బర్త్‌డే గిఫ్ట్... | Birthday Gift ... | Sakshi
Sakshi News home page

బర్త్‌డే గిఫ్ట్...

Published Thu, Jan 8 2015 12:44 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బర్త్‌డే గిఫ్ట్... - Sakshi

బర్త్‌డే గిఫ్ట్...

బాలీవుడ్‌లో లేటెస్ట్ హాట్ జంట దీపికా పడుకొనే, రణవీర్‌సింగ్. ఎక్కడ చూసినా ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. న్యూ ఇయర్‌తో అయిపోయిందనుకున్న ఎంజాయ్‌మెంట్.. జనవరి 5 దీపిక 29వ పుట్టిన రోజు వరకు కంటిన్యూ అయింది. సొంతూరు బెంగళూరులో ఫ్యామిలీతో ఉన్న సొట్ట బుగ్గల చిన్నదాన్ని రణవీర్ వదలనే వదలలేదట. ఆమెను ఓ విలాసవంతమైన షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లి... ‘విలువైన’ ఐటెమ్స్ ఎన్నో కొనిపెట్టాడనేది ఓ వెబ్‌సైట్ కథనం. అంతే ఇదిగా దీపిక కూడా జతగాడిని తన ఊరంతా తిప్పేసింది. పనిలో పనిగా తన కోసం కూడా కొన్ని ఐటెమ్స్ కొనుక్కున్నాడు. మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్‌ల్లో ఇరువురూ ఒకరి కంపెనీని ఒకరు ఆసాంతం ఆస్వాదించేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement