
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్
సాధారణంగా సినిమా వాళ్లకు రిలీజ్ విషయంలో, డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడుతుంది. హీరోయిన్స్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో క్లాష్ వస్తుంది. తాజాగా దీపికా పదుకోన్‌కు, ప్రియాంకా చోప్రాకు విభిన్నంగా పెళ్లి విషయంలో క్లాష్ ఏర్పడేలా ఉందని బాలీవుడ్ మీడియా టాక్. దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌ల వివాహం నవంబర్ 14,15 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత నవంబర్ చివరి వారంలో ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. అయితే విచిత్రంగా నిక్ జోనస్‌తో ప్రియాంకా వెడ్డింగ్ కూడా నవంబర్ నెలాఖరులో అని ఒక తేదీ, డిసెంబర్ ఒకటి, రెండూ తేదీల్లో అని మరో వార్త వినిపిస్తోంది.
ఈ ప్రేమికుల వివాహం జో«ద్‌పూర్‌లో గ్రాండ్‌గా జరగనుందని తెలిసిందే. ఒకవేళ దీపికా రిసెప్షన్ తేదీ, ప్రియాంక పెళ్లి తేదీ, టైమ్ కూడా ఒకటే అయితే అప్పుడు ఈ ఫంక్షన్‌లు క్లాష్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. అదే కనుక జరిగితే అటు వెళ్లాలా? ఇటు వెళ్లాలా? రెండు వేడుకలకూ ఎలా ప్రెజెంట్ వేయించుకోవాలా? అని సెలబ్రిటీలు తికమక పడక తప్పదు. క్లాష్ ఉన్నా లేకపోయినా బాలీవుడ్‌లో కొన్ని రోజుల పాటు పెళ్లి కళ మాత్రం కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment