దండియా మస్తీ
శరద్‌కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి. గార్బాడ్యాన్స్‌తో ఘాగ్రా, చోలీ డిజైనింగ్స్‌లో మెరిసిన మగువలు సందడి చేశారు. ‘ప్రీ నవరాత్రి వార్మప్’ సందర్భంగా శుక్రవారం ఎ లా లిబర్టీ బంకెట్ హాల్‌లో కళ్లు చెదిరే నృత్యంతో అదరహో అనిపించారు. సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌లీలా మూవీలోని ఓ పాటకు బొమ్మ తుపాకులు చేతపట్టి యువతులు డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్ మీనా మెహతా, శశి నహతా నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ రంగులద్దుకున్న సంప్రదాయ హంగులను ఏకకాలంలో కళ్లముందుంచింది.