సదా సౌభాగ్యవతీ భవ | Deepika Padukone And Ranveer Singh's Wedding | Sakshi
Sakshi News home page

సదా సౌభాగ్యవతీ భవ

Published Sat, Nov 17 2018 3:57 AM | Last Updated on Sat, Nov 17 2018 3:57 AM

Deepika Padukone And Ranveer Singh's Wedding - Sakshi

దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌

దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ వేడుకలు ముగిశాయి. కానీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కపుల్‌ మ్యారేజ్‌ విశేషాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దీప్‌వీర్‌ వివాహ వేడుకల గురించి ప్రచారంలో ఉన్న హైలైట్స్‌ కొన్ని...

► నిశ్చితార్థం రోజున దీపికా వేలికి రణ్‌వీర్‌ తొడిగిన ఉంగరం ఖరీదు సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్లు ఉండొచ్చని సమాచారం.

► ఈ వివాహ వేడుకకు బీమా కూడా తీసుకున్నారట దీప్‌వీర్‌. వివాహానికి బీమా ఏంటి? అనుకుంటున్నారా. దీప్‌వీర్‌ పెళ్లి, సంగీత్‌ కార్యక్రమాలన్నీ ఇటలీలోని ఓ హోటల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలు జరిగే హోటల్స్‌లో ఏదైనా డ్యామేజ్‌ జరిగినా, అగ్నిప్రమాదం, ఏదైనా వస్తువు పోవడం, లేదా ఇంకేదైనా నేచురల్‌ డిజాస్టర్‌ జరిగినా ఆ బాధ్యత ఆ హోటల్స్‌ తీసుకున్నవాళ్లే భరించాలన్నది నియమం. ఇవన్నీ ఆ బీమా పాలసీ కిందకే వస్తాయట. ఆ హోటల్స్‌లో ఏ వేడుక చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి అట.

► వివాహం తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ తండ్రి జగ్‌జీత్‌ సింగ్‌ భవ్నానీ కొత్త కోడలు దీపికా పదుకోన్‌తో సరదాగా ‘ఏ దీవానీతో భవనానీ హో గయీ’ అన్నారట.

► దీపికా పదుకోన్‌కు రణ్‌వీర్‌ తరపువారు పెట్టిన పెళ్లి వస్త్రాల్లో ‘సదా సౌభాగ్యవతీ భవ’ అనే శ్లోకం ఉందట. అలాగే తలపై ధరించిన మేలి ముసుగులో కూడా అదే శ్లోకం బంగారు వర్ణంతో రాయించారని సమాచారం.
మరి రానున్న రోజుల్లో ఇలాంటి హైలైట్స్‌ ఇంకెన్ని బయటికొస్తాయో చూడాలి. అన్నట్లు దీప్‌వీర్‌ ఆదివారం ముంబై చేరుకుంటారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement