రామ్లీలాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి బుర్రలేదా: బాంబే హైకోర్టు | High Court directs CBFC to re-consider its certification to 'Ramleela' | Sakshi
Sakshi News home page

రామ్లీలాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి బుర్రలేదా: బాంబే హైకోర్టు

Published Wed, Dec 18 2013 7:02 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

రామ్లీలాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి బుర్రలేదా: బాంబే హైకోర్టు

రామ్లీలాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి బుర్రలేదా: బాంబే హైకోర్టు

సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ప్రణయ దృశ్య కావ్యం 'రామ్లీలా'కు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు అసలు సీబీఎఫ్సీ బుర్రపెట్టి ఆలోచించిందో లేదో చూసుకోవాలని బాబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ చిత్రానికి అసలు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. దీపికా పదుకొనే, రణ్బీర్ సింగ్ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలు, ముద్దు సీన్లు నిండా ఉన్న ఈ చిత్రంపై హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ ఎంఎస్ సోనక్ తీవ్రంగా స్పందించారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని నిబంధనలను ఓసారి మళ్లీ చూసి, ఆ సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వచ్చో లేదో చెప్పాలన్నారు.

నిబంధనలకు అనుగుణంగానే తాము సర్టిఫికెట్ ఇచ్చినట్లు సీబీఎఫ్సీ చెప్పినా, బుర్రపెట్టి ఆలోచించినట్లు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. శ్రీ మహారాష్ట్ర రామ్లాలా మండల్ ఉపాధ్యక్షుడు సందీప్ శుక్లా దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థ ప్రతియేటా ఆజాద్ మైదాన్లో నవరాత్రుల సందర్భంగా రామ్లాలా ఉత్సవం చేపడుతుంది. అసలా చిత్రం పేరే తప్పుదోవ పట్టించేలా ఉందని శుక్లా తన పిటిషన్లో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement