సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
Published Fri, Aug 19 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సాంకేతికంగా నైపుణ్యం పెంపొందించుకోవాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బాలయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన భారతీ ఫౌండేష్ సంస్థ ఎల్లారెడ్డిపేట మండలంలోని 15 పాఠశాలలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మానవీయ విలువలతో జీవించే నిజమైన మనుషులను రూపొందించే వ్యక్తి నిర్మాణ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలన్నారు. భారతీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలల్లో చదివే విద్యార్థులు వారు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాసచారి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అణుగుణంగా విశ్వస్థాయి పౌరులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి ఆంథోని ఢిల్లీ నుంచి స్కైఫ్ విడియోకాల్ ద్వారా ఉపాధ్యాయులతో మాట్లాడారు. అందరినీ భాగస్వాములను చేస్తూ విద్యార్థుల విద్యాస్థాయిని సంస్థ ద్వారా పెంపొందిస్తామన్నారు. ఈనె 23 నుంచి 26 వరకు మండలంలో దత్తత తీసుకున్న 15పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంఈవో మంకురాజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement