కొత్త ఏడాదిలో ఐటీ రంగంలో నియామకాలు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మంది ఫ్రెషర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంచనా నెలకొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్ నియమించుకోగా.. ఆ సంఖ్య మరింత తగ్గిపోవడం జాబ్ మార్కెట్‌లో ఆందోళన కనపిస్తుంది.
ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో 1.5 మిలియన్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా అభ్యర్ధుల్లో స్కిల్స్ లేని కారణంగా నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగం మినహాయిస్తే ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
40శాతం మందిలో స్కిల్స్
టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్నీ అర్హతలు కేవలం 45 శాతం మంది దగ్గర ఉండటం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ), కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ, రిటైల్ కన్స్యూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఎనర్జీ వంటి నాన్-టెక్ సెక్టార్‌లతో గణనీయంగా నియామకాలు పెరగే అవకాశం ఉండగా.. వాటిల్లో అధిక శాతం ఫ్రెషర్‌లనే ఎంపిక చేసుకోనున్నాయి.
సీనియర్లు, ఫ్రెషర్స్ అయినా.. ఈ స్కిల్ ఉంటే
ఈ సందర్భంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులు ఆయా టెక్నాలజీలలో నిష్ణాతులైతే చాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో టెక్నికల్ నైపుణ్యం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి హార్డ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్, సమస్యకు పరిష్కారం, టీమ్‌వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాఫ్ట్ స్కిల్స్ ఉన్న సీనియర్లు, ఫ్రెషర్స్ కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.
ఈ సర్టిఫికేట్ కోర్స్‌లున్నాయా?
టీమ్‌లీజ్ డిజిటల్‌సైతం అభ్యర్ధులు జాబ్ సంపాదించుకునేందుకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలనే అంశంపై కొన్ని సలహాలు ఇచ్చింది. కంపెనీలకు తగ్గట్లు కావాల్సిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందాలని సూచించింది.
వాటిల్లో ప్రధానంగా ఆర్ సర్టిఫికేషన్‌తో కూడిన డేటా సైన్స్, ఎస్‌క్యూఎల్, సర్టిఫికేషన్ ట్రైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే బ్లాక్‌చెయిన్ వెబ్ డిజైన్ సర్టిఫికేషన్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ తో పాటు కావాల్సిన అన్నీ అర్హతలు ఉంటే కోరుకున్న ఉద్యోగం మీదేనని టీమ్ లీజ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment