కావల్సిన మినీ కిట్ ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకోవచ్చు. పైగా ఇందులో లిథియం బ్యాటరీ ఉండటంతో.. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. 3 స్పీడ్ సెట్టింగ్ ఉండటంతో.. పిల్లలు, పెద్దలు సురక్షితంగా వాడొచ్చు. గోళ్లు షేప్ చేసుకోవడంతో పాటు.. డెడ్ స్కిన్ తొలగించడం, మృదువుగా మార్చడం.. వంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. మెటల్ గ్రౌండింగ్ హెడ్, ఎడ్జ్ ఎక్స్ఫోలియేషన్ హెడ్, నెయిల్ సర్ఫేస్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్, పాయింటెడ్ ఫ్రాస్టెడ్ గ్రౌండింగ్ హెడ్, డిస్క్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్.. ఇలా 5 ప్రత్యేకమైన హెడ్స్‌తో పాటు 3 ప్రత్యేకమైన రోలర్స్ లభిస్తాయి. ఈ డివైజ్‌కి ఎడమవైపు చార్జింగ్ పాయింట్ ఉంటుంది. మరోవైపు.. హెడ్స్ అమర్చుకునే స్క్రూ ఉంటుంది. అలాగే డివైజ్ ముందువైపు.. రోలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో మడమల పగుళ్లు, మృతకణాలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే. ధర సుమారు వెయ్యి రూపాయలు. అయితే రివ్యూలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
మీ ఫోన్లో యాప్స్ డిలీట్ చేసిన తర్వాత ఈ పని చేస్తున్నారా!
సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం. కానీ యాప్స్ డిలీట్ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసినా నోటిఫికేషన్లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూజర్లు యాప్స్ డిలీట్ చేసిన వెంటనే ఇంకో పనిచేయాల్సి ఉంటుంది. అదేంటంటే! స్మార్ట్ ఫోన్‌కి జీమెయిల్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మరి యాప్స్ డిలీట్ చేస్తే..ఆ యాప్స్‌కు అటాచ్ అయిన జీమెయిల్ అకౌంట్ డిస్ కనెక్ట్ అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదు. దీంతో ఈజీగా జీమెయిల్లో ఉన్న మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది. అందుకే యాప్స్‌ను అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యాన్యువల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌కు కనెక్ట్ అయిన జీమెయిల్ అకౌంట్‌ను డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో యాప్స్‌కు కనెక్టైన జీమెయిల్‌ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ►ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి ►అనంతరం సెట్టింగ్‌లో ఉన్న గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి ►గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్ పర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ కనెక్టెడ్ యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ యాక్టీవ్‌గా జీ మెయిల్‌కు ఏ యాప్స్ అటాచై ఉన్నాయో తెలుస్తోంది. వెంటనే ఆ యాప్స్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్‌ను డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు. -
ఇండియాలోనే ఫాస్టెస్ట్ 5జీ ఫోన్... రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ ఫుల్ ప్రాసెసర్, దుమ్మురేగిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసేందుకు ఒప్పో రంగం సిద్ధం చేసింది. జులై 14న సరికొత్త ఒప్పో రెనో 6 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఇప్పటి వరకు మిడ్‌రేంజ్ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో ఒప్పో నుంచి వచ్చిన రెనో సీరిస్ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకున్నాయి.పవర్ఫుల్ ప్రాసెసర్ఇటీవల కాలంలో పవర్ ఫుల్ ప్రాసెసర్‌గా గుర్తింపు పొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 900ని ఈ మొబైల్లో ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేయడంతో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 గిగాహెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఫాస్ట్ ఛార్జింగ్, వైఫై 6 కనెక్టివిటీ, ఆల్ట్రా ఫాస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, బ్యాటరీ మేనేజ్మెంట్ పనులు అద్భుతంగా నిర్వహిస్తుందనే పేరుంది. హాట్‌స్పాట్‌ని ఆన్ చేసి ఉంచనప్పుడు బ్యాటరీ డ్రైయిన్ కాకుండా ఎక్కువ సేపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కంపెనీలతో పోల్చితే కనీసం 30 శాతం బ్యాటరీ ఎక్కువగా వస్తుందని చెబుతోంది.ఫాస్టెస్ట్ 5జీమీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ని ఉపయోగించడం ద్వారా ఇండియాలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని ఒప్పో రీసెర్చ్ , డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరీఫ్ అన్నారు. అత్యంత వేగవంతమైన ఫోన్లో గేమింగ్, వీడియోగ్రఫి, వీడియో కంటెంట్ చూసేప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.మీడియాటెక్ప్రస్తుతం హై ఎండ్ ప్రీమియం ఫోన్లు ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే వాటికి ధీటుగా మీడియాటెక్ ఇటీవల డైమెన్సిటీ 900ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీంతో కొత్త ప్రాసెసర్‌తో రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ని ఒప్పో ఫోన్ తీసుకు వస్తోంది. -
మమ్మల్ని నమ్మండి.. వాట్సాప్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు అడుగుతుందని.. ఫోన్లు, సందేశాలు స్టోరేజీ చేసుకుంటుందని.. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్‌పై వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాట్సాప్ తెలిపింది. దీంతో మంగళవారం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వదంతుల కారణంగా వారం రోజుల్లోనే వాట్సప్‌ను అన్ ఇన్స్టాల్ చేయడం.. అన్‌లైక్ చేయడం చేస్తున్నారు. వాట్సప్ వినియోగం ఆపేసి మిగతా యాప్‌లను వినియోగిస్తున్నారు. పెద్దసంఖ్యలో డౌన్లోడ్స్ ఆగిపోయి.. డిస్ లైక్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికారికంగా స్పందించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చివరి వరకు మీ వ్యక్తిగత వివరాలు మేం రక్షణగా ఉంటామని ప్రకటించింది. వాట్సాప్ ప్రకటనలో ముఖ్యమైన అంశాలు ఫేస్‌బుక్‌కు వాట్సాప్ వివరాలు పంపుతామని అబద్ధం. ఎలాంటి వివరాలు పంచుకోం. మీ వ్యక్తిగత చాట్ వివరాలు ఎవరికీ తెలపం. కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం. కొత్తగా అప్డేట్ చేసిన వర్షన్ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు మీ పరిచయస్తుల (కాంటాక్ట్స్) వివరాలు పంచుకోం. వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయం. మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం. మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు పంపిన లోకేషన్స్ కూడా వాట్సప్ పర్యవేక్షించదు. -
గొడవలు పెట్టుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్..
కూలీకొస్తారా.. అనగా విన్నాం.. పని ఉంది చేయడానికి వస్తారా అని అడగ్గా విన్నాం.. ఈ మధ్య బజార్ కొస్తారా.. అని కూడా చూశాం.. కానీ కొత్తగా లొల్లికొస్తారా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదే కదా మీ డౌట్. అవును చైనాలో అలాగే అడుగుతారు మరి. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారనుకోండి.. టీజ్ చేశారనుకోండి.. లేదంటే ఎక్కడైనా గొడవకు దిగారనుకోండి. అప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేకపోతే.. అందులో పైచేయి సాధించలేకపోతే.. మీ వద్ద అప్పుడు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి.. నోరు మూసుకుని చక్కగా వెనక్కి వచ్చేయడం లేదంటే.. గొడవ పడిన వారితో మీరు అనవసరంగా తిట్లు పడాల్సి రావడం. కానీ చైనాలో ఓ ఆన్లైన్ కంపెనీ దీనికి కూడా పరిష్కారం వెతికి పెట్టిందండోయ్. టావోబావో అనే కంపెనీ మీ తరఫున గొడవ పడేందుకు వేరే వారిని నియమించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా చాలా ప్రొఫెషనల్‌గా గొడవ పడేవారిని మీకు ఆన్లైన్లో చూపిస్తుంది. టావోబావో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ సంస్థ. తాజాగా గొడవలు పెట్టుకునేవారిని కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీరు ఏ విషయంలో గొడవపడుతున్నారు..? ఎవరితో గొడవపడుతున్నారు..? మీరు నియమించుకునే వారు ఎలా గొడవ పడాలి.. ఎదుటి వారిని ఏ మాటలు అనాలి..? ఎంత సేపు గొడవ పడాలి.. ఇలా అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరిస్తే అందుకు తగ్గట్లు సాయం చేస్తారన్న మాట. ఇందుకోసం కొంత డబ్బు వసూలు చేస్తుంది. అయితే గొడవ పడే వారిని నేరుగా మనదగ్గరికి పంపించరు. కేవలం ఫోన్ లేదా మెస్సేజీల ద్వారా మనతో గొడవ పడినవారిని తిరిగి తిట్టేలా ఏర్పాటు చేస్తోంది. గంటకు కేవలం రూ.220 వసూలు చేస్తోంది. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకుని అధ్యాపకులు అత్యాధునిక విద్యాబోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలం గాణ యూనివర్శిటీ పరీక్షల ముఖ్య నియంత్రణ అధికారి ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యలో సమాచార సాంకేతిక పరి జ్ఞానం ఆధారిత బోధనా పద్ధతులపై ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాబోధనలో వినూత్నమైన పద్ధతులు అందుబాటులో ఉన్నా య ని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు సన్మానం గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్‌లో పాల్గొన్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హన్మండ్లు, నరేష్, శిరీషను ప్రొఫెసర్ యాదగిరి ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి, టీయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి ప్రవీణాబాయి, డీఆర్సీ కో ఆర్డినేటర్ రాకేష్‌చంద్ర, కోశాధికారి వినయ్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సాంకేతికంగా నైపుణ్యం పెంపొందించుకోవాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బాలయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన భారతీ ఫౌండేష్ సంస్థ ఎల్లారెడ్డిపేట మండలంలోని 15 పాఠశాలలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మానవీయ విలువలతో జీవించే నిజమైన మనుషులను రూపొందించే వ్యక్తి నిర్మాణ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలన్నారు. భారతీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలల్లో చదివే విద్యార్థులు వారు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాసచారి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అణుగుణంగా విశ్వస్థాయి పౌరులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి ఆంథోని ఢిల్లీ నుంచి స్కైఫ్ విడియోకాల్ ద్వారా ఉపాధ్యాయులతో మాట్లాడారు. అందరినీ భాగస్వాములను చేస్తూ విద్యార్థుల విద్యాస్థాయిని సంస్థ ద్వారా పెంపొందిస్తామన్నారు. ఈనె 23 నుంచి 26 వరకు మండలంలో దత్తత తీసుకున్న 15పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంఈవో మంకురాజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!
వాషింగ్టన్: కంపూటర్లు మన జీవితంలో భాగమైన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు గమనించాం. అంతేకాకుండా కంప్యూటర్ కీబోర్డుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే తాజాగా ఓ కొత్త రకం కీబోర్డులను మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ గ్రూప్ రూపొందించింది. యూజర్ చేతుల ద్వారా చేసే సైగల్ని పసిగట్టి.. దానికి అనుగుణంగా ప్రవర్తించడమే నూతనంగా రూపొందించిన కీబోర్డు ప్రత్యేకత. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లో ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్స్ ను ఎంబెడ్ చేసి కీబోర్డుకు ప్రత్యేకతను చేకూర్చారు. కీ క్యాప్ ద్వారా ప్రతి సెన్సార్ లింక్ ట్రాక్ చేసి యూజర్ చేతి సైగల్ని పసిగడుతుందని మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేతి కదలికలకు అనుగుణంగా స్పందిస్తుందని గిజ్ మ్యాగ్ తెలిపింది. పైకి, కిందకి, కుడి, ఎడమలకు కదిలే విధంగా... ఏదైనా చిత్రాన్ని జూమ్ చేయడం లాంటి కదలికలను పసిగడుతుందని తెలిపారు.