సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ యాదగిరి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకుని అధ్యాపకులు అత్యాధునిక విద్యాబోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలం గాణ యూనివర్శిటీ పరీక్షల ముఖ్య నియంత్రణ అధికారి ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యలో సమాచార సాంకేతిక పరి జ్ఞానం ఆధారిత బోధనా పద్ధతులపై ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాబోధనలో వినూత్నమైన పద్ధతులు అందుబాటులో ఉన్నా య ని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు.
విద్యార్థులకు సన్మానం
గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్‌లో పాల్గొన్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హన్మండ్లు, నరేష్, శిరీషను ప్రొఫెసర్ యాదగిరి ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి, టీయూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి ప్రవీణాబాయి, డీఆర్సీ కో ఆర్డినేటర్ రాకేష్‌చంద్ర, కోశాధికారి వినయ్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment