దిల్‌దార్ దాండియా | Dildar dandiya game to be ready for dasara festival in Hyderabad city | Sakshi
Sakshi News home page

దిల్‌దార్ దాండియా

Published Wed, Sep 17 2014 4:52 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దిల్‌దార్ దాండియా - Sakshi

దిల్‌దార్ దాండియా

దసరా వస్తోంది... నవరాత్రుల్లో నగరాన్ని ఊపేయడానికి దాండియా ఆటా రెడీ అంటోంది. కోకనట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘దిల్‌దార్ దాండియా’ నిర్వహిస్తోంది. షామీర్‌పేట్ మల్లిక గార్డెన్స్‌లో తొలిసారి అతి పెద్ద ఈవెంట్‌కు రంగం సిద్ధమయింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్‌లో మంగళవారం నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ టికెట్ లాంచింగ్ కలర్‌ఫుల్‌గా సాగింది.

దాండియా నృత్యాలు, మోడళ్ల ఫ్యాషన్ షోలతో పాటు మిసెస్ సౌత్ ఏషియా రుచికాశర్మ, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మెరుపులు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సందర్భంగా ‘దిల్‌దార్ దాండియా’ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ నవరాత్రి సంబరాల్లో మహిళలు, ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని వారు తెలిపారు. ఇక దాండియా, గర్బా ఆడేవారిని ఉత్సాహ పరిచి ప్రోత్సహించేందుకు బహుమతులూ అందిస్తామన్నారు. ఆగకుండా గర్బా డ్యాన్స్ చేసే వారిలోంచి ఒకరు ప్రతిరోజు  హోండా యాక్టివా గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే... చివరి రోజు లక్ష రూపాయల వరకూ నగదు బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.
 ఫొటోలు: ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement