![Deepika And Ranveer’s Wedding Began With Nandi Puja - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/3/deepika.jpg.webp?itok=je7yuWTE)
పూజ తర్వాత దీపిక సందడి
ఒకవైపు ప్రియాంకా చోప్రా– నిక్ జోనస్ పెళ్లి పనులు హుషారుగా జరుగుతుంటే ఇంకా దీపికా పదుకోన్– రణ్‌వీర్ సింగ్ ఏంటీ? సైలెంట్‌గా ఉన్నారు అని అనుకునేవాళ్లందరూ ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీప్‌వీర్ (దీపిక–రణ్‌వీర్ జంటను ఇప్పుడు ఇలానే పిలుస్తున్నారు) పెళ్లి సందడి బెంగళూరులో మొదలైపోయింది. దీపికా తల్లి ఉజ్వల్ పదుకోన్ నంది పూజతో పెళ్లి పనులను స్టార్ట్ చేశారు. దీపిక కాస్ట్యూమ్ స్టైలిస్ట్ షలేనా నాథానీ, హెయిర్ స్టైలిస్ట్ గాబ్రియల్ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ నెల 14, 15 తేదీల్లో తాము ఒక్కటి కాబోతున్నట్లు దీపిక–రణ్‌వీర్ ఈ ఏడాది అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీప్‌వీర్ వెడ్డింగ్ ఇటలీలో జరగనుందని బాలీవుడ్ టాక్. ‘‘దీపికా సౌత్ గర్ల్. రణ్‌వీర్ సింగ్ నార్త్. అందుకనే ఇటు దక్షిణాది అటు ఉత్తరాది సంప్రదాయాల ప్రకారం రెండు రకాల పెళ్లి వేడుకలను ప్లాన్ చేశారట. అలాగే ముంబైలో ఒకటి, బెంగళూరులో మరొక రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు దీప్‌వీర్. ఈ నెల 10న అందరూ ఇటలీకి ప్రయాణం అవుతారు.
పూజ చేస్తున్న దీపిక
Comments
Please login to add a commentAdd a comment