ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో 400 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్ధిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్‌లో భాగంగా చోటామోటా కంపెనీల నుంచి దిగ్గజ టెక్నాలజీ సంస్థలకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
తాజాగా, ఇటీవల జరిగిన బెల్ వర్చువల్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ వందల మందికి లేఫ్స్ నోటీస్ చదివి వినిపించారు. ఈ లేఆఫ్స్‌పై ఆ సంస్థ సీఈఓ స్పందించారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలో మార్పులు చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో 4,800 మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తొలగింపుల అంశం జాబ్ మార్కెట్‌లో చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment